DAILY SATSANG






Excerpts from the Discourse of Holy Sister Rev. Mohini Ahuja at  First Nari Satsang held at Kakinada E.G.Dt on 09-01-2013 .


* Baba Avtaar Singh  made Rajmataji sit beside BabaGuru Bachan Singh ji  on the dias and suggested to Raj mataji to accompany Baba Guru Bachan Singh on all   his   salvation tours . Raj mata ji used this opportunity to serve the tour members by washing clothes and preparing meals for them . 

* If  one desires that our child should be as virtuous as BabaHardevSingh ji Maharaj , then the mother should be like Raj mata ji .

* Babaji is incessently engaged in spreading our Mission’s message from  Africa to America paying no heed to incliment climatic conditions .

* Once Vivekananda’s mother advised him to take the message of Truth to America. Vivekananda voiced his opinion that he was not apt for this task . His mother asked him to bring a knife from the kitchen. He handed the knife to her holding the handle towards her and the sharp edge towards him . His mother said”This act of yours is proof enough to show that you care for others welfare even if itcauses you pain . Only such apersonwhoseeks others pleasure at the cost of one’s suffering is capable of  being the messenger of love and truth ”.

* Our sadguru  teaches us to  see God in all fellow human beings.

* Women are worshipped as Goddesses Lakshmi and Saraswathi .

* Women have immense energy which is latent in them and should be allowed to manifest  .
  * Women are offered the dias sewa ( Holy seat )in our Satsangs to promote  through practice the idea of Gender equality and also to stress on the fact that all are equal in the eyes of God .

* God remains untouched (elusive ) to the acts of   Fire, water ,and weapons .

* We are not taught to think of God only after  completing our morning ablutions.
*The first thing we do on waking up is  see the Nirankar and utter “Thou formless One       I take refuge in Thee     I pray, forgive me.” We thus see theNirankar before seeing the worldly objects.    
* Using mirror  we check  for any stains on our face .We make every effort to look as beautiful as possible . Satsang  is our  mirror to correct our vices as enhance beautiful virtues.

*.With sadguru’s grace .ordinary laymen are today moulded as mahapurush .
*.Rajmataji always lays stress on the human quality of love. Love reduces the distance between the minds of men .Love is potent enough to convert poison into nectar .

*  The seller of honey can’t sell the sweetest of honey with a harsh voice .
* Once in our childhood we   were taken to shopping by Rajmataji. Another woman customer was speaking disrespectfully to the shop keeper as she was not shown the latest prints. At the same time Raj mata ji  in a pleasant voice asked the shopkeeper to show the range available. The shop keeper instantly enquired if we were Nirankaris as only Nirankaris were capable of such  sweet talk and behavior .

* Sadguru does not ask what our mother tongue  is  ie whether we are marathi speaking people or telugu speaking people . He does not pass decree to first learn Hindi as a pre -condition to bestow God Knowledge on us . He had taken every one of us lovingly  into his fold thus establishing in the world One  single united family.

*  The Nirankari International Samagam held in England  is not meant  for people of a particular caste  , creed. or religion . It is the festival of Oneness of One Humanity .

* So we need to Know One ; Believe One and  Be One .
*  Today we have the opportunity toread the Mission literature which are now translated in to our regional language Telugu .  Avtar Vani  ; Guru Dev  HarDev etc.  We need to read them  to understand our  Mission’s principles and  ideologies.

