సంపూర్ణ అవతార వాణి
బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్
బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్
(116) ఇక్ తూహి నిరంకార్
ఎల్లప్పుడు ఈ సాధు సజ్జనులు , హరి మాటోకటే పలికెదరు
జ్ఞానులైనను భక్తిని వదిలినా , తుదకు నీటిలో మునిగెదరు
మిత్రులారా ప్రేమ భక్తి చేయుము , భక్తి ఫలములు అందేను
హృదయ దర్పణములు ఉజ్వలమగును , మనసు శుద్ధిని పొందెను
పవిత్ర కోమల గురు పాదముల , ప్రేమను మదిలో నింపెదరు
జన్మజన్మల మలినము తొలగి , స్వంతింటికి వారు చేరెదరు
నీవును కూడా దీనిని తెలిసి , ఇతరులకు కూడా జపింపుము
మరిచెను దీనిని లోకమంతయు , లోకమునకు దారి చూపించుము
నామమే నీ నిజమైన సంపద , దీనిదే చేయుము వ్యాపారం
“ అవతారు ” ని మాటిది నీవనుక్షణము , అనుము “ నీవే నీవే నిరంకారం ”
భావార్ధం::
గురు భక్తులు లేక గురు ప్రేమికులు సదా తెలిపెదేమనగా జ్ఞానవంతులైనప్పటికి
భక్తిని వీడితే మాయకు లోనై అదోగతి పాలవుతారు.
వీరు ఎల్లప్పుడూ ,” ఓ మిత్రులారా ! హరి భక్తి
చేయండి , తద్వారా మీ హృదయ దర్పణం శుభ్రపడి మరియు మనసులో
అహంకారాది వికారాల నుండి విముక్తిని పొంది
పవిత్రమవుతుంది.. సద్గురుని యొక్క
పవిత్రమైన మరియు కోమలమైన చరణాలయందు ప్రేమ
కలిగి ఉన్నచో , అనేక జన్మల పాపాలు మరియు సంస్కారాలు
నశించి నీ నిజ గృహంలో నివాస
మేర్పరచుకోగలవు.
ఓ మిత్రులారా ! మీరు స్వయంగా హరిని తెలుసుకొని , ఇతరులకు కూడా ప్రేరణ కలిగించి హరినామంతో జోడించండి. నేడు ప్రపంచం
భక్తి విషయంలో భ్రమలకు లోనై ఉంది . వారికి సరియైన మార్గము చూపించండి.
హరి నామమే అసలైన సంపద . దీనిని వ్యవహారంలో ఉపయోగించుకొని మరియు ‘నీవే నిరంకర్ , నీవే నిరంకార్ ’ అనుచూ ఎల్లప్పుడూ ఈయన్నే స్మరిస్తూ ఉండుము.
వ్యాఖ్య :
భౌతిక మాయను కాక పరమాత్మను ఎవరు ప్రేమిస్తారో
వారే నిజమైన సంత్ మహాపురుషులు . వారు ఏది ఆచరిస్తే ఇతరులకు అదే
ఉపదేశిస్తారు . మరియు భక్తి యొక్క
ఆవశ్యకతను వివరిస్తూ దీనిని వదిలితే జ్ఞాని కూడా మాయకు లోనవుతాడని
తెలుపుతారు. ఎందుచేతనంటే తులసి దాస్ తెలిపినట్లుగా
“ రామచంద్ర కే భజన్ బినా జో చాహే పడ్
నివాణ్
జ్ఞానవంత్ ఆపి సో నర్ , పశు బిన్ పూంచ్ విషాణ్ !!
-
తులసి దాస్ – రామ చరిత మానస్ 7 / 78
దీని అర్ధం : “ ఆత్మజ్ఞాని కూడా గురు భక్తి లేక పోతే , అటువంటి వారు మానవుడు అయి ఉండీ తోకా , కొమ్ములు లేని
పశువుతో సమానం . ఏలనన భక్తి లేక జ్ఞాని కూడా అధోగతి పాలై పతనమౌతాడు . ”
ఇతరత్రా కూడా ఈ విషయాన్నే తెలియజేసారు .
“ ఇంద్రియాలను వశపరచుకున్న యోగులు
గురుదేవుని చరణాలను శరణు వేడక అతిచంచలమైన చపలత్వంతో కూడుకున్న మనసు అనే గుర్రాన్ని
, తాము వశము చేసుకోవాలని ప్రయత్నిస్తారు . కానీ అది తమ సాధన
ద్వారా సఫలీకృతం అవదు . అటువంటి వారు మళ్ళీ మళ్ళీ విచారము మరియు ఆపదలను ఎదుర్కొన వలసి వస్తుంది. చివరకు
వారికి శ్రమ మరియు దుఃఖము మాత్రమే మిగులుతుంది.
వీరి స్థితి నావికుడు లేని నావలో సముద్ర యానం చేస్తూ వ్యాపారం చేసినట్లు
ఉంటుంది ” – భాగవతం
10 ( 87- ౩౩ )
జ్ఞానము మరియు భక్తికి ఆధారం సద్గురువే.
ఎందుచేతనంటే బ్రహ్మజ్ఞానం గురువుద్వారా లభిస్తుంది. తద్ఫలితంగా
గురువుకు తనువు , మనస్సు , ధనములతో సేవ చేస్తూ మరియు
సమర్పించు కోవటమే భక్తీ అనబడుతుంది. ఈ
గురు సేవ బ్రహ్మ భావముతో చేయబదినదే కాని వ్యక్తి భావముతో కాదు.
హృదయ ధర్పనం గురు భక్తి వలన మాత్రమే నిర్మలమవుతుంది . నిరంకారి బాబా హరదేవ్
సింగ్ జీ మహారాజ్ వారు తెలిపినట్లుగా, “ We cannot see our reflection
in a dry lake ” – ‘ఎండిన ( నీరు లేనటువంటి ) సరస్సులో మన
ప్రతిబింభాన్నిదర్శించ లేము. ’
దీని భావము మలినాలతో ( వికారాలు – కామ, క్రోద
, లోభ , మోహ, మద ,
మాశ్చ్యర్యాలు ) కూడుకున్న హృదయములో పరమాత్మను దర్శించలేము. ఈమలినాలు సద్గురు యొక్క చరణ ధూళి ద్వారా
మాత్రమే శుభ్రపరచుకోగలం.
సాధారణమైన నీటికి భక్తి తోడైతే చరణామృతముగా; భోజనానికి భక్తి తోడైతే ప్రసాదంగా ; పరివారంలో
భక్తి ప్రవేశిస్తే మందిరముగా ; మనస్సులో భక్తి ప్రవేశిస్తే సంత్
మహాపురుషులుగా పరివర్తన చెందుతారు. అంటే
భక్తికి మూలం సద్గురువే కాని అన్య ధర్మ కర్మాచరణలు కాదు.
భక్తి మనలోని వికారాలను తొలగించి , అంతర్లీనంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని అభివ్యక్త పరచటము.
దీనికి సద్గురువు యొక్కశిక్షణ అత్యంత దోహదకారి అవుతుంది . జ్ఞానము మరియు భక్తి
మూలరూపములో ఒకటే. అయితే జ్ఞానము దృడపడి ప్రేమగా పరిణతి చెందటమే భక్తి. జ్ఞానము వలన భక్తి
పరిపూర్ణమవుతుంది. ఈ కారణం చేతనే శ్రీ కృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి 11 వ
అధ్యాయములో నిరాకార పరమాత్మ యొక్క జ్ఞానాన్ని తెలిపి 12వ అధ్యాయంలో భక్తిని
ఉపదేశించారు.
నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు
, “ జ్ఞానులారా ! సరళ మార్గాన్ని ( భక్తి ) వీడి కఠిన మార్గంలో పయనించి కష్టాలు కొని తెచ్చుకోవటం
వల్ల మీరు పొందే లాభమేమిటని
ప్రశ్నిస్తున్నారు.
జ్ఞానము లేక భక్తి సంభవము కాదు మరియు భక్తి వలననే జ్ఞానము సురక్షితముగా ఉంటుంది. భక్తుడు కూడా తన
సద్గురువుకు సమర్పితుడై నిశ్చింతుడౌతాడు .
ఏ రకంగా నైతే అర్జునుడు తన గురువైనటువంటి శ్రీ కృష్ణ భగవాణున్ని రధసారధిగా
చేసుకొని నిర్భయుడయ్యాడు.
భక్తుడు కూడా మనస్సు అనే కళ్ళెమును సదా సద్గురు ఆధీనములో ఉంచుతాడు. (
కఠోపనిషత్తులో శరీరాన్ని రధముతో , ఇంద్రియాలను గుర్రాలతో మరియు మనస్సుని కళ్ళేముతోనూ పోల్చబడ్డాయి)
ఆది గ్రంధము తెలిపినట్లు:
“ మన్ బేచే సద్గురు కే పాస్
తిస్ సేవక్ కే కారగ్ రాస్ ! ”
-
ఆది గ్రంధము
దీని భావము – మనస్సుని సద్గురువుకి అర్పించిన
సేవకుని సకల కార్యాలు సిద్ధిస్తాయి .
భక్తుడు గురుసేవ ద్వారా లభించినటువంటి
రామ నామ ధనముతో తన జీవన వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఇహపర లోకాల్లో సుఖ ప్రాప్తిని పొందుతాడు.
సద్గురు ముఖత ఇచ్చినటువంటి బీజ మంత్రము
, “ తూహీ నిరంకార్ ;
మై తేరీ శరణ హా ;
మైనూ భక్ష్ లో “
ను ప్రతి నిముషము స్మరిస్తూ పరమాత్మకు తనను తాను సమర్పించుకుంటూ చేసే దైనందిక
కార్యాలన్నీ , అటువంటి భక్తుని భక్తిగా
మార్పుచెందుతుంది.
నేడు అనేక మంది సద్గురు ద్వారా హరిని దర్శించకనే భక్తి చేస్తూ భ్రమలకు
లోనవుతున్నారు. ఎందుకనగా యజమాని (
భగవంతుడు) ని గుర్తెరగక భక్తి ఎవరికి
మరియు ఎలా చేయగలరు ? అంధకారంలో తిరుగాడటం
వలన ఏమి లాభము ?
సంతానం లేనటువంటి స్త్రీతో , “ నీ బిడ్డను ప్రేమించు ,
సమయానికి పాలు త్రాగించు ,
పాఠశాలకు పంపించు ” అని తెలుపుట వలన ఎటువంటి ఉపయోగమూ లేదు. ఇదే
పరిస్థితి గురు జ్ఞానము లేని భక్తుడిది .
ప్రతిమానవుడు స్వయంగా జ్ఞానంతో కూడుకున్నభక్తిని పొంది , తరువాత భ్రమలకు లోనై ఉన్న ఇతరులను సన్మార్గం వైపు
మరలించాలని నిరంకారి బాబా తెలుపుతున్నారు.
“ గురు చరణాలే హరిచరణాలు ”
హరి నిరాకారుడు. నిరాకార పరమాత్మ సేవ చేయుట సాధ్యము కాదు . అందుచేతనే భక్తిలో
సాకారం యొక్క ఆవశ్యకతను నొక్కి
వక్కానిస్తున్నారు. కావున సాకార రూపం
ధరించిన గురువుకు బ్రహ్మభావముతో చేసే సేవయే భక్తి. అందుచేతనే
“ గురు చరణాలే హరిచారణాలు ”
“ గురు భక్తియే హరి భక్తి ” అని చెప్ప
బడుతుంది.
(115)
ఇక్ తూహి నిరంకార్
చివరికి నీతో ఈ లోకంలో , సిరి సంపదలు పోలేవు
నువ్వు నమ్మిన ఈ లోకంలో , ఏవి నీకు పని రాలేవు
భార్యపిల్లలు బంధు బలగము , ఇంకెవరున్నా నీ తోడు
ఏలవుదువు వీరికి అధికారివి , కారు ఎవ్వరు నీ వారు
రాజ్యం నీదై నీకు ఉన్ననూ , ఉన్నను సంపదలెన్నైనా
భోగ సుఖంబులు దొరుకును గాని , తప్పదు పోవుట ఎపుడైనా
ఏనుగు గుఱ్ఱము మోటరుకారు , ఎదైననూ నీ వాహనము
అసత్యమసత్యమిదంతమాయా , అసత్యమంతా ఈ జగము
ఏ మూర్ఖులు ఈ కరుణానిధిని , దాతను ఎవరు మరచెదరో
“ అవతారు ” ని మాటిది నామము లేక , వారు తుదకు అనుభవించెదరు
భావార్ధం:
ఓ
మానవుడా ! ఏ ప్రాపంచిక సంపద కోసం నీ మనసు పరితపిస్తుందో , మృత్యు
సమయములో అది నీ వెంట వచ్చేది కాదు. సంసార
రూప మాయతో ఏ అనుబంధాన్నైతే నీవు
పెంచుకుంటున్నావో , అంతిమ
సమయంలో అది నీకు ఏ విధముగానూ తోడ్పడదు.
ఏ
భార్యా పిల్లలు , ప్రాణమిత్రులు మరియు బంధుబలగము నీవారనుకుంటున్నావో వారు నీ వారు కారు.
భోగభాగ్యాలు
, సిరి సంపదలు తాత్కాలికమైన కీర్తిని , శాంతిని
ప్రసాదించవచ్చేమోకాని మృత్యువు నుండి మాత్రం తప్పించ జాలవు.
విలాసవంతంగా
జీవించటానికి తోడ్పడే భౌతిక సంపదంతయూ మిధ్య , అంటే
స్వప్నమువలె అసత్యమైనది.
క్షమాశీలుడైన
పరమేశ్వరుడిని క్షణకాలం కూడా తలవని
మూర్ఖుడు నామహీనుడై మరియు అంత్య కాలంలో పశ్చాతాప పడవలసి వస్తుందని
నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు తెలుపుతున్నారు.
వ్యాఖ్య
:
పై
శ్లోకం ద్వారా నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు మానవుని యొక్క కర్తవ్యాన్ని తెలుపుతూ , “మనసును
నశ్వరమైన సంసారం నుండి మరలించి అవినాశి ప్రభు పరమాత్మను పొందటానికి
ప్రయత్నించండి ” అని
తెలుపుతున్నారు.
ఈ మానవ జనం అనేక జన్మల పుణ్యాల ఫల స్వరూపంగా లభించింది.
ఈ అవకాశం అత్యంత అమూల్యమైనది , దుర్లభమైనది
. పరమాత్మను పొందటమే ఈ మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. అనంత కాలం నుండి
కొనసాగుతూ వస్తున్న జనన మరణ చక్రమునుండి విడుదల పొందటానికి ఇదే ఏకైక అవకాశం. కావున ఈ మానవ జన్మ పొంది కూడా మనం ప్రాపంచిక మాయ అనే ఊబిలో కూరుకొని పోయి ఉన్నట్లయితే , పరమాత్మ
ప్రాప్తి యొక్క మార్గంలో పురోగమించక పోయినట్లయితే
, మన ఈ మానవ జన్మ వ్యర్ధంగా గడిచి పోతుంది . మనం దీని మూల ఉద్దేశాన్ని
నెరవేర్చడంలో విఫలమైన్న వారమవుతాం.
సంత్
రవిదాస్ ఈ విధంగా అంటారు:
“ పూర్వ పుణ్య ఫలమున దుర్లభ జన్మను పొందితివి , అవివేకమున వృధాయైపోవును
హరి భక్తి నెరపకున్న ఇంద్రభవనము, ఇంద్ర సింహాసనముల ఉపయోగమేమీ ?”
-
సంత్ రవిదాస్
అంటే
దీని భావము పరమాత్మను తెలుసుకోకుండా ఎన్ని భోగములు ఉన్నప్పటికీ అవన్నియూ వృధాయే. అదే ఆ ఒక్కడినీ మనవాడిగా చేసుకొనిన యెడల సర్వ
భోగములు మన సొంతమే.’
కాని
నేడు మానవుడు అత్యల్పమైన వాటి వెంట పడుతూ వాటిని పొందటానికి అత్యంత
కష్టపడుతున్నాడు. సద్గురువును ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకొనిన యెడల సత్యాసత్యాలు , నిత్యానిత్యాలు
మరియు ధర్మాధర్మాల విచక్షణ కలిగి ఉండి శాశ్వత ఆనందాన్ని కలుగ చేసే శ్రేయో
మార్గాన్ని అవలంభించవచ్చు.
నిరంకారి
బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ వారు ఇలా అంటారు :
“ If the path is
beautiful do not ask where it leads to ”
‘
మార్గము సుందరమైనదైతే అది ఎక్కడికి
వెళుతుందో అడగవద్దు. ’
ఎందుచేతనంటే
సుందరమైన మార్గం సుందరమైన ప్రదేశానికే తీసుకు వెళుతుంది.
ప్రాపంచిక విషయాల వెంట పరిగెత్తటంలోనే తన
కాలాన్నంతటినీ వ్యర్ధం చేసుకొని , జీవితం యొక్క
బాహ్య ఆకర్షణలకు లోనై పరమాత్మ ప్రాప్తి అనే అమూల్యమైన అవకాశాన్ని
చేజార్చుకోరాదు అని యుగయుగాలలో అవతరించిన సంతులు, భక్తులు
, గురువులు ఆచరణాత్మకంగా తెలియచేసారు.
సిరి
సంపదలు , సతీసుతులు ఎన్ని ఉన్నప్పటికీ అంత్య కాలమున ఈ జన్మసాఫల్యం చేసుకోవటానికి ఇవేమీ
తోడ్పడవు. జన్మ సాఫల్యతకు తోడ్పడేటటువంటి పారమార్ధిక సంపదను ఆర్జించటానికి ఈ
అమూల్యమైన జీవితకాలాన్ని ఉపయోగించుకోవాలి.
ఈ
సత్యాన్నే సంత్ రవిదాస్ గారు ఈ క్రింది విధముగా తెలిపారు.
“
పునాదులు తీసి ఎత్తుగా గోడలు నిర్మింతువు
తుదకు ఆరు అడుగుల చోటుయే చాలు నీకు ! ”
“ నీ భవనము
ఉన్నతము , నీ నారీ సుందరము
కాని రామ నామము లేక , ఓటమి పొందును నీ జీవన పందెము ! ”
“ ఉన్నత భవనములు , సుందరమగు భోజన శాలలున్నను
మృత్యువు ఆసన్నమైన , గడియయైనా అధికము వశింపజాలదు ! ”
చివరకు తన గురించి తెలుపుతూ :
“ జగమంతయు మృత్యువు నోటనున్నది
నేను ఒక్క రామనామమును జపించి
విముక్తుడనైతినని పలుకును రావిదాసు ! ”
అందుచేతనే
గురునానక్ వారు తెలిపినట్లుగా :
“నీవు
బంజర భూమికి నీరు పెట్టడంలోనూ , ఇసుక
గోడలను కట్టడం లోనూ ఎందుకు కాలాన్ని వ్యర్ధం చేసుకుంటావు ?
మనస్సును ఎద్దుగా కట్టి , హరి
భక్తి అనే బావిగిలక తాడుతో రామ నామమనే అమృతాన్ని పొంది దానితో జీవనమనే పంట
పొలానికి నీరు పెట్టు. అప్పుడే ప్రభువనే తోటమాలి నీ పనులకు నీపై ప్రసన్నుడౌతాడు”
_ శ్రీ గురు నానక్
సద్గురును
ఆశ్రయించి నామిని తెలుసుకొని నామమును గురు ముఖత పొంది నిరంతర నామస్మరణతో జీవన
ప్రయాణాన్ని కొనసాగించటమే మానవ జీవిత లక్ష్యమని నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ
మహారాజ్ వారు తెలుపుతున్నారు.
వర్తమానంలో
ఇదే సత్యాన్ని నిరంకారి బాబా హరదేవ సింగ్ జీ మహారాజ్ వారు తెలియచేస్తున్నారు.
అవతార వాణి చంద్రిక
The Book “ Avtar Vani Chandrika ” ( Telugu ) containing Avtar Vani slokas with
commentary is now available in the
market . For copies contact Shri. G.S S. Prasad Raju Contact No : 9490831947
Holy Avtar Vani
Shabad No. 1
O’ Thou, beyond form, color and lineament I bow unto Thee a million times;
O’ Thou, beyond the comprehension of mind, intellect and wisdom, I bow unto Thee a million times. O’ Thou, the infinite fathomless Lord, I bow unto Thee a million times; O’ Thou the Lord Paramount, the Supreme Sovereign, I bow unto Thee a million times. O’ Thou, the eternal, beyond time and the omnipresent, I bow unto Thee a million times; O’ Thou, the emancipator of the sinners in all ages, I bow unto Thee a million times. O’ Thou, the knower of all the beings from within, I bow unto Thee a million times; O’ Thou, the Divine Name and the supreme entity it means, I bow unto thee a million times. O’ Thou, the nurturer of all living beings, I bow unto Thee a million times; Avtar says, O’ the sustainer of the life- breath, I bow unto Thee a million times. O’ God, Thou art my refuge and support, I sacrifice my body and mind unto Thee; Avtar says, I sing Thy glory day and night. None can move without thy command; Avtar says, I cannot accomplish anything, everything happens as per Thy will. |
Meaning
You are the one who is formless, color less and infinite and I bow million times onto your feet. You are certainly beyond the comprehensions of mind, intellect and wisdom and I bow million times onto your feet. My lord, you are endless and incomprehensible (beyond the understanding) and I bow million times onto your feet. You are the Lord of Lords, and I bow million times onto your feet. You are eternal, beyond the time, omnipresent and I bow million times onto your feet. You are the redeemer of sinners in all the ages and I bow million times onto your feet. You are omniscient and the all-knowing one and I bow million times onto your feet. You are the divine name and you yourself are the one it represents and I bow million times onto your feet. You are the sustainer of all the living beings and I bow million times onto your feet. Avtar says, you are the sustainer of life-breath and I bow million times onto your feet.
భావార్థము:
హే పరమాత్మా! నీవు నామ రూప భావ రహితుడవు; మనో బుద్ధి ఇంద్రియాలకు అగోచరుడైనటువంటి వాడవు; నీవు అనంత అఖండ అభేద్యుడవు; నీవు రాజులకే రాజువయ్యా, ఆది నుండి అనాది వరకు ఉన్న సర్వవ్యాపివి. అన్ని యుగాలలో పాపులను కడతేర్చే పతిత పావనుడవు. సకలజీవులలో అంతర్యామిగా ఆత్మ రూపం లో ఉన్న ప్రాణాదారుడవు నీవు. అనేక నామాలతో నీ గుణగణాలను కీర్తించి నప్పటికీ, సకల జీవులను పోషించేది నీవే. అటువంటి నీకు శతకోటి ప్రణామములు.
హే పరమాత్మా! నీవే నన్ను రక్షించేవాడివి, నిన్నే నేను ఆధారంగా చేసుకున్నాను. నా శరీరము, మనసు నీకే అర్పిస్తున్నాను. హే పరమాత్మా! నిరంతరము నీ గుణ గణాలను కీర్తించే శక్తిని ప్రసాదించు. నీ ఆదేశానికి విరుద్ధంగా సృష్టిలో ఏ కార్యము జరుగదు. హే పరమాత్మా! నీవు అనుకున్నదే జరుగుతుంది. నీ సంకల్పము లేనిదే ఈ సృష్టిలో ఏది జరుగజాలదు.
Holy Avtar Vani - Shabad No. 2
Thou art manifest in every particle of the universe and every leaf bears Thy name;
I behold Thy image everywhere and all around. Thou art the fragrance in sandalwood and purity in the Ganges: Thou art the radiance in the Sun and Coolness in the Moon. Thou art the beauty in flowers, and the tenderness in buds; Thou art the wisdom in intellect, and Thou art the art and the skill. Thou art the True Master in Baba Buta Singh, and the Tenth Dimension in Thy abode. Avtar Says, the True Master has endowed me with his own diction and his likeness. |
Meaning
You are present in each and every particle of the universe and each leaf has your name written over it. I can see and feel you all around me. You are the fragrance in sandalwood and purity in Ganga. You are radiance (glow) in the sun and the calmness and coolness in of moon. You are the beauty of flowers and delicacy of the buds. You are the wisdom in thoughts and you yourself are the art as well as the skill. You are present as a True Master in the form of Baba Buta Singh and this tenth dimension i.e. almighty Nirankar is your abode (house). Avtar says that the true master has bestowed upon me his own word (that I speak) , his mien and his attire.