                                                                                  ***


 08.02.2011 న  భీమవరం లో  జరిగిన సంత్  సమాగం లో సద్గురు నిరంకారి బాబా హర దేవ్ సింగ్ జీ  మహారాజ్ గారి ప్రవచనం యొక్క తెలుగు అనువాదం.  సాదు సంతులకు ధన్  నిరంకార్ . ఏడున్నర సంవత్సరాల తరువాత మళ్ళి  భీమవరం వచ్చి మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం కలిగింది . ఇంతకు మునుపు ఆంధ్ర ప్రదేశ్ వచ్చినప్పుడు హైదరాబాద్ , వైజాగ్ వంటి మహానగరాలలో సమాగాలు జరిగేవి . ఈ మధ్య కాలంలో లోకల్ ప్రదేశాలైన నిజామాబాద్  , కరీంనగర్ , గుంటూరు , తణుకు కూడా రావటం జరిగింది . మీరంతా చక్కగా తెలుగులో సాంగత్యాలు జరుపుకుంటున్నారు .అలాగే జరుపుకోగలరు .
వేమన , పోతన వంటి మహాత్ములు సత్య దర్శనం చేసుకుని : మానవ నిద్రనుండి మేలుకో ! సత్యం తో యోగం అవుగాక . అని మానవునకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు .
భగవంతుడు కణ కణ  వాసి ., సర్వాంతర్యామి ,సర్వ శక్తిమంతుడు , త్రికాలుడు , ఆనంద స్వరూ పుడు , భగవంతుడే సత్య వస్తువు . మన ఆత్మా పరమాత్మను తెలుసుకోవాలని తపిస్తుంది . చేప నీళ్ళలో ఉన్నప్పటికీ నీటికోసం తపించినట్లు .
మనం  నీటిని జల్  ,పాణి , నీరు  , తన్నీర్  , వెల్లం  అని ఎన్నో  పేర్లతో పిలువవచ్చు . పేర్లు వేరైనా పదార్థం ఒక్కటే. పేరు ఉచ్చరించినంత మాత్రాన మన  దాహం తీరదు . నీటి యొక్క స్వభావం తెలుసుకుంటే  సరిపోదు . నీటిని నోటిలో వేసుకుని త్రాగాలి . అప్పుడే దాహం తీరుతుంది . అలాగే  మనం ప్రార్ధించే భగవంతున్ని తెలుసుకుని పూజించాలి . భగవంతుని యొక్క నిరంకార స్వరూపాన్ని గుర్తించి , ధ్యానించాలి . సర్వ వ్యాప్తి ఐన పరమాత్మను మనం బ్రహ్మజ్ఞానం తో దర్శించగలం . జీవుడే శివుడు ఆత్మే పరమాత్మ ఈవాక్హ్యాలు జ్ఞాన  దృష్టి ( అంతర దృష్టి ) వున్న  వారే గ్రహించ గలుగుతారు. ఈ జ్ఞాన  దృష్టి  కలిగేటంత వరకు ద్వైతం లో ఉండటం వల్ల  బేధ భావనలకు లోనవుతాము .మాయ తొలగనంత  వరకు ద్వైతం ఉంటుంది .
 చీకటి సమయంలో వెలుగు వెలుగు అని పలికితే వెలుగు రాదు కదా ? వెలుగుతున్న దీపం యొక్క చిత్రపటం అక్కడ పెట్టినంత మాత్రాన చీకటి గదిలో వెలుగు వ్యాపించదు . చీకటి తొలిగి పోదు .మనం దీపం వెలిగించాలి . వెలిగిన దీపమే అంధకారాన్ని తొలగిస్తుంది .
శ్రద్ధావాన్ లభతే  జ్ఞానం అన్నారు   అంటే ఎవరిలోనైతే భగవంతున్ని ధర్శించాలనే తపన ఉంటుందో వారే బ్రహ్మ జ్ఞానం పొందగలరు .సాధనతో  భవసాగరాన్ని దాటగలరు. మీరా భాయి విషయం తీసుకోండి . ఆమెకు భగవంతుని పట్ల బాల్యం నుండే అనన్య భక్తి . శ్రద్ధ , ప్రేమ ఉన్నప్పటికీ రవిదాస్ చెంత జ్ఞానం పొందిన పిదపనే తరించింది .