భావార్ధం:
ఈ శ్లోకములో, పరమాత్మ, జగత్ మరియు సద్గురువు ఒకే ముఖానికి మూడు పార్శ్వాలు అని శాస్త్ర ప్రామాణికంగా తెలుపుతున్నారు. ప్రతి అణువులో, జడ చైతన్యాదులలో, సర్వత్రా నీ రూపాన్నే దర్శిస్తున్నాను. నశ్వరమైన తొమ్మిది దృశ్య వస్తువులకు (సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నీరు, అగ్ని, ఆకాశము(శబ్దము), జీవుడు మరియు వాయువు) అతీతుడైనటువంటి పరమాత్మని, సద్గురు కృపతో అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను.
భావార్ధం:
Holy Avtar Vani - Shabad No. 3
Truth is my prayer and worship, true is my present action of the True One;
Truth is what I practise, Truth is what I distribute and Truth is my trade and occupation. The true one has revealed the Truth to me and united me with the Truth; True is the foundation and true is the structure, and I preach the Truth. Truth pulsates in every pore of mine and Truth is the true sustainer of my life-breath; Truth is the ocean, Truth are the waves, Truth is the boat, and Truth is the sailor. Truth is the path and worship of Truth, true is the shop and true is the trade; This True One is true alone, the Formless One- Nirankar who pervades all the beings. Buta Singh has revealed this Truth with his boundless grace; Avtar says, I sacrifice my all at the holy feet of the True Master. |
Meaning
True, is the your worship (O, almighty nirankar) and to think of you is also true. I share, distribute and deal only this truth now. The true master has revealed this truth to me in the form of divine knowledge and by doing so has connected the chord of my life with this truth. Now, I have realized that my foundation is truth, my structure is truth and now I preach only this truth. I can feel this truth in each and every pore of my body and this truth is my true life-breath. This is the truth which is the ocean itself as well as the waves, the boat as well as the oars (patwar, in hindi). On this journey of truth, my capital is truth, my shop is true and my trade is of truth. This true one (almighty God) is the only true one and this formless is present in each and every particle of the universe. This truth has been revealed to me by my true master Baba Buta Singh ji by his own kindness and generosity that is boundless. Avtar says, I sacrifice and surrender all that I have at the feet of my True Master.
భావార్ధము:
సమయపు సద్గురువు నుండి పొందిన బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి తరువాత, నేను నిత్యము చేసే పూజా హారతులు మరియు భావాలు సత్యమైపోయినవి. పరమాత్మతో యోగమైన నాకు ఈ జ్ఞాన ప్రచారమే ప్రధమ వృత్తి. సద్గురువు జీవాత్మను పరమాత్మతో యోగము చేయటము వలన, నా జీవనానికి సత్యమునే పునాదిగా చేసుకొని, నేను ఈ సృష్టి అంతయు పరమాత్ముని స్వరూపముగా దర్శించి, ఈ సత్య ప్రచారము చేస్తున్నాను. రోమ రోమాలలో సత్యాన్ని నింపుకొని, ప్రతి శ్వాసకి ఈ సత్యాన్నే ఆధారంగా చేసుకొని జీవిస్తున్నాను. ఈ సత్ సంపదను ( సృష్టిలోని ప్రతి వస్తువులో సత్యాన్ని దర్శించే దృష్టి కలిగి ఉండటము) అందించినటువంటి సద్గురుని చరణాలకు సదా శరణాగతుడనే !
Holy Avtar Vani - Shabad No. 4
|
Intellect and imagination cannot reach upto His boundless grace;
If the Almighty Himself bestows His grace, He may crown even a pauper. If this Supreme Benevolent Lord bestows His grace, the people all over the world may become his servants; If this Formless One-Nirankar bestows His grace, He may turn an illiterate into a scholar. If the perfect True Master is pleased, he may bestow one with name and fame; If the perfect True Master is pleased, he can bestow the person with leadership of the world. If the perfect True Master is pleased, he can make the people of the whole world follow him; If the perfect True Master is pleased, he can get anything accomplished. What am I and what is my worth? The True Master does all and gives me the credit; Avtar says, the True Master is pleased with me,even if the whole world listens to it |
Meaning
Flights of our intellect and imagination can’t even reach the infinite grace of this almighty God. If he himself bestows his grace then he may even crown a poor person. He is a benevolent master who if bestows his grace then the whole world may be at one’s beck and call. If he the formless one bestows his kind grace, then he may even make an illiterate person as a scholar. If the perfect True Master is pleased then he may bless one with name and fame. If the perfect True Master is pleased then he may even bless one to lead this world. If the perfect True Master is pleased then he may make the whole world follow one. If the perfect True Master is pleased then he may get anything accomplished through anyone. I am nothing and I don’t have any value and only my True Master does all and gives credit to me. Avtar says, the whole world must know this that my True Master is well pleased with me.
భావార్ధం:
పరమాత్మ లేదా సద్గురు యొక్క కృప ఎంతో అపారమైనది, మనసుకి బుద్ధికి అందనటువంటిది. సద్గురువు చరణాలను ఆశ్రయించటము మూలాన, వారి దివ్య గుణాలను పొందటమువలన బీదవాడు ధనవంతుడగును(ఆధ్యాత్మికంగా) . ఇట్టి వాడిని
జగమంతా గౌరవిస్తుంది. అత్యంత అల్పుడైనటువంటి నాకు, ఈ జీవన ప్రయాణములో స్ఫూర్తి, కీర్తి సద్గురువు యొక్క అనుగ్రహము వలననే లభించాయి.
Holy Avtar Vani - Shabad No. 5
|
I am a human being like any other human being and I have received no different entity;
The True Master has bestowed the divine knowledge and blessed me with the vision to behold God. All that I speak is the True Master’s grace and all that I write is an expression of his grace; It is with the grace of my True Master that I am perceiving the Formless One- Nirankar. Ever since I surrendered to him, Nirankar has become my own; And this is what I deal and dispense, this is my sole occupation. This Nirankar has come to dwell in my mind with the kind grace of the True Master; The love of this Colorless One-my beloved, has permeated every pore of mine. I tread the path as shown to me by the True Master; Avtar says, I do whatever has been ordained by the True Master. |
Meaning
I am an ordinary human being with no special identity. My true Lord Master blessed me with the lead of God-Knowledge and a vision to see almighty God. Whatever I say or write is the grace of my True Master. It is with the grace of my true master only that I am observing this Formless one. Ever since I surrendered myself unto him, the Formless One has become mine. Now, I practice and share this Nirankar who has become the only pursuit of my soul. This formless one now dwells in my heart with the grace of my True Master. Love of this Beloved who is without any color permeates my whole being. I walk on the path shown by the True master. Avtar says, I do whatever is ordained by the True Master.
భావార్ధం:
నేను ఇతర మానవులవలేనే సాధారణమయినటువంటి మానవుడను. నాలో ఇతరులకంటే గొప్ప సామర్ధ్యము ఏమియు లేదు. సద్గురుని చరణాలను ఆశ్రయించి, దివ్య చక్షువులను పొంది, నిరంతరము హరిని దర్శిస్తూ ఉండటమే నన్ను ఇతరలకంటే గొప్ప స్థితిలో ఉంచింది.
సద్గురుని కృపతో అంతటా రమించి ఉన్న రాముని ఉనికిని గుర్తిస్తూ, వారి వచనాలనే పలుకుతాను. నేను ఎప్పుడైతే సద్గురువుకి సమర్పితుడయ్యానో , అపుడే నిరాకారుడు నావాడయ్యాడు. సదా ఈ నిరాకారునితో వ్యవహరిస్తూ, సత్య ప్రచారము చేయటమే ఈనాడు నా జీవిత లక్ష్యంగా మారింది. రూప రహితుడు, అణువణువున నిండి ఉన్నటువంటి నిరాకారుడు, నా హృదయములో స్థిర నివాసము ఏర్పరుచుకున్నాడు. నా గురుదేవుడు బ్రహ్మవిద్య ప్రచారానికై ఏ మార్గాన్ని అనుసరించమని తెలిపారో, ఏ కార్యాన్ని నిర్వర్తించమని ఆదేశించారో, చివరి శ్వాస వరకు దాని నుండి వైదొలగను.
Holy Avtar Vani - Shabad No. 6
The formless True Master has ordained me to remove the veil of ignorance from the eyes;
The formless True Master has ordained me to enlighten the ignorant. The formless True Master has ordained me to reveal the Formless One- Nirankar; The formless True Master has ordained me to bestow comfort to worldly people. The formless True Master has ordained me to preach the Formless One; The formless True Master has ordained me to deal and dispense the Formless One. The formless True Master has ordained me to dispel all types of darkness; The formless True Master has ordained me to purify the mind of whosoever approaches me The world may frighten me to any extent but I cannot give up this task; Avtar says, whether I live or die, I cannot deviate from the path. |
Meaning
I am ordained by the Formless True Master to remove the veil of ignorance from the eyes. I am ordained by the Formless True Master to show the way to the ones gone astray. I am ordained by the Formless True Master to reveal this Formless One. I am ordained by the Formless True Master to give shower bliss on to the worldly people. I am ordained by the Formless True master to promote and trade the knowledge of the Formless One. I am ordained by the Formless True Master to disperse all the darkness of ignorance. I am ordained by the Formless True Master to purify the mind of each and every seeker. Although, the world may frighten me as much as it can but I can’t leave this sacred task. Avtar says, whether I live or not, I cannot turn my back towards my True Master.
భావార్ధము:
నిరాకార పరమాత్ముని సాకార స్వరూపుడైన నా సద్గురువు యొక్క దివ్య ఆదేశము నాకు లభించినది .
అజ్ఞానపు తెర తొలగించమని, భ్రమలో ఉన్న వ్యక్తుల భ్రమలు తొలగించమని, ఆత్మ జ్ఞానమును పంచమని, ఏ జిజ్ఞాసువు శరణు అంటాడో వానికి నిరాకార ప్రభు పరమాత్మ జ్ఞానము ఇచ్చి, విశ్వమంతటిని స్వర్గతుల్యము చేయమని, ఏకేశ్వరుని ప్రచారము చేయమని , నామ ధన వ్యాపారమే చేయమని, ఆధ్యాత్మిక అంధకారమును దూరము చేయమని.
లోకంలోని మూడులు ఎన్ని భయ భ్రాంతులు కల్పించినను నేను ఈ ఈశ్వర ప్రచారము చేస్తాను, దీనిని నేను వదలను. నా ప్రాణాలు ఉన్నా, లేకున్నప్పటికి , నేను ఈ పరోపకార కార్యము నుండి ముఖము చాటేయను. దీని భావము ప్రాణాలను ఫణంగా పెట్టి అయినా ఈ కార్యాన్ని చేస్తూనే వుంటాను .
భగవంతుని కార్య నిమిత్తము , నా శరీరము నశించిననూ, భౌతిక సంపదలను కోల్పోయిననూ, సత్యాన్ని వ్యతిరేకించే ఈ లోకం నన్ను దూషించి, నిందించి, విమర్శించినా గాని, ఈ మార్గాన్ని అనుసరించటానికి భయపడినా గాని, నేను ఎన్నుకున్న ఈ సత్య మార్గంలోనే పయనిస్తాను.
Holy Avtar Vani - Shabad No. 7
This body of mine is a heap of dust, let it go if it be so;
All my wealth and belongings may go if it be so, Let the world inimical to Truth fabricate all kinds of rumours; Let the world inimical to Truth level all kinds of accusations. Let the world inimical to Truth be afraid to speak the truth; Let the world inimical to Truth criticize me as vociferously as they can. Let factionalism and sectarianism clamour against me to their heart’s content; Let the blind world oblivious of the Almighty bewail and cry. Even if the whole world turns hostile to me, I cannot deviate from the path of Truth; Avtar says, none can refute the word of the True Master. |
Meaning
This body of mine is just a mass of dust, let it perish if it be so. All my material belongings may be lost, if it be so. Let the world opposed to Truth spread all kind of rumors. Let the world opposed to Truth, level all kinds of accusations. Let the world opposed to Truth be scared of proclaiming the Truth. Let the world opposed to Truth insult as much as it can. Let factionalism and sectarianism make as much cry as they can. Let the blind world ignorant of the Lord Master regret and cry. Even if the whole world turns unfriendly, I can’t deviate from this path of Truth. Avtar says, no one can disprove the word of the True Master.