బ్రహ్మజ్ఞానం తో అజ్ఞానం నశిస్తుంది . అందుకే మానవులందరికీ చెప్పటం జరుగుతుంది ఏమని ? నిజం తెలుసుకో . భగవంతుడు అందరి వాడు . అందరిలోనూ వున్నాడు .అని  . భగవంతుడు ఏ  ఒక్క వర్గానికి . , వర్ణానికి చెందిన వాడు కాదు . భగవంతుడు మరాటే , సింధీ  , పాకిస్తానీ , .... కాదు . ఈ ప్రపంచానికే సృష్టికర్త ఆయన . సముద్రపు లోతుల్ని కొలవగలం ( తెలుసుకోగలం ) కాని మనం భగవంతుని శక్తి యొక్క లోతుని తెలుసుకోలేము . మనకు కేవలం ఆయన సృష్టిపై అవగాహన వుంది . ఆయనపై కాదు . ఆయన గీసిన ప్రకృతి  తెలుసు  మనకు చిత్రం తెలుసు కాని చిత్రకారుడు  ఐన భగవంతుని గురించి బొత్తిగా తెలియదు .
సూర్య మండలం , పాలపుంతలు , గ్రహాలూ అన్ని ఆయన సృజించినవే .  మనం ఈ పరమ పిత పరమాత్మ ఈశ్వర నిరాకారున్ని తెలుసుకోవాలి . ఎప్పుడైతే ఆయన్ని గుర్తిస్తామో ఉన్నదంతా భగవత్  స్వరూపంగా అనుభవ పూర్వకంగా తెలుసుకుంటాం .అసూయ , రాగ ద్వేషాల  నుండి విముక్తి పొందుతాం . మానవాళికి ఈ ఎరుక కలిగేటంత వరకు ఈ యుద్ధాలు , హింస  కొనసాగుతాయి .
మనం మన కంటే భిన్నంగా జీవించే వారిని , ప్రార్థించే వారిని సహించ లేకపోతున్నాము . మనలో సహనశీలత్వం , సమన్వయత్వం   లోపిస్తున్నాయి . అల్లా  వేరు , రాముడు వేరు  . కృష్ణుడు వేరని తలచి  బేధ భావాలకు లోనై  అడ్డుగోడల్ని నిర్మించుకుంటున్నాము  .ప్రపంచ వ్యాప్తంగా హింస ప్రభలమమైంది   మనం ఎల్ల వేళల ప్రశాంత వాతావరణాన్ని అభిలషించాలి .అజ్ఞానం లో ఉన్నంత వరకు మనం పరిమిత జ్ఞానం వల్ల ఎన్నో సంకుచిత నమ్మకాలకు లోనవుతాం . దీనికి కారణం మనకున్న అవివేకం . ఇదే ద్వేషానికి  , హింసకు పునాది . జ్ఞానంతో మనసుకి విశాలత్వం వస్తుంది . మనసు పరిపక్వత చెందుతుంది . ఈ నాడు ప్రపంచంలో ధర్మం పేరు చెప్పి ఎన్నో హింసా ఖాండలు జరుగుతున్నాయి . ఎక్కడ చూసినా అల్లర్లు ,కర్ఫ్యూలు . ఎందుకంటే మనిషి మనసు ద్వ్వేష పూరితం అయ్యింది . మనం ఈ శత్రుత్వం ., ఈ ఈర్ష వైరాలు తొలగాలని కోరదాం  . ద్వేషంతో కాకుండా మంచితనంతో ఈ జీవిత యాత్రను సాగిద్దాం, ప్రేమను పెంచుదాం . ప్రేమను పంచుదాం . మానవత్వాన్ని , శాంతిని నెలకొల్పుదాం . ఆత్మ  యొక్క గమ్యం లేని పెనుగులాట  స్వస్తి పలుకుదాం . దైవం ఒక్కడే . ఆయనే మన నిజ తండ్రి . ఈ  గుర్తింపుతో , దృష్టితో మనం జీవనం సాగిద్దాం .ఇది అందరి కర్తవ్యం . సత్యం యొక్క ఆవశ్యకతను అన్ని మత  గ్రంధాలు తెలిపాయి . అందరూ మహనీయులు చెప్పేది ఇదే.   సత్యం .లేకుంటే ముక్తి ,మోక్షం దొరకవు . సత్య మార్గం  లో నడిస్తే ఇహలోకం లో . పరలోకంలోనూ ఉద్దరరింప బడతాం  . ఈ విషయాన్నే మహాపురుషులు యుగ  యుగాలనుండి  ప్రభోదిస్తూ వచ్చారు
.ప్రాపంచిక విషయాలపై మంచి అవగాహన వుండటం అవసరమే . వీటి కంటే అన్నో రెట్లు విలువైన జ్ఞానాన్ని పొందటం ఏంతో  అవసరం .  నిత్యమైన సత్య వస్తవు యొక్క జ్ఞానం పొందటమే మానవుని  ప్రథమ కర్తవ్యం .స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఇలా అన్నారు