భావార్ధము:
భగవంతుని కార్య నిమిత్తము , నా శరీరము నశించిననూ, భౌతిక సంపదలను కోల్పోయిననూ, సత్యాన్ని వ్యతిరేకించే ఈ లోకం నన్ను దూషించి, నిందించి, విమర్శించినా గాని, ఈ మార్గాన్ని అనుసరించటానికి భయపడినా గాని, నేను ఎన్నుకున్న ఈ సత్య మార్గంలోనే పయనిస్తాను.
అజ్ఞాన అందకారాలలో మునిగి వున్న లోకం, ఎన్ని విధాలుగా వ్యతిరేకించినప్పటికిని ఈ మార్గము నుండి వైదొలగను.సత్యాన్ని, అసత్యం చేయ దలిచే ఈ లోకపు ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి.
Holy Avtar Vani - Shabad No. 8
Those who took up the task of preaching the Truth, the world did not spare them;
Saints always faced every ordeal without any fret and frown. The self-willed always ridiculed the saints and dubbed them as crazy and insane; Motivated by self-interest, they kept on clashing with them. Those gone astray dubbed even a prophet as following the wrong path; Unperturbed , these saints kept on tolerating their jeers and taunts. The fanatic and bigot rulers were always inimical to them; The blind religious leaders- Qazis and Pandits, kept on issuing decrees against them. Such people do not value the living but light the lamps at the graves; Avtar says, these imprudent people are adamant on their stand even today. |
Meaning
Those who took upon themselves the propagation of truth were opposed tooth and nail by the world. But, still the saints put up with every trouble without any worry and frown. The willful always make fun of the saints and tag them as crazy and mad. Motivated by self-interest, they kept on clashing with the saints. The wayward labeled even a prophet who came to show them the way, as the tempter. Unaffected by the sarcastic remarks, these saints of the lord exhibited tolerance. Rigid and extremist rulers always did their best to provoke these saints. The blind clergy Qazis and Pundits, kept on condemning the saints. While the saints are not valued while they live, homage is offered to their graves. Avtar says, such ignorant people are adamantly following their orthodox rigidity even today.
భావార్ధము:
అన్ని యుగాలలో సత్య మార్గాన్ని ఎన్నుకున్నవారిని ఈ లోకం శత్రువులుగా భావించి విమర్శలు,నిందలతో వారి జీవితాన్ని దుర్లభం చేయ ప్రయత్నించారు.. అయినప్పటికీ అవతార పురుషులు చిరునవ్వుతో మరియు ధైర్యంతో ఈ కష్టాలను సహిస్తూ సదా ఈ మార్గంలోనే జీవనాన్ని సాగించారు. ధర్మానికి రక్షకులుగా చెప్పుకునేవారు, మరియు పండితులు స్వార్థంతో అవతార పురుషులను సంఘ వ్యతిరేకులుగా, మతి భ్రమించిన వారిగా చిత్రించటానికి ఎన్నో కుయుక్తులు పన్నారు. అవతార పురుషులను వారి జీవిత కాలంలో గౌరవించకపోగా , అపఖ్యాతి పాలు చేసి, . మరణానంతరం వారి సమాధులకు పూజలు చేస్తున్నారు. విస్మయ పరిచే విషయము ఏమిటంటే, నేటికి వారిని భగవంతుడిలా పూజిస్తున్నప్పటికి, వారు నడచిన మార్గాన్ని వదిలేసి, వ్యతిరేక మార్గంలో పయనిస్తున్నారు.
Holy Avtar Vani - Shabad no. 9
Just as even the best medicine cannot be effective without observing the precautions;
Likewise, no task can be accomplished without practical action. One cannot attain the dust of the feet of the saints, without reverence in the heart; Divine knowledge can never take roots in the heart unless accompanied by faith in the True Master. Divine knowledge cannot be attained without the grace of the True Master and the mind cannot stop oscillating without divine knowledge; Avtar says, unless we abide by the five pledges, the divine world cannot be imbibed. |
Meaning
As the best medicine is not effective without practicing prescribed precautions and no task can be carried out without the practical actions. Similarly, one cannot gain saints’ blessings till he does not have respect in the heart. Likewise God knowledge (Brahmgyan) cannot stay in the heart unless one has absolute faith in the True Lord Master (Satguru). God realization is possible only with the blessings of the True Master and cannot be attained without HIS (Satguru) grace. Moreover, the instability of mind cannot be stopped without the divine knowledge. Lastly, the divine world cannot be understood unless we practice the five commandments (panch pran).
భావార్ధము:
ఏ విధంగానయితే, ఔషధాన్ని స్వీకరించాక, పథ్యము కనుక చేయకపోతే శరీరానికి స్వస్థత చేకూరదో, అదే విధంగా పొందిన జ్ఞానాన్ని ఆచరణలో కనుక పెట్టకపోతే, జీవితములో ఎలాంటి ఉపయోగము ఉండదు. జ్ఞానము సద్గురువు యొక్క కృప వలన లభిస్తుంది. సద్గురుని యందు వున్న శ్రద్ధ, భక్తి, విశ్వాసముల వలననే సద్గురుని కృపకు పాత్రులవ్వగలం. గురువు లేనిదే జ్ఞానము కలగదు, జ్ఞానము లేనిదే మనసు నిలువదు. సమయపు సద్గురువుకిచ్చిన అయిదు ప్రమాణాలు పాటించనిచో తత్వ బోధ కూడా అర్ధం కాదు.
Holy Avtar Vani - Shabad no. 9 (a)
The greatest gift of God to you is this beautiful body;
But consider it as a trust by God and nothing belongs to you. It is the mind swayed by whom you are all the time Indulging in fruitless wandering; You consider whole of the world as yours and you are indulging in false pride. All palaces , mansions, the family, tribe and all your wealth; All that is visible is false , and a moving shadow While making use of all these assets , if you remain conscious of the Divine Will You will not be afflicted by the malady of ego, O’ man, you will always remain joyful Treat all the assets as ultimately belonging to the One who owns them and there should be no dispute about it; Avtar says , the first pledge is that the body, mind and material possessions belong to The formless One – Nirankar. |
Meaning
The greatest gift of God to you, O’ man, is this beautiful body; but you should consider it as a trust by God, and nothing belongs to you. It is the mind, influenced by whom, you are misled every time. You consider everything as yours and in result, you are indulging in the false pride. The palaces and mansions, your family, tribe, wealth, all what you possess; all that is visible is false, and just a moving shadow. While making use of all these assets, if you will surrender to the Divine will; you shall not be troubled with the disease of ego, and will always remain happy. O’ man, you must treat all your assets as belonging to God and there should be no dispute about this; Avtar says, the first pledge is that the body, mind and material assets all belong to the Formless God - Nirankar.
భావార్ధము:
ఈ శరీరము భగవంతడు మానవునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వరం. దీనిని భగవంతుడిదిగా భావించి ఉపయోగించుకోవాలి., కానీ దేహాన్ని ఆత్మగా భావింఛి, త్యాధ్యాత్మం చెందకూడదు. మనలో కలిగే అహంకారానికి మనసే మూలం. మనసు నేను, నాది అనే అహంకారం కలిగి వుండటం వలన , పరి పరి విధాలైన దుఃఖాలకు కారణ భూతమవుతుంది. నాది నాది అనుకునేది ఎప్పటికి మనది కాదు. ఏదైతే నాదో దాని గురించి మనకు తెలియదు. సమస్త దృశ్య వస్తువులు అన్నియు అసత్యమైనటువంటివి, కదిలే చాయ లాంటివి. మనకు వరముగా లభించినటువంటి ఈ శరీరాన్ని, భగవంతుని ఆజ్ఞానుసారము, ఆయన నిమిత్తమే ఉపయోగించాలి. అహంకారము నశించినపుడే ఆనందం ప్రాప్తిస్తుంది. శరీరము, మనసు, ధనము తనవిగా భావించక, భగవంతునివిగా భావించటమే మొదటి ప్రమాణం.
Holy Avtar Vani - Shabad no. 9 (b)
The same divine spirit permeates all, whether man or women;
A Brahman , Kshatriya, Vaish or a Harijan, all the people belong to the One – God. All have the same physical structure carved by the same Almighty – God. Then , why should there be wrangles of caste and creed , where is the need to appease the People? Hindus, Muslim, Sikhs , Christians , all belong to one God ; You should love them all as human beings whether they are good or bad. When the same God dwells in all then who is bad who is good? Just as the filth that immerses in the Ganges becomes the Ganges itself. Treat all human beings alike and shed your vanity; Avtar says , the second pledge is not to believe in caste and social divisions. |
Meaning
The same divine spirit is present in every human being, male or female; May be a Brahmin, Kshatriya, Vaish or Sudra [by caste], all are the creation of the One - God. All have a similar human body, carved (shaped) by the same Almighty; then why should there be disputes of caste and creed; and where is the need to calm down the people? Hindus, Muslims, Sikhs and Christians, all are the children of one God. You should love them all as human beings, whether they are good or bad. When the same spirit of God is present in all, then who is good and who is bad? Just as the dirt that submerged in The Ganga becomes Ganga itself. You must treat all human beings alike, and shed your ego and pride. Avtar says, the second pledge is not to believe in caste, creed and social divisions.
భావార్ధము :
స్త్రీ అయినా, పురుషుడు అయినా, అందరిలోనూ వున్నది ఒకటే ఆత్మ. సృష్టి కర్త మరియు ఆయన సృష్టి ఒకటే. దేహ నిర్మాణం ఒకటే అయినప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అంటూ జాతి వర్ణాల ఆధారంగా అడ్డు గోడలు నిర్మించడమెందుకు. జాతి పరమైన భేదభావన విడనాడి, అందరిని మానవులుగా తలచి సమభావాన్ని కలిగి వుండి, మంచి చెడులకు అతీతంగా ప్రేమించాలి. అందరు
ఒకే పరమాత్మ రూపాలయినప్పుడు, వారిలో మంచి చెడులనే కల్పన మిధ్య మాత్రమే. కలుషితమైన నీరు గంగలో కలసి గంగ అయినప్పుడు, పరమాత్మ స్వరూపుడైన మానవుడిని అపవిత్రుడిగా ఎలా భావించగలం? జాతి వర్ణాల ఆధారంగా అహంకారాన్ని ప్రదర్శించరాదని రెండవ ప్రమాణం తెలుపుతోంది.
Holy Avtar Vani - Shabad no. 9 (c)
|
On this earth , different seasons have different climate;
People have different styles of dress and have different types of diet. God has neither prescribed nor forbidden any particular food; Whatever we eat or drink relates the body and has no relevance to the soul. O’ man , sit and ponder sometime with a cool mind; How does it harm you whether somebody wears a Dhoti , along underwear or Shalwar. You may eat , Drink and dress yourself as you prefer; But don’t preach the same unto the world and thus increase the wrangles. Avtar says , God can be realized only by shedding all your ego; The third pledge is not to hate anybody on account of what he wears , drinks and eats. |
Meaning
On this earth, different seasons have different climatic conditions; as a result, people wear different styles of dress and have different diet plans. God has neither prescribed (approved) nor banned any particular food; whatever we eat or drink that is related to the body and has no relation with the soul.
O’ man, sit and think over sometime with a relaxed mind; how does it matter to you if somebody wears a dhoti, long underwear or shalwar? You may eat, drink and wear whatever you like. But don’t preach it to the world and add on to the disputes. Avtar says, God can be realized by shedding all your ego and pride. The third pledge is not to hate anyone on account of what he wears, drinks and eats.
భావార్ధము:
దేశ కాలాల మార్పుననుసరించి , ఋతువులలో పరివర్తనను గమనిస్తున్నాము. భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులను అనుసరించి మానవుని వస్త్ర, ఆహారపు అలవాట్లు ఆధారపడి వుంటాయి.
ఇదే కాకుండా, మానవుని యొక్క ఆహారపు అలవాట్లపై వస్త్రదారణపై కాని భగవంతుడు ఎలాంటి నియమాలను, నిషేధాలను విధించలేదు. ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ శరీరానికి సంబందించినటువంటివే కాని నిర్లిప్తమైన ఆత్మకు ఏ సంబంధము లేదు. ఎలాగైతే దేహానికి సంబందించిన జనన మరణాలు, శైశవ, యవ్వన, వృద్ధ్యాప్యం దశలతో ఆత్మకు ఎట్టి సంబంధము లేదో,అదే విధంగా శరీరానికి సంబంధించిన ఆహారపు, వస్త్రపు అలవాట్లతో ఆత్మకు కూడా ఎలాంటి సంబంధం లేదు. ఓ మానవుడా! శాంత మనసుతో కూర్చొని ఆలోచించు. ఇతరుల వస్త్రధారణ, ఆహారపు అలవాట్ల వలన నీకేమి హాని కలుగుతుంది? నీకు నచ్చినట్లుగా తింటూ, ఉంటూ ఆనందంగా జీవించక ఇతరులను విమర్శిస్తూ వ్యర్ధ వాదోపవాదాలు ఎందుకు చేస్తావు? అహంకారము త్యజించిన వారికే భగవంతుని సాన్నిధ్యము లభిస్తుంది. ఆహారపు , వస్త్ర అలవాట్ల కారణంగా ఎవరిని ద్వేషించరాదు. ఇదే మూడవ ప్రమాణం.