Arise , awake and stop not until the goal is reached     అంటే 
మానవా మేలుకో గమ్యం చేరే వరకు విశ్రమించకు .     మానవుడు దారి తప్పి పరితపిస్తున్నాడు మనసును ప్రేమతో నింపి ఈ జీవిత ప్రయాణం  సాగించాలి . అమృతం గ్రోలుదాం  . నిర్మలుడు , ,సరలుడు . సులభుడు ఐన   భగవంతునితో యోగం చెందుదాం . నా తోడు నీడ నీవే అని స్మరించుదాం. శంకరాచార్య  భజగోవిందం లో చెప్పినట్లు అజ్ఞానంలో వున్న  మానవుడు భగవంతునికి దూరమై భంగపడుతున్నాడు . గోవిందునితో  ఐక్యమవ్వటానికి  ., యోగమవ్వటానికి కృషి చేయమని  స్పూర్తినిస్తుంది . ఈ సత్య సందేశం సత్య యుగం , ద్వాపర యుగం , త్రేతాయుగం, కలియుగం లోనూ మహానీయులచే ఇవ్వబడుతుంది . దాన్ని ఆచరించి జన్మను సార్ధకం చేసుకుందాం.    ధన్   నిరంకార్  జీ  .
                                              గురు పూజా దివస్ ( దినోత్సవం )  ( 23 -02 - 20 13 )
                  