Holy Avtar Vani - Shabad no. 9 (d)
O’ Man, you should not leave your hearth and home , and wander from door to door;
Lead a normal family life, do not become an ascetic wearing saffron clothes. O’ man do not go begging alms, by assuming false appearance and wandering aimlessly; Earn your bread on your own and do not be burden on others. Always submit cheerfully to the will of God and do not waste your life in doubts and delusions; Avtar says, the fourth pledge is to lead life as a householder and not to become a pretender. |
Meaning
O’ man, you should not leave your home, and wander from place to place. However, lead a normal family life and need not to put on saffron clothes. O’ man, you are not going to gain anything by begging alms, assuming false appearance and wandering aimlessly. You should earn your livelihood on your own, and do not be a burden on others. You should always submit cheerfully to the Will of God, and do not waste your precious human life in doubts and delusions. Avtar says, the fourth pledge is to lead life as a householder, and not getting into the false appearances.
భావార్థము:
ఓ మానవుడా , పరమాత్మ యొక్క జ్ఞానం మరియు భక్తిని పొందుటకు పరివారాన్ని వదలి భిక్షమెత్తుకొని ఫకీరు వేషం వేసుకొని తిరుగుట అవసరము లేనేలేదు. కాషాయవస్త్రములు ధరించి, చేయవలసినటువంటి పనులను నిర్వర్తించకుంటే , సమాజానికి భారమవటముతో పాటు భక్తి యందు శ్రద్ధ తగ్గి భగవంతుని కృపకు పాత్రుడవు కాలేవు. భగవంతుని ప్రాప్తి కొరకు కాషాయము ధరించి సన్యసించటమే శరణ్యం అన్న ప్రలోభానికి నీవు లోనుకావద్దు. ఇట్టి భ్రాంతులకు లోనయి సమయాన్ని వృదా చేసుకోకుండా భగవంతుని ఇచ్చని యధావిధిగా స్వీకరించి, సంసారంలో వుంటూనే భక్తిని చేయాలి. గృహస్థ బాధ్యతలు విస్మరించి, కపట సాధువులా మారవద్దు అని బాబా అవతార్ సింగ్ జీ ఈ నాల్గవ ప్రమాణం ద్వారా తెలుపుతున్నారు.
Holy Avtar Vani - Shabad no. 9 (e)
One cannot make ornaments just by sitting at a Jewellers shop for one day;
A student cannot be called a teacher even if he becomes a monitor. What can one teach who himself has joined the school just today ? After assimilating his own lessons only can he teach others. You should never vacillate from the Divine Secret (God) I am revealing unto you; Avtar says, the fifth pledge is not to divulge it to anyone without being ordained to do so. |
Meaning
One cannot make ornaments just by sitting at the jeweler’s shop for one day. A student cannot be called a teacher even if he becomes a monitor. The one who has just joined the school, what guidance can he provide to others? He can teach, only after learning his own lesson. O ’man, you should never deviate (turn aside) from the divine secret as being revealed (disclosed) to you. Avtar says, the fifth pledge is not to reveal (disclose) this divine secret to anyone without being assigned (allocated) to do so.
భావార్ధము :
స్వర్ణకారునితో స్నేహముచేసినంత మాత్రాన ఆభరణాలను తయారుచేసే నైపుణ్యం పొందలేము. విద్యార్ధి ఎంత తెలివితేటలు కలిగివున్నప్పటికిని తరగతి నాయకుడైతే అవ్వగలడేమో కాని ఉపాధ్యాయుడు కాజాలడు. స్వయంగా తనే విద్యార్ధి అయినప్పుడు ఇతరులకు ఏమి బోధించగలడు.?
ముందు తను సద్గురువుని ఆశ్రయించి భక్తి శ్రద్దలతో ఈ విద్యని తెలుసుకొని ఆచరణలో పెట్టిన నాడే ఇతరులకు బోధించే సామర్ధ్యాన్ని పొందగలడు .
Holy Avtar Vani - Shabad no. 10
|
O’ man , look above , and you see the sun the moon and the stars;
Their glow will vanish one day and they all will cease to exist. Look beneath, and you see the earth, the fire and the water with their vast expanse; Even this visible world will perish one day. In between are the air, the life-spirit (Jeeva) and Akash(with sound as its attribute), all in their subtle form, The combination of these three elements will also vanish once for ever. These nine elements are visible and they are termed as the Creation. The Tenth is the Supreme Being (Brahm) distinct from these nine elements and yet pervading them all. All this (visible) will perish and ‘ Nothing’ will remain at last, O’ my friends; Avtar says this ‘Nothing’ is ‘Everything’ and this is known as the formless one- Nirankar.
Meaning
O’ man, you see the Sun, the Moon and the Stars above in the sky; Their shine will go one day, and they all will vanish. Down below, you see the Earth, the fire and the water, with their vast (huge) expanse (spread). Even this visible world will perish (vanish) one day. In between, you find the air, the life spirit (Jeeva) and the Akash (Awaaz-, in hindi) (with sound as its characteristic), all in their subtle (fine) form. The combination of these three elements will also vanish once for ever. These nine elements, which constitute the ‘matter’ can be seen or visualized and are termed as the Creation. The tenth is the Supreme Being [Brahm, Nirankar], distinct (dissimilar) from these nine elements, yet present in them all. O’ my friends, all this (visible) will perish (vanish) and ‘Nothing’ will remain at last. Avtar says, ‘Nothing’ that will remain in the end, is ‘Everything’ and this is known as the Formless One - Nirankar
భావార్ధం :
పైన కనిపించేటటువంటి సూర్య చంద్ర నక్షత్రాలలో ఉన్నటువంటి ప్రకాశంతోపాటు అవి కూడా నశించిపోయేటటువంటివే , క్రింద ఉన్నటువంటి భూమి ., జలము మరియు అగ్ని వీటిపై ఈ ప్రపంచం యొక్క ఉనికి ఆధారపడి ఉన్నప్పటికీ ఇవి కూడా నశించేవే. మధ్యలో ఉన్నటువంటి వాయువు , జీవుడు మరియు ఆకాశం ఈ మూడూ కూడా నశించిపోయేటటువంటివే కాక క్షణభంగురమైనటువంటివి . ఈ తొమ్మిది వస్తువులనే మాయ అంటారు .పదవది అవినాశ తత్త్వం అయిన బ్రహ్మం. ప్రకృతి పరమైన నవద్వారాలకు , తొమ్మిది దృశ్యమాన వాటికి విలక్షణమైనది అయినప్పటికీ వాటి మధ్య లోనే వుంది. మాయ క్షణభంగురమైనదగుట వలన ఇది నశించేటటువంటిది. ఈ తొమ్మిది దృశ్య వస్తువులను మినహాయిస్తే మిగిలేటటు వంటిదే అవినాశ బ్రహ్మ. దీనినే బాబా అవతార సింగ్ వారు నిరంకారుడు అని తెలిపారు.
|
(114) ఇక్ తూహి నిరంకార్
యెదలో సద్గురు
మాట వెలసినా , నిండుగ ప్రకాశమును నింపు
మనసు పొందును
ఆనందమును , చింతలను దూరము పంపు
జీవన పయనం
సుఖమయమగును , సులభమగును నీ ప్రతి కఠినం
జగతిలోన
సత్కారముండును , ఎవరిడిచెదరో అభిమానం
సెగల పొగల ఈ
లోకము నందు , హరినామమిచ్చును చల్లదనం
నిరాకారుని
స్మరించుచుండు , కలుగును నీకు ఉపశమనం
తొలగిపోవును
నీ భయ భ్రాంతి , మనోవాంచ నెరవేరుతుంది
ప్రేమ భక్తి
ఒకటైపోతే , ఆత్మ ప్రకాశం అవుతుంది
నశ్వరమైనది
ఏది నిత్యమో , ఇది అట్టి ఇంటిలో ఉండును వాసం
“
అవతారు ” ని మాటిది ఈ జగమంతా , అల్లిక కధ ఇది
ఒక స్వప్నం
భావార్ధం :
ఏ వ్యక్తి మనసులో సద్గురు ప్రధానం చేసిన ఆత్మ
జ్ఞ్ఞానం ఉంటుందో, అట్టివానికి సర్వమంతా దేదీప్యమానంగా కనబడుతుంది. వారి మనసు
సంతసించి మరియు హృదయ భారము దూరమగును.
ఇట్టి భక్తుల ప్రతి కఠినమైన పనులు సరళమై మరియు వారి జీవన యాత్ర అత్యంత సుఖ
ప్రదమౌతుంది. . అహంకారం వదిలిన మానవునికి
పేరు ప్రతిష్టలు మెండుగా లభిస్తాయి.
సంసారమంతా దుఃఖాగ్నిలో .
దహించబడుతున్నప్పటికి , మహాపురుషులకు
ప్రభు కృప వలన శీతలత్వము లభిస్తూనే ఉంటుంది. నిరంకారుని నిరంతరం స్మరణ చేయుట వలన సమస్త సుఖ
సాధనాలు వాటంతట అవే లభిస్తాయి.
భయము , మృత్యు భీతి మొదలైనవి వారి మనస్సు
నుండి తొలిగిపోతాయి మరియు వారి ప్రతి సంకల్పము
కార్యరూపము దాలుస్తుంది. ప్రేమ భక్తి ఏకమై
ఆత్మ పరమాత్మ వలె ప్రకాశిస్తుంది.
ఆత్మ తన నిజ గృహమైన పరమత్మలో స్థిరమౌతుంది ..
పరమాత్మ తప్ప అన్య సృష్టింతా స్వప్నము వలె మిధ్య మరియు అసత్యమైనదని నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు తెలుపుతున్నారు.
వ్యాఖ్య:
“Spirituality is the remedy for all maladies.”
ఆధ్యాత్మికతే మానవుని సర్వ దుఃఖ నివారిణి .
నేటి మానవుడు భౌతిక అవసరాలనే ప్రాధమిక
అవసరాలుగా భావించటం వలన దుఃఖానికి లోనవుతున్నాడు.
“మయా దీపమును గాంచి నర శలభములు భస్మమగును
గురు జ్ఞానము వినా తప్పించుకొన నెవరితరము , రావిదాసు ?”
దీని భావము – మాయ అనే దీపం వెలుగును చూసి మానవుడు అనే శలభం గుడ్డిగా ఆ వెలుగులో దూకి ,
కాలి బూడిదవుతుంది , తనను తాను నాశనం చేసుకొంటుంది. గురువు ప్రసాదించే జ్ఞానాన్ని పొందనిదే , మాయాగ్నినుండి తప్పించుకొనడం ఎవరి తరము కాదు
అని రవిదాసు వారు అంటారు.
వాస్తవానికి మనిషికి మూడు అవసరాలు ఉన్నాయి . భౌతిక అవసరాలు, మానసిక అవసరాలు మరియు ఆధ్యాత్మిక అవసరాలు . వస్త్ర ,ఆహార నివాస అవసరాలు భౌతిక అవసరాలు. ఇవి మానవుడు ఈ భూమి మీద నివసించినంత కాలం జీవనాన్ని కొనసాగించటానికి ఉపయోగపడేవి. మానసిక అవసరాలు అనగా ప్రేమ, జాలి ,దయ , పరోపకారం మొదలైనవి. మానసిక అవసరాలు మనం జీవించినంత కాలం తోటి వారితో సత్సంబంధాలను నెలకొలుపుకొని జీవన ప్రయాణం ఆనందంగా కొనసాగించటానికి దోహదపడతాయి. . ఆధ్యాత్మిక అవసరాలు అంటే జ్ఞానంతో కూడుకున్నభక్తి. ఆధ్యాత్మిక అవసరాలు మానవ జన్మను సార్ధకం చేసుకొని , జీవిత లక్ష్యమైన ముక్తిని పొందటానికి ఉపయోగపడేవి.
ప్రస్తుతం మానవుడు ఒక్క భౌతిక అవసరాల గురించే
తాపత్రయ పడుతూ అదే సర్వస్వంగా భావించి దానిని పొందటానికి చేయరాని పనులు చేస్తూ ,
పడరాని పాట్లు పడుతూ అమూల్యమైన మానవ జన్మను నిరుపయోగ పరచుకొంటున్నాడు.
అజ్ఞానంతో ఈ భౌతిక సుఖాలను పొందటం తన జీవిత
లక్ష్యంగా తలుస్తూ భ్రమలో బ్రతుకును వెళ్లదీస్తున్నాడు. కనుక ఆధ్యాత్మిక
అవసరమైన జ్ఞానాన్ని మనం పూర్ణ సద్గురువుని
ఆశ్రయించి, పొంది , పరమాత్మ భక్తిని కనుక
చేయగలిగితే , మిగిలిన రెండు అవసరాలను కూడా తీర్చుకోగలం.
నేడు ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ
ఆర్దికపరమైనవే కాని , మానసిక సంబంధాలు కావు.
నిరంకారి బాబా హరదేవ్ సింగ్ జీ
మహారాజ్ వారు తెలిపినట్లుగా , “ ప్రేమించవలసిన వాటిని ఉపయోగించుకోవటం ; ఉపయోగించవలసిన వాటిని ప్రేమించటమే దీనికి
గల కారణం. ” దీని భావము ప్రేమించవలసిన మనుషులను ఉపయోగించుకొని తన
అవసరాలు తీరగానే వారిని విస్మరిస్తున్నాడు మరియు ఉపయోగించుకోవలసిన
వస్తువులయందు మమకారాన్ని పెంచుకొని వాటిని
ప్రేమిస్తున్నాడు. ఇదే నేటి మానవుని
దుస్థితికి గల కారణం .
మనిషి తన భౌతిక అవసరాలను తీర్చుకోవటానికి భగవంతున్ని ఆశ్రయిస్తున్నాడే కాని ఆ
భగవంతుడినే తన వాడిగా చేసుకుంటే సర్వస్వం తన వశమౌతుందని తెలుసుకోలేకున్నాడు.
మహాభారతంలో కురుక్షేత్ర సమరానికి ముందు శ్రీ కృష్ణుని వద్దకు వచ్చిన
దుర్యోధనుడు శ్రీ కృష్ణ పరమాత్మను గాక తన వెనుక వున్న సైన్యాని కోరుకున్నాడు. కాని
అర్జునుడు మాత్రం శ్రీ కృష్ణ భగవానున్ని కోరుకున్నాడు. అంతిమంగా
భగవంతున్ని కోరుకున్న పాండవులు విజయులై రాజ్యాన్ని పొందారు. ఆయన మాయను (బాహ్య వస్తువులు) కోరుకున్న కౌరవులు
పరాజితులై ఉన్న రాజ్యాన్ని కోల్పోయారు.
ఎప్పుడైతే సద్గురు చరణాలను ఆశ్రయించి ఆయన సద్భోదను స్వీకరించి, సత్సంగమునకు
వెళ్ళటం ద్వారా ఆచరిస్తామో అప్పుడు మానసిక
అవసరాలైన ప్రేమ, జాలి , దయ , పరోపకారబుద్ధిని ; భౌతిక అవసరాలైన ఆహార, వస్తు,
నివాసాలు సమకూరుతాయి.
భాగవతంలో ఉద్ధవునితో పరమాత్ముడు ఇట్లు
చెప్పెను , “ఓ ఉద్దవా ! ఇది ఒక
యుగానికే చెందిన విషయం గాక , సమస్త యుగములకు చెందిన విషయం. సత్సంగం అనగా నాతో ఉన్న
సంబంధము వలననే దైత్యులు-రాక్షసులు , పశు-పక్షులు , గంధర్వులు- అప్సరసలు , నాగులు-సిద్ధులు, చరణులు- గుహ్యకులు, విధ్యాధరులకు నేను ప్రాప్తించితిని. మనుష్యులలో
వైశ్యులు , శూద్రులు , స్త్రీలు మరియు అంత్యజులు మొదలైన రజో గుణ , తమో గుణ స్వభావముగల చాలా జీవులు నా పరమ సంపదమును పొందిరి.
వృత్రాసురుడు , ప్రహ్లాదుడు , బలి , బాణాసురుడు , విభీషణుడు , సుగ్రీవుడు ,
హనుమంతుడు , జాంభవంతుడు , గజేంద్రుడు , జటాయువు, ధర్మవ్యాధుడు, కుబ్జ , గోపికలు ,
యజ్న పత్నులు , ఇంకా ఇతరులు సత్సాంగత్య ప్రభావము వల్ల నన్నుపొందగలిగిరి. వారు
వేదాద్యయనము చేయలేదు. మరియు నియమ ప్రకారము మహాపురుషుల ఉపాసన చేయలేదు . ఇదేవిధముగా
వారు వ్రతములు , తపస్సులు చేయలేదు . కేవలము సత్సాంగత్యము మరియు నాతో ఉన్న సంబంధ
ప్రభావము వల్ల వారు నన్ను పొందగలిగిరి. ”
అనగా పరమాత్మునితోతనకున్న ఆత్మీయత , పరాయణత , అనన్యత మొదలైన వాస్తవికతను
సమ్మతించిన వానికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరమును అనుసరించి ఉన్న జాతి, విద్య
,మొదలైన బేధములు అతనికి వర్తించవు. కారణమేమన , వారు పరమాత్మకు చెందినవారే ,
ప్రపంచానికి చెందినవారు కారు.
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటం వలన జగత్తు మిధ్య అని తెలుసుకొని పరమాత్మ
మాత్రమే శాశ్వతుడు , అయన అంతటా వ్యాపించి ఉన్నాడన్న ఎరుకను కలిగి అందరిలోనూ ఎకాత్మను దర్శించి , అందరి యందు
ప్రేమ గౌరవాలను కలిగి ఉండి తను ఆనందంగా ఉంటూ ఇతరులకు కూడా ఆనందాన్ని పంచ గలుగుతాడు.
నిరంకారి మిషన్ యొక్కసందేశాన్ని క్లుప్తగా చెప్పుకోవాలంతే “ విశ్వమంతటా
ఆత్మను దర్శించి బెదాభిప్రాయాన్ని వీడండి , అందరిని ప్రేమించండి ”.
పై శ్లోకంలో నిరంకారి బాబాజీ తెలిపినట్లుగా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి
సద్గురువు యొక్క బోధను స్వీకరించి , దానిని అనుసరించి జీవించే మానవుడే ఉత్తముడు.
(113)
ఇక్ తూహి నిరంకార్
యే
సంపదనాశించి నరుడు , ఎగబడి పెడుతుండో పరుగు
మనసు తోటి
గురు సేవను చేస్తే , మన వెంటే సంపద తిరుగు
నా మిత్రుడ
నువు ఏ సుఖమ్మును , వెతుకుచుంటివో ప్రతి నిత్యం
సుజనుల ప్రీతి
కలిగిన ఇంట , సకలం నిండును ఇది సత్యం
ఏ సత్కారం కొరకనుక్షణము
, చేయుదు వెన్నో కర్మలను
చేసినచో సాధుల
సేవ , దొరుకును నీకు సర్వమును
మందులనెన్ని
మార్చిన గాని , దూరం కాదు నీ రోగం
నామౌషదమును
తాగిన యెడల , నశించు సర్వనీశోకం
సర్వధనమ్ములలోన
కేవలం , గొప్పది సుమ ఈ నామ ధనం
“
అవతార ” గురు పదములకు శిరస్సు , వంచిన దొరకును
ఈ ధనం
భావార్ధం :
ఓ మానవుడా !
ఏ భౌతిక ధన ప్రాప్తి కొరకు ప్రతి క్షణము పరుగులు పెడుతున్నావో,ఆ ధనమే సద్గురువుకి
సేవచేయటం ద్వార పరుగులు పెడుతూ నీ వద్దకు చేరుతుంది.
ఎల్లప్పుడూ ఏ
సంసారిక సుఖాల కోసం నీవు అన్వేషిస్తున్నావో , ఆ సుఖాలు సత్సంగం యందు ప్రేమ
కలిగి ఉండటం ద్వారా నీకు కలుగుతాయి.
ఏ గౌరవ
ప్రతిష్టలను ఆశించి నీవు అహర్నిశలు శ్రమిస్తున్నావో , సంత్ మహాపురుషులను గౌరవించటం
ద్వారా నీకు గౌరవ ప్రతిష్టలు సునాయాసంగా లభిస్తాయి.
లక్ష ఔషదములు
వాడినా నీకు కలిగిన రోగము ఎన్నటికి దూరమయ్యేది కాదు , అయితే నామౌషధమును ,
అంటే , స్మరణ అనే అమృత ఔషధాన్ని
స్వీకరించటం వలన నీ సమస్త రోగాలు మరియు శోకాలు మటుమాయమవుతాయి.
భౌతిక
సుఖసంతోషాలను కలిగించే సమస్త ఐశ్వర్యముల
కంటే నామ ధనము ఎన్నో రెట్లు శ్రేష్టమైనది.
నామ ధనము భౌతిక ధనము కంటే ఎంతో గొప్పది . అయితే ఈ ధనము సద్గురు చరణాలకు
శరణు వేడటం ద్వారానే లభిస్తుంది.
వ్యాఖ్య :
జంతువును
మనిషిగా , మనిషిని దేవుడిగా తీర్చిదిద్దునది సాధు సాంగత్యం . అందుచేతనే జ్ఞానము మార్గమే కాని గమ్యము
కాదు. మనిషిలోనే నిక్షిప్తమై ఉన్న
దివ్యత్వాన్ని ప్రకటింప చేసేదే జ్ఞానం.
సద్గురు
చరణాలను ఆశ్రయించి జ్ఞానమును సముపార్జించాక సద్గురువు తెలిపినటువంతటి సేవ,
స్మరణ , సత్సంగాలను సోపానాలుగా
చేసుకున్నప్పుడే మానవుడు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి మాధవుడిగా పరివర్తన చెందుతాడు. ఇదే జీవుడు మనవ జన్మను ఎత్తాక సాధించి తీరవలసినది.
బాహ్య
ప్రపంచములో మనిషికి భగవంతుని గురించి విచారణ చేసే మనుషులు , సమయము మరియు ప్రదేశము లభించటము
దుర్లభము . అందుచేతనే నిరంకారి బాబా
అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు సాధువులతో సాంగత్యము చేసి సద్గురు యొక్క బోధను
హృదయంలో నిశిప్తపరచుకొని రామ నామ ధన్నాన్ని సమకూర్చుకొనమని తెలుపుతున్నారు.
నేడు మానవుడు
ప్రాపంచిక ధనమును మరియు భౌతిక సుఖాలను పొందటానికి శక్తి వంచన లేకుండా ఆహిర్నిశలు
శ్రమిస్తున్నాడు . ఈ భౌతిక సుఖాలు క్షణభంగురమైనవి , శాశ్వత ఆనందాన్ని కలిగించలేనటువంటివి..
నిరంకారి
బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు తమ ప్రవచనములో , “ సూర్యునికి
అభిముఖంగా నడిచినప్పుడు , శర్రేరపు నీడ మన వెనుక ఉంటూ వస్తుంది. అదే కనుక
సూర్యునికి వ్యతిరేక దిశలో మనం ముందుకు వెళుతుంటే నీడ మన ముందు పరిగెడుతూ ఉంటుంది.
ఈ విధంగానే సద్గురువు మార్గాన్ని ఎల్లవేళలా అనుసరించే భక్థుని వెనుక మాయ ఉంటుంది. సద్గురు
మార్గానికి వ్యతిరేక దిశలో పయనించే వారికి ముందు మాయ ఉంటుంది. ” అని తెలిపారు.
నేటి మానవుడి
వ్యవహార శైలి పశు ప్రవృతిని పోలి ఉంది. ఒక
వేళ భౌతిక సుఖాలను అనుభవించటమే మానవ జీవిత లక్ష్యమైతే , ఈ సుఖాలను పశుపక్షాదులు
కూడా అనుభవిస్తున్నాయి . అందుకొరకు ఉత్తమమైన మానవ
జన్మ అవసరమే లేదు.