సహజ సౌమ్యుడు సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ ( జన్మదినం 23 02 1954 )
మానవత్వం కొరకు సమర్పితమైన జీవితం
గురు పూజా దినోత్సవం సందర్భంగా భీమవరంలో  కన్నుల పండుగగా జరిగిన సాంగత్య  సమరోహానికి  భీమవరం పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున నిరంకారి భక్తులు హాజరయ్యారు. సభను ప్రారంభిస్తూ స్టేజి సెక్రటరీ శ్రీమతి దాట్ల విజయ కుమారి గారు  సద్గురువుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క బాల్యం , విధ్యాబ్యాసం , గురుశిఖ్, సేవాదార్ గా మరియు ప్రస్తుత పీటాదిపతిగా వారు చేసిన మరియు వారు చేస్తున్న సేవలను సంక్షిప్తంగా వివరించారు.
v    సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ వారి జననం 23 02 1954 సంవత్సరంలో నిరంకారి కాలనీ, ఢిల్లీ యందు వారి తల్లి తండ్రులు అయినటువంటి బాబా గురు బచన్ సింగ్ జీ మరియు కుల్వంత్ కౌర్ జీ వారు స్వగృహంలో జరిగినది.
v    బాల్యంలో వీరికి తాతయ్య , నాయనమ్మ గార్ల రూపంలో షహన్ షా బాబా అవతార్ సింగ్ జీ మరియు జగన్మాత బుద్దవంతి జీ ల అపూర్వమైనటువంటి ప్రేమ లభించింది.
v    తమ రక్త సంబంధీకులు మరియు సాదు మహాత్ముల సాహచర్యం వలన సహజత్వం , సరాలత్వం , సహిష్ణుతా మరియు సదాచారముల మధ్య సురక్షితంగా పెరిగారు వీరిని అందరు సేట్ జీ మరియు బాలాజీ అని ప్రేమతో పిలిచేవారు.
v    వీరు సేవాదళ్  వర్దిలో సేవ చేసేవారు. సభ్యత సంస్కారం వారు రాజ్ మాతాజీ వద్ద నేర్చుకున్నారు. వారు వారి లేఖలలో సుపుత్రునికి నీ చరణాలలో దాసిని అని వ్రాసేవారు.
v    సంత్ నిరంకారి కాలనీ సమీపంలో ఉన్న రేడియో కాలనీలో వీరు ప్రాధమిక విద్యను పూర్తిచేశారు.

v    196౩ లో యజువేందర్ పబ్లిక్ స్కూల్ పటియాలలో మిగిలిన విద్యను పూర్తి చేశారు. 1969  లో స్కూల్ విద్యను ఇక్కడనే పూర్తి చేసి ఉత్తీర్ణులయ్యారు.
v    స్కూల్ లోని విద్యార్ధులకు మరియు అధ్యాపకులకు వీరు ప్రీతీ పాత్రులయ్యారు. అప్పటి ప్రిన్సిపాల్ లేప్టినెంట్ కర్నూల్ F వాన్ గోల్డ్ స్టోన్ యొక్క ప్రశంసలు కూడా మీకు లభించాయి.
v    సేవాదార్ సంచాలక్ గా  చురుకైన పాత్రను పోషించారు. వీరు బాబా గురు బచన్ సింగ్ జీ వారి పుత్రుడైనప్పటికి ఒక గురు శిక్ గానే చాలా సాధారణమైన జీవనాన్ని జీవించారు.

ఈ నాటి సాంగత్యాన్ని విన్నూతనంగా క్రొత్త ఒరవడిలో నిర్వహించారు. ప్రవచనాలు చెప్పినటువంటి మహాపురుషులకు ముందుగానే ఒక విషయాన్ని తెలిపి వాటి మీద ప్రవచించమని కోరటం జరిగింది. ప్రస్తావించబడిన విషయాలు పవిత్రత , ప్రేమ / క్షమ , నిత్య జీవితంలో బ్రహ్మ జ్ఞానం , విశ్వాసం , ప్రార్ధన పరివారంలో జ్ఞానం , త్యాగం .

సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ వారి జీవితం లోని వివిధ ప్రాముఖ్యమైన ఘటాలతో కూడుకున్నటువంటి 32 నిమిషాలు విడివి గల వీడియోను ప్రదర్శించారు. భక్తులందరూ తన్మయం చెంది ఎంతో ఆశక్తితో తిలకించారు. అనంతరం పీటాన్ని అలంకరించిన స్థానిక ముఖి అయిన జి. సాయి ప్రసాద్ రాజు గారు ప్రవచించారు.
v    ఈ విశ్వంలో సద్గురువుకి సమకాలీనులైనటువంటిపరోపకారులు ఎవరు లేరు.
ब्रह्म ज्ञान की शकल साकार है !
బ్రహ్మజ్ఞానం యొక్క రూపం సాకారం
ब्रह्म ज्ञान की सोच निराकार है !!
బ్రహ్మజ్ఞానం యొక్క ఆలోచన నిరాకారం.
v    సద్గురు నిరాకార పరబ్రహ్మ యొక్క సాకార రూపుడు. సద్గురువు ఎల్లప్పుడు సహజ అవస్థలో ఉంటూ , నిరంతరం బ్రహ్మ చింతనాపారయణులై ఉంటారు.
v    సద్గురువు యొక్క శక్తి అనంతమైనది. శిష్యుడు , సద్గురువు యొక్క శక్తిని స్వీకరించి స్వకార్యములు మరియు పరోపకార కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు.
v    మనందరికీ తెలిసిన విషయము పవర్ హౌస్ ( విద్యుత్ కేంద్రం ) నుండి లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పవర్ హౌస్ లో ఉన్నటువంటి ఉపకరణాలు , గృహములలో ఉండే విద్యుత్ ఉపకరణాలకంటే ఎన్నో రెట్లు శక్తి సామర్ధ్యాలు కలిగి వుంటాయి.
v    ఈ విధంగానే సద్గురువు వద్ద సర్వ శక్తి మంతుడైన పరమాత్మ యొక్క అనంతమైన శక్తులను కలిగి వుంటారు.
v    దీనిలో కొన్ని అంశాలు పొందటం ద్వారానే గురుశిక్ విర్రవీగుతాడు.
v    మహాత్ములు ఎల్లప్పుడు సద్గురుని అనుసరిస్తారు కాని , అనుకరణ మాత్రము చేయరు.
v    సద్గురువు యొక్క వస్త్రాలు , హావ భావాలు , కూర్చునే విధానాన్ని అనుకరించవలసిన ఆవశ్యకత లేదు. ఆవశ్యకత గురువు ఇచ్చే శిక్షణను తన జీవితంలోకి తీసుకుని ఆచరణాయుక్తమైన జీవనాన్ని జీవించటంలో ఉంది .


సద్గురువుకి జన్మదిన సందర్భంగా గురు శిఖ్ గా మనం ఇవ్వగలిగిన, ఇవ్వవలసిన గురు దక్షిణ ఎల్లవేళలా సద్గురు యొక్క ఆజ్ఞలో  జీవనాన్ని జీవించటం.