కబీర్ దాస్
తెలిపినట్లుగా:
నిద్రా భోజన్
భోగ భయ్ ఏ పశు పురుఖ సమాన్
గ్యాన్ అధిక్ ఏక్ నరీన్ హై గ్యాన్ భిణా పశు భి జానే !!
-భక్త కబీర్
దాస్
నిద్ర ,
భోజనము , భోగము , భయము – ఇవన్నియు
పశువులు కూడా కలిగి ఉంటాయి. ఒక్క జ్ఞానము
ద్వారానే మానవుడిని పశువులకు భిన్నంగా గుర్తించగలము. లేని యెడల అట్టి మానవుణ్ణి
పశువులే గుర్తిస్తాయి . కావున మానవుడు
తనలో వున్న దివ్యత్వాన్ని గుర్తించి , దివ్యత్వానికి మూలపురుషుడైన ఎకేశ్వరుడైన పరమాత్మను చేరుకొనుటకు చేసే ప్రయాణమే జీవితం . దీనికి తోడ్పడేదే ఆధ్యాత్మిక భక్తి
మార్గం. ఈ మార్గాన్ని చూపించే వాడే
సద్గురువు. ఈ
ప్రయాణాన్ని కొనసాగిస్తూ మార్గ మద్యములో
ప్రయాణానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవటానికి భగవంతుడు సృష్టించిన భౌతిక పదార్ధాలను ఉపయొగించుకోవాలి . కాని నేడు మానవుడు ఈ భౌతిక సంపాదనే జీవిత లక్ష్యంగా భావిస్తూ భగవంతుడిని
ఉపయోగించుకుంటున్నాడు.
ఏకై సదై సబ్ సదై
సబ్ సదై సబ్ జాయే
ఆ ఒక్కడు మన
వశమైతే సమస్తమూ మన వశమౌతుంది. అన్ని
కావాలనుకుంటే ఏదియూ లభించదు.
సరళమైన
సత్యాన్నిక్లిష్టపరచుకొని మానవుడు తన
జేవితమును కూడా సంక్లిష్టం చేసుకుంటున్నాడు.
సద్గురుని
చరణాలను ఆశ్రయించిన భక్తుడు జీవితములో ప్రాధాన్యతలను గుర్తెరిగి , తన జీవిత
లక్ష్యమైన పరమాత్మ ప్రాప్తి కొరకే సమస్త కర్మలను ఈ ప్రపంచంలో ఉంటూనే
నిర్వహిస్తాడు.
పారమార్ధిక
జ్ఞానము కలిగినటువంటి భక్తుడు లౌకిక మరియు
భౌతిక విషయాల యందు కూడా అత్యున్నతమైన పరిణితిని సాధించి , వాటిని కూడా తన ఆధ్యాత్మిక
ఉన్నతికి సాధనాలుగా ఉపయోగించుకుంటాడు. .
అందుచేతనే
జ్ఞానోదయం పొందిన ( సద్గురు ) మహాత్మునిచే మార్గనిర్దేశం పొందిన వారు
అదృష్టవంతులు. కేవలం గురువుని పరిచయం
చేసుకొని ఆయన ద్వారా సూచనలను పొందటం వలననే ఎక్కువ ప్రయోజనం చేకూరదు. ఆయన
ఇచ్చిన ఆదేశాలను శ్రద్ధా భక్తులతో పాటించాలి.
గురు
శిష్యులమధ్య గల సంబంధం దైవికమైనదే కాని
మానవీయమైనది కాదు. ఈ స్థితిలో ఎల్లవేళలా
ఉండటానికి సాదు మహాత్ముల సహచర్యం తోడ్పడుతుంది.
సత్సంగం భగవంతుని మీద
వ్యాకులతను , ప్రేమను పెంపొందించి బాహ్య వస్తువుల మీద వైరాగ్య భావనను కలుగ చేస్తుంది. సత్సంగంలో దీర్ఘకాలం ఉండటం వలన మనసులోని
జీవాత్మ పరమాత్మ కోసం తహతహలాడటం ప్రారంభిస్తుంది. మంచి , చెడులను తెలియచెప్పే నిత్యానిత్య
విచక్షణను అలవరుస్తంది. భగవంతుడు ఒక్కడే
శాశ్వతుడు. ఈ ప్రపంచం ఆశాశ్వతమని మనకి
విశ్వాసం కలిగేలా చేస్తుంది.
పై శ్హ్లోకం
ద్వారా నిరంకారి బాబా శాస్వతుడైన పరమాత్మకు
ప్రాధాన్యతను ఇవ్వటం వలన ప్రాపంచిక భోగాలను కూడా విచక్షణతో ఉపయోగించుకుంటూ , ఆధ్యాత్మిక మార్గానికి ఎలాంటి ఆటంకం లేకుండా
జీవనాన్ని ఆనందంగా కొనసాగించవచ్చని తెలుపుతున్నారు.
సాధు జనుల
సాంగత్యం చేసి , చేయుము ఈ ఈశ్వరుని విచారం
సద్గురు వచనం
మదిలోనుంచి , చేయేకేశ్వరున్నాధారం
అన్యయత్నములు
అన్నీ అసత్యం , అసత్యములన్నీ ఉపాయములు
మాయ నుండి నీ
మనసును తిప్పి , పెంచు ప్రేమ గురు పాదములు
వీరే లోకపు
కర్త భర్త , సృష్టికి దాతా కర్త సర్వం
వీరాధారం
మరువకు నరుడా , వీరే అధికారి దైవం
ఎవరి ధనమును
నింపుకొందురో , వారవుదురు షావుకారి
“
అవతారు ” ని మాటిది వారికే దొరకును , ఎవరౌదురో
దాసుడొకసారి
భావార్ధం :
మనస్సును సంసారమనే మాయ నుంచి తప్పించి సద్గురు యొక్క చరణాలను ప్రేమ పూర్వ భక్తితో సమర్పించటమే
సరిఅయిన మరియు సత్యమైన మార్గం. ఇది కాక అన్యమైన
ప్రయత్నాలు మరియు ఉపాయాలు అన్ని అసత్యాలే.
నిరాకారుడే సమస్త సృష్టికి కర్త, స్థితికారుడు, యజమాని మరియు అన్ని పనులకు
ఆధారభూతుడు కూడా. అందు చేత నీవు ఈ
పరమాత్మనే ఆశ్రయించు. ఆత్మ జ్ఞానమనే
నామధనాన్ని ఎవరైతే భక్తి ద్వారా తన భాండాగారాన్ని నింపుకుంటారో , వారే నిజమైన
సిరిగల వారవుతారు. సద్గురువుకి ఒక సారి
దాసుడైన వాడికే ఈ నామ ధనాగారము లభించిందని నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ వారు తెలుపుతున్నారు.
వ్యాఖ్య
:
మానవుడు
పొందవలసినది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. నడవ వలసినది సత్సంగం వైపు, వదలాల్సింది లౌకిక
విషయాల పట్ల ఆసక్తిని ,
If mind
is beautiful ; life is beautiful .
మన
మనస్సు సుందరంగా ఉన్నప్పుడే జీవితం కూడా సుందరంగా ఉంటుంది. చపలత్వంతో కూడుకున్న మనసు తీసుకునే నిర్ణయాలు
దుష్ఫలితాలను ఇస్తాయి. ఇటువంటి మనస్సుని
అదుపాజ్ఞలో ఉంచటం మనకు సాధ్యమయ్యే పని
కాదు. అందుచేతనే మనస్సును దాని యజమాని అయినటువంటి నిరాకార పరమాత్మ యొక్క సాకార రూపుడైన
సద్గురువుకి సమర్పిస్తే – ప్రశాంతత చేకూరుతుంది.
मै वही दर्पण वही , न जाने ये क्या हुआ !
ये सब कुछ लागी नया नया !!
“ నేను మార లేదు, ఆ అద్దమూ మారలేదు .
మరెందుకో ముఖాన్ని కొత్తకొత్త గా చూపెడుతుంది. అంటే అద్దము, ముఖము అవే అయినప్పటికీ
ముఖములోని భావాలు మాత్రం అద్దములో చూసిన ప్రతి సారి మార్పుచెందటానికి గల కారణం
మనస్సులోని భావాలలో మార్పు కలగటం. మనసు
నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే , ముఖములో విభిన్న భావాలు వ్యక్తమవకుండా ప్రసన్నత
కనపడుతుంది. ఈ నిశ్చల తత్వం సద్గురు బోధ
ద్వారా మరియు సాధు సాంగత్యము ద్వారా మాత్రమే లభిస్తుంది.
మానవునికి
సత్యమే ఆధారం ; ధర్మమే జీవితము ; ప్రేమయే ప్రధానము. ఈ మూడింటిని ప్రసాదించేది సత్సంగం. ‘ సత్ ’ + ‘ సంగం
’ అనే రెండు పదాల
కలయికే సత్సంగం. ‘ సత్ ’ అంటే సత్యం లేదా ఆత్మ లేదా భగవంతుడు. ‘సంగం ’ అంటే కలయిక . జీవి సత్సంగం
చేయటమంటే ఆత్మ పరమాత్మతో లీనం అవటం. కాని వ్యవహారంలో సత్సంగం అంటే అందుకు దోహదం
చేసే భగవంతుడికి సంబంధించిన విషయాలు వినటం .
తనకు
తానుగా ఎగరలేని ధూళి గాలి యొక్క సాంగత్యం చేత ఎలా పైకి ఎగురుతుందో , అలాగే
సత్పురుషుల సాంగత్యంతో సామాన్యుడు జ్ఞానం సంపాదించుకొని ఎదగగలుగుతాడు. ఈ సత్సంగం సద్గురు కృపవలనే సాధ్యం.
సంత్
కబీర్ దాస్ తెలిపినట్లుగా
बिना सत्संग
विवेक न होए !
राम की कृपा बिन सुलब न सोये !!
-
संत कबीर दास
“ సత్సంగం లేక వివేకం కలగదు. ఈ సత్సంగం
రాముని కృప వలెనే లభిస్తుంది. ”
ఆది
శంకరాచార్యులవారు భజగోవిండం 9 వ శ్లోకంలో ఇచ్చినట్లు:
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం !
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే
జీవన్ముక్తి !!
-భజగోవిందం 9 వ శ్లోకం
“ సత్పురుషులతో సాంగత్యం
చేయటం వలన ఈ ప్రాపంచిక విషయాల పట్ల
సంగభావం తొలగిపోతుంది. దాని వల్ల క్రమంగా మనలో ఉన్నభ్రమ లేక మోహం
తొలగిపోతుంది. మోహం తొలగిపోతే భగవంతునిపై
చలించకుండా నిలిచిపోతుంది. అలామనస్సు
చలించకుండా భగవంతునిపై నిలిచి పోతే ఇక మనస్సు కర్మ బంధనాల నుండి విముక్తి
లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది . ఇదే మోక్షం . జీవన్ముక్తి.
సత్పురుష
సాంగత్యంవల్ల మనలో గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. భక్తి మన చుట్టూ ఒక బలవత్తరమైన
కవచాన్ని నిర్మిస్తుంది. ఈ కవచం మనలను
బాహ్య విషయ వస్తువుల ఆకర్షణ నుండి ,
మాయాజాలం నుండి రక్షిస్తుంది.
చలించని
మనస్సుతో ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉంటె అలా
ధ్యానించి ధ్యానించి మనస్సు కాస్తా ఆ పరమాత్మలో లీనమైపొతుంది . ఉప్పు బొమ్మ
సముద్రంలో తిరిగితిరిగి సముద్రాకారంగా మారిపోయినట్ల్యు మనస్సు ఆత్మాకారముగా
మారిపోతుంది. అదే మనోరాహిత్య స్థితి ,
సంకల్ప రహితస్థితి , జీవన్ ముక్త స్థితి . “ నేను పరమాత్మనే “ అనే అనుభవం
కలుగుతుంది . దీనినే మోక్షప్రాప్తి అంటారు.
ఇలా మోక్షమనే చివరి మెట్టు అందుకోవాలంటే సత్సంగమనే
మొదటి మెట్టుపై కాలు పెట్టాలి.. మహాత్ములు తెలుపుతున్నట్లుగా :
వంద
పనులు మానుకొని అయినా భోజనం చేయాలి. వెయ్యి పనులు మానుకొని అయినా స్నానం చేయాలి .