     పూజ్య బెహెన్ జీ  వారి  కాకినాడ  నారి  సత్సంగ్  09-01-2013 


















సద్గురు బాబా హరదేవ్ సింగ్ జి  మహారాజ్ వారి  ఆశీర్వాదముతో  పుజ్యమోహిని అహుజ  గారి ఆధ్వర్యంలో 09-01-2013 న కాకినాడ తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో  ప్రప్రధమ నారి సత్సంగము ఉద :10:౩౦ గం  జరుపబడినది . బెహెన్  జి వారి ప్రవచనం లోని ముఖ్యాంశాలు
*బాబా అవతార్ సింగ్ జి మహారాజ్ వారు బాబా గురుబచన్  సింగ్ గారి పక్కన రాజ మాతా  జి వారిని కూర్చో పెట్టి ఈ రోజు నుండి బాబాజితో పాటు మీరు కూడా ప్రచారానికి  వెళ్లాలని రాజమాతాజీ ని ఆదేశించారు .
* రాజ్ మతా జీ  సేవకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ ప్రచార బృందం లోని వారి బట్టలు ఉతికే వారు .భోజనం స్వయముగా తయారుచేసేవారు .
* మన సంతానం బాబా హరదేవ్ సింగ్ జి లా  ఉండాలంటే తల్లి రాజ మాతా జి అయి వుండాలి .
* ఆఫ్రికా నుండి అమెరికా వరకు బాబాజీ  మిషన్ యొక్క ప్రచారాన్ని చలి ఎండ వంటి ప్రతికూల  పరిస్తుతులను లెక్క చేయక ముందుకు తీసుకు వెళుతున్నారు .
* ఒక  సారి వివేకానందుని తల్లి కుమారున్ని పిలిచి అమెరికా వెళ్ళి  ప్రచారం చేయిమని సూచించగా  అమ్మా నాకేమి వచ్చును అని ప్రశ్నించెను . అప్పుడు ఆమె  వంట గది నుండి కాయగూరలు తరిగే చాకును
తెమ్మనగా వివేకానందుడు చాకు తెచ్చి  చాకు యొక్క పదును భాగం తన వైపు వుంచి చాకు  పిడి తల్లివైపుఉండేలా ఇవ్వడాన్ని  గమనించిన తల్లి  శబాష్ ! నీవు కష్టాన్ని భరించి ఇతరులకు సుఖాన్ని ఇవ్వగలవు . ఇదే నీకు గల అర్హత అని తెలిపి ఆశీర్వదించెను.
* స్త్రీలు లక్ష్మి , సరస్వతులతో సమానంగా పూజింప బడుతున్నారు .
*మహిళా ఒక శక్తి స్వరూపిణి  . ప్రతి  ఒక్కరిలోనూ ఆ శక్తి  ఉన్నది.
*మనలో వున్న శక్తిని ఉపయోగించుకోవాలి . పురుషులకు భయపడి కొందరు ముందుకు రావటం లేదు .
* అందరినీ పరమాత్మ స్వరూపులుగా భావించటం సద్గురు మనకు నేర్పారు . మన సత్సంగాలలో గురుపీటం పై స్త్రీని కూర్చోపెట్టి  స్త్రీ పురుషులలోబేధం  లేదంటూ  ఆచరణాత్మకంగా  తెలుపుతున్నారు.
* పరమాత్మ పై  అగ్ని , నీరు , వాయువు  , శస్త్రం  ఏమి ప్రయోగించినా గాని మార్పు ఉండదు .
* మీరు నిద్రలేచి ముఖం కడుక్కొన్న తరువాతే నామస్మరణ చెయ్యమని చెప్పట్లేదు
* నిద్రలేస్తూనే నిరంకారున్ని చూస్తూ  నీవే నిరంకార్ , నిన్నే శరణంటిని , నాను క్షమించు అని స్మరణ చేస్తున్నాము .. మనముందున్న వస్తువలన్నిటి కంటే ముందు మనం నిరంకారున్నే దర్శిస్తున్నాము.
* మన ముఖం మనం చూసుకోవాలంటే అద్దం  కావాలి .ఆద్దం లో మన ముఖాన్ని చూస్తూ మచ్చలు ,మరకలు లేకుండా ఉండేలా సరిదిద్దుకుంటాము. అలాగే సంత్ సాంగత్యం లో కూర్చుంటే  సత్సంగం అనే  అద్దంలో మన అవగుణాలు కనిపిస్తాయి .
* అద్దంలో చూసుకొంటూ పౌడర్ రాసుకుని , బొట్టు పెట్టుకుని ముస్తాబవుతాము అందంగా కనిపించాలని. మన గుణాలు కూడా అందంగా ఉండేలా చూసుకోవాలి .
* సద్గురు సాధారణ మానవులను మహాపురుషులుగా తీర్చిదిద్దారు .
* రాజ్ మాతాజీ కూడా ఎప్పుడూ ప్రేమ భాషను ఇష్టపడతారు . ప్రేమ మనుషుల్ని దగ్గర చేస్తుంది .ప్రేమతో మాట్లాడితే విషం కూడా కరిగి పోతుంది .
* తేనే అమ్మే ఆతను కటినంగా మాట్లాడితే తియ్యని తేనెను కూడా అమ్మలేడు .
* ఒక రోజు మా బాల్యంలో  పండగకు బట్టలు కొనటానికి బజార్ వెళ్లాం . షాప్ లో  వేరే ఆమె కూడా వచ్చింది . ఆమె దుకాణుదారునిపై త్వరగా చూపించమని విసుక్కుంటుంది. అక్కడే వున్న రాజ మాతాజీ మాత్రం ఎంతో ప్రేమతో మృదువుగా భాయి సాహెబ్ అవి చూపించండి అని అడుగగా ఆతను- మీరు నిరంకారీలా అని అడిగాడు . రాజ మాతాజీ గారు ఇది మీకెలా తెలుసు అని ప్రశ్నించిగా నిరంకారీ లు మాత్రమే ఇలా మాట్లాడ గలరు అనెను.
* సద్గురు మీరు తెలుగు వారా , మరాటీ వారా అని అడగరు .  మీకు పంజాబీ బాష రాదు కనుక  నెర్చుకొని రండి అప్పుడే  జ్ఞానమిస్తాను అని అనలేదు .అందరిని కూడా వసుధైక కుటుంబంగా చూసి ప్రేమిస్తున్నారు.
* లండన్ లోజరిగిన అంతర్జాతీయ సమాగంలో ఎదో ఒక వర్గానికి ,ఒక మతానికి సంబంధం లేకుండా అందరికి ఐక్యత  మరియు ఏకత్వం అనే సందేశాన్ని ఇచ్చారు .
* దేవుడు ఒక్కడే . ఆ ఒక్కడినే తెలుసుకో . ఒక్కడివైపో .
* ఈ రోజు నిరంకారి చరిత్రను  తెలుసుకోవటానికి  ఎన్నో పుస్తకాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి .అవతార వాణి . గురుదేవ్ హరదేవ్ మొదలగునవి  వీటిని మనం చదవాలి .