లక్ష పనులు వదిలి పెట్టయినా దానాలు చేయాలి . కోటి పనులను వదిలిపెట్టి అయినా
పరమాత్మ ప్రాప్తికి పూనుకోవాలి.
“ మనయేవా మనుష్యాణా కారణం బంధ మోక్షాయ ”
దీని
భావము మనసే బంధానికైనా మొక్షానికైనా కారణం. మనసు ప్రకృతితో యోగం చెందితే బంధం. మనసు పరమాత్మతో యోగం చెందితే మోక్షం .
ఇటువంటి
మనస్సును లోక విషయాలతో మమైకం కాకుండా పరమాత్మ విషయాలతో నింపటానికి సద్గురువు యొక్క
సుబోధ ఎంతో తోడ్పడుతుంది.
అందుచేతనే
శిష్యులకు సద్గురువు జ్ఞానం ప్రసాదించే ముందు మనసు వలన కలిగే అహంకార మమకారాలకు
దూరం చేయటానికి , మనస్సును
నియంత్రించటానికి ఆ మనసును తనకు
సమర్పించవలసినదిగా ఆదేశిస్తారు.
నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు పై
శ్లోకం ద్వారా మనస్సుని సంపూర్ణ శరణాగతి
భావముతో సద్గురు చరణాలకు సమర్పించటమే నిజమైన భక్తి అని , అదే మోక్షాన్ని ప్రసాదిస్తుందని మానవాళికి
సందేశం ఇస్తున్నారు.
***
గుణాతీతుడి
నిరాకారుడు , తానే దాత గుణములకు
అంతర్యామై అన్నిట
కలడు , అతీతుడు తను గుణములకు
తన ఈ మహిమలు
తనకే తెలుసు , తన లీలలు తను సూచించు
తన శక్తి
ఏమిటో తనకే తెలుసు , తనను తానుగా చూపించు
తానైచ్చికమే ఈ ప్రత్యక్షం , దాగి ఉండుట తన తలపే
పెంచును తాను
విరుచును తాను , చేయుట మూయుట తన చలవే
తనవలె తాను
ఒక్కడే కలడు , తనది రూపము అసమానం
తానే తనువు
తానే ఆత్మ , తానే సర్వ జనుల ప్రాణం
ముఖము ఒక్కటే
రంగులనేకం , ఈ కళానైపుణ్యం తాను
తానే సాగరం
అలలు తానే , తీరం మధ్యమును తాను
రంగు రంగుల ప్రకృతి
తనది , తనదే ఈ లీలా విలాసము
“
అవతారు ” ని మాటిది ఎవరు తెలిసిన , మహిమ వారిది
విశేషము
భావార్ధం :
నిరాకారుడు త్రిగుణాలకు అతీతుడైనప్పటికి సమస్త గుణాలలో ఉంటాడు. పరమాత్మ ప్రతి
వస్తువులో ఉన్నప్పటికీ , ఆ వస్తువు తను కాడు.
పరమాత్మలీలలు తను రచించినవే మరియు వాటి గురించి వారికే తెలియును. నీ వైభావము నీకే తెలియును మరియు నీ గురించి నీవు
తెలిపితేనే తెలుసుకోగలము.
నిరాకారుడు తన ఇష్టానుసారమే ప్రకటితమవ్వగలడు
లేదా అంతర్దానమవ్వగలడు. ప్రపంచమనే సంసారంలో సమస్త జడ చైతన్యరూపాలను పెంచునది , త్రుంచునది , సృష్టించి లయము చేసేటి వాడవు నీవే.
లేదా అంతర్దానమవ్వగలడు. ప్రపంచమనే సంసారంలో సమస్త జడ చైతన్యరూపాలను పెంచునది , త్రుంచునది , సృష్టించి లయము చేసేటి వాడవు నీవే.
నీకు నీవే సాటి . నీతో సరి తూగే వారు జగతిలో ఎవరు లేరు. శరీరము , ఆత్మ,
ప్రాణము నీవే. మరియు సమస్త జీవులను గుర్తించేది నీవే.
ఒకే సత్యము సంసారంలో అనేక రూపాలుగా అభివ్యక్తమవుతుంది. సాగరము , తీరము , అలలు మరియు సంగమం ( నది సాగారములోకలిసే ప్రదేశము ) నీవే.
ఈ నిరాకారుడు ఈ రంగుల ప్రపంచానికి అధిపతి మరియు అనేక లీలలను
కలిగిన వాడు. ఏ మానవుడైతే నిరాకార పరమాత్మను పొందుతాడో వాడు కూడా అంతటి మహిమను
కలిగి ఉంటాడని నిరాకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు తెలుపుతున్నారు.
వ్యాఖ్య :
ఏ విధంగానైతే ఇనుము అయిస్కాంతంతో సంపర్కము చెందటం వలన అయిస్కాంతం యొక్క గుణాలు
ఇనుముకు వచ్చినట్లు , ఈ విధముగానే
బ్రహ్మను తెలుసుకొని , జీవుడు బ్రహ్మమే
అవుతాడు.
జీవుడు సుగుణాలను కలిగి
ఉన్నప్పటికీ , సద్గురువును ఆశ్రయించి త్రిగుణాతీతుడైన పరమాత్మను తెలుసుకొనుట వలన “ నేను త్రిగుణాలతో కూడిన శరీరం కాదు ,
గుణాతీత పరమాత్మ యొక్క అంశయిన ఆత్మని. ” అనే సత్యాన్ని తెలుసుకొని , మాయా జనిత ప్రపంచంలో తనకు ఎదురయ్యే
కష్ట నష్టాలను ఎదుర్కొనగలుగుతాడు.
దైవాజ్న లేక దైవ సమ్మతి కాక మానవుడు పరమాత్మను తెలుసుకొనే మహోన్నత
అవకాశాన్ని పొందలేడు. దైవానుగ్రహం
లభించగానే పరమాత్మ స్వయముగా సాకార సద్గురు రూపం దాల్చి పరమాత్మ తత్వాన్ని
తెలియచేస్తారు. అయినప్పటికీ మానవుడు భగవంతుని
నిజ స్వరూపము యందు విశ్వాసం ఉంచక సగుణ రూపము నందు మాత్రమే తన దృష్టిని నిలుపుతాడు.
అర్జునుడు కూడా పరమాత్ముని విశ్వ రూప సందర్శణ
తరువాత అజ్ఞానముతో , “ నీ విశ్వరూపమును దర్శించి నా నేత్రములు మిక్కుటముగ తృప్తినొందునవి. అవి
ఇప్పుడు ఈ సౌమ్యమగు కృష్ణమూర్తిని చూచుటకు తొందరపడుచున్నవి. వీటికి ఇప్పుడిక ఈ
సుందర కృష్ణ మూర్తిని చూచుటకు మినహా మరేదియూ
నచ్చదు. ఈ రూపము ముందు వీటికి ఈ
విశ్వరూపమేవిధముగను ఎక్కువ మహాత్వమైనదిగా కనిపించుటలేదు. నాకు ఆ కృష్ణమూర్తి తప్ప మరెచ్చట భోగ మోక్షములు
లభించనేరవు . కావున ఓ దేవా ! మీరిప్పుడు
మీ విశ్వ రూపమును ఉపసంహరించి , మీ పూర్వపు సగుణ రూపమును ధరించుడు.”
- భగవద్గీత 11 / 45
అర్జునుని ఈ మాటలను వినుటచే ఆ
విశ్వరూప భగవానునకు అత్యధికమైన ఆశ్చర్యము
కలిగెను.
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శిత మాత్మ యోగాత్ తేజోమయం
విశ్వమనంత మాద్యం యన్మే త్వదన్యేన నాదృష్ట
పూర్వమ్ !!
- భగవద్గీత 11 / 46
“ నీవంటి ఆలోచన కలవానిని
నేనెచ్చటను చూడలేదు . నీకెంతటి అలౌకిక
వస్తువు లభించెను ! అయినప్పటికిని ,
నీకు దాని వలన కూడా సుఖము
కలుగలేదు. నీవీ మాటలు పిరికితనముతో
చెప్పుచున్నావో లేక మూర్ఖత్వముతో చెప్పుచున్నావో తెలియదు. నేను సహజ రూపమున ప్రసన్నుడైనప్పుడు ఈ జడ పదార్ధముతో
కూడి ఉన్న వాటినన్నింటిని అనుగ్రహింతును. నిజమగు భక్తుడు లభించనంత వరకు నా ఈ గూఢ రహస్యం ఎవరికీ చెప్పను. నేను కేవలము నీ కొరకై
నా ఈ అంతరిక రహస్యము బహిరంగ పరచి ఈ
విశాల రూప ధారణ మొనర్చ వలసి వచ్చినది.
నీపై నేను ప్రసన్నడునై పూర్తిగా
పిచ్చి వాడినైతిని . నేను నా అంతరిక గూఢ రహస్య మూర్తిని ప్రపంచము
ముందు ప్రత్యక్ష రూపమున నిలిపితిని . నా ఈ స్వరూపము అపారముకంటే కూడా
అపారమైనది. కృష్ణాది అవతారములన్నియు నా ఈ స్వరూపము నుండే ఉద్భవించినవి. ఈ స్వరూపము జ్ఞాన తెజ సార సర్వస్వం . ఈ
విశ్వరూపము శుద్ధము , అంతము లేనిది , నిశ్చలము, అన్నింటికిని మూల భీజమునై యున్నది.
ఓ అర్జునా ! నీవు తప్ప ఇంతకు పూర్వం
ఎవడునూ ఈ విశ్వరూపమును చూడలేదు. ఎవరునూ ,
ఎన్నడునూ విని ఉండలేదు.
ఈ స్వరూప మార్గాము వరకు చేరుట తోడనే వేదములు మౌనము అవలంభించినది. యజ్న కర్తలగువారు స్వర్గము నుండి మరలి
వచ్చిరి. యోగ సాధన వలన కూడా ఈ స్వరూపము
లభించక పోగా , వ్యర్ధముగ కష్ట పడుట కూడా యగునని సాధకులకు తెలియగానే వారు
యోగాభ్యాసమునే విడచి వేసిరి . కేవలము అధ్యయనము వలన కూడా ఇది లభించునది కాదు. పూర్తిగా ప్రధమ కోటికి చెందిన పుణ్యకర్మలు
చేసిన వారు కూడా సత్య లోకము వరకు మాత్రమె చేరగలదురు. తపస్సు
కేవలము ఈ స్వరూపైశ్వర్యమును మాత్రమే
చూచినది. ఇటువంటి దుర్లభమైన
విశ్వరూపము నా ద్వారా నీకు ఏ విధమైన శ్రమ లేకుండా
లభించినది. అటుల కానిచో మానవ లోకమున ఎవరికిని ఈ స్వరూప దర్శనము కాదు. కావున ఈ విశ్వ రూపమును దర్శించి ఆనందించుము . దీనిని మించిన పదార్ధము మరొకటి ఉండగలదని నీవెన్నడును తలంచకుము. . ”
సృష్టి కర్తను మరచి సృష్టి వెంబడి పడటం ధర్మవిరుద్ధమని , లోకేశ్వరుని
విస్మరించి లోక వ్యవహారములలో మునిగి తేలటం
మూర్ఖత్వమని తెలుసుకోవాలి.
‘నేను ఈ దేహం , మనసు ’ అనుకుంటే కలిగేది అహంకారం. ఇదే
పతనానికి మూల కారణం ‘ నేను ఆత్మ ’ అనుకుంటే మోక్షం . వేదం కూడా ‘అహం బ్రహ్మస్మి ’ ( నేనే బ్రహ్మను ) అని తెలుపుతుంది.
జన్మ కర్మ చ మేదివ్య మేవం యో వేత్తి తత్వతః !
త్వక్త్వా దేహం పునర్జన్మనైతి
మావేతి సోర్జన !!
-
భగవద్గీత 4 / 9
“ ఓ అర్జునా ! నా అవతారము
యొక్కయు , కర్మల యొక్కయు , దివ్యమైన స్వభావముని
ఎవరెరుంగునో అతడు దేహమును విడిచిన పిమ్మట మరల ఈ లౌకిక ప్రపంచమున జన్మించక నా శాశ్వత ధామమున నన్నే పొందును. ”
‘ బ్రహ్మను తెలుసుకున్న వారు బ్రహ్మమే
అవుతారు ’ అని ఈ శ్లోకము ద్వారా నిరంకారి బాబా
అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు తెలుపుతున్నారు.