           పూజ్య బెహెన్ జీ తూర్పు గోదావరి జిల్లా టూర్ 08-01-2013 








              
       సద్గురు బాబా హరదేవ్ సింగ్ జి  మహారాజ్ వారి  ఆశీర్వాదముతో  పుజ్యమోహిని అహుజ  గారిఆధ్వర్యంలో 08-01-2013 న మురముల్ల గ్రామం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సత్సంగము లో బెహెన్  జి వారి ప్రవచనం లోని ముఖ్యాంశాలు :
  • మురముల్ల గ్రామం మొదటిసారిగా వచ్చాను . హృదయంలో చాలాసంతోషం కలిగింది .సద్గురు కృప వలన మీ వంటి భక్తుల మధ్యలో కూర్చునే సౌభాగ్యం లభించినది .
  • బాష అర్ధం చేసుకోవటంలో కష్టం అనిపించవచ్చు కాని భావంలో ఎలాంటి కష్టం లేదు .
  • మీ భక్తి  , ప్రేమ,ఆనందం  మీ ముఖంలో  .కనిపించేటటువంటి ఆనందకరమైన  భావాల ద్వారా తెలుస్తుంది .
  • ఇక్కడవున్న మనందరి  యొక్క వర్ణం , జాతి , భాష ,ఆహార పానీయాలు వేరైనప్పటికి  మనమందరం ఒకే చోట కూర్చోగలిగాము .ఇది సద్గురు చరణాలను ఆశ్రయించటం వలననే సాధ్యపడుతుంది . సద్గురు చరణాల చెంత  అందరూ సమ భావాలను , సమానత్వాన్ని పొందుతారు .
  • దేశ యువరాజుకి వివాహ సమయం ఆసన్నమైనదని వారి తల్లిదండ్రులు  తెలిపినప్పుడు రాకుమారుడు తమ దేశంలోని మారు మూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద మహిళను వివాహమాడెను .  ఆ మహిళ  రాణిగా మారిపోయింది . ఇది క్షణంలోజరిగి పోయినటువంటి సంఘటన .ఆ విధంగానే సద్గురువు కూడా ఒకే క్షణంలో సంజ్ఞ తో బ్రహ్మాన్ని తెలిపి బ్రహ్మ జ్ఞానిగా మారుస్తాడు .
  • పరమాత్మ సర్వవ్యాపి . ఒక క్షణం కూడా మనలను విడువకుండా వుండేటటువంటి వాడు పరమాత్మ .నేడు మనం  టీ వీ లలో భగవంతుని గురించి ఎన్నో  రకాలుగా నైపుణ్యంతో వర్ణించటం చూస్తున్నాం . .కాని వారిని భగవంతుని దర్శింప చేస్తారా అని అడిగితే  లేదు అనే సమాధానం చెబుతారు .
  • ఈ పరమాత్మని తెలపటానికి పవిత్రమైన  భావాలు , శుద్ధమైన ఆలోచనలు ఉండాలి .వేద గ్రంధాలలో ఫలానా కుల మతాల వారికే  భగవంతుణ్ణి  తెలుపమని  ఎక్కడా ఇవ్వబడలేదు  శబరి తక్కువ జాతి మహిళ  అయినప్పటికీ రాముని యొక్క కృపకు పాత్రురాలు అయినది . తన రాముడు వస్తాడని తన ఇంటి ఎదుట  మార్గాన్ని శుభ్రం  చేస్తూ వుంది . ఆమె చేసే పనిని చూసి బ్రహ్మ జ్ఞానులు, పండితులు అని చెప్పుకునేటటు వంటి వారు  ఆ మహిళను సూటి పోటి  మాటలతో బాధించే వారు, హేళన చేసేవారు .రాముడు ఒక నాడు తన గృహానికి వచ్చినప్పుడు రామునికి సమర్పించిన పండు రుచికరమైనదా కాదా  అని ఎంగిలి చేసి భక్తి పారవశ్యంతో అదే పండును రామునికి అర్పించెను . రాముడు దానిని ప్రీతితో స్వీకరించెను . ఆ విధంగానే సద్గురు భావ ఆర్తిని చూస్తాడు కానిబాహ్య వస్తు సంపదను కాదు . సద్గురు దృష్టిలో అందరూ సమానమే .ఎలాంటి  బేధ భావాలు లేవు.ఇది సమాజం లోని మానవుల యొక్క  ప్రవృత్తి  ..
  • భగవాన్ కృష్ణుడు అర్జునునికి తన విరాట్ స్వరూపాన్ని  దర్శింప చేసే ముందు  స్నానం ఆచరించమని తెలుపకుండానే తన విరాట్ స్వరూపాన్ని దర్శింప  చేసాడు .
  • మోహ భయాలకు లోనైన అర్జునుడి తో  శ్రీ కృష్ణ భగవానుడు ఈవిదంముగా తెలిపెను వీరందరూ ఎన్నడో  మరణించిన వారే . చేసేది చేయించేది నేను మాత్రమే 
  • ఇదే బ్రహ్మ జ్ఞానాన్ని ఈ యుగములో బాబా హరదేవ్ సింగ్ జి  మహారాజ్ వారు ప్రసాదిస్తూ శాస్త్రాలతో సరి పోల్చుకోమని తెలుపుతున్నారు .
  • ఏ విధంగా బంగారం యొక్క నాణ్యతను గీటు రాయి  తెలుపుతుందో అదే విధముగా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని భగవద్గీత , బైబిల్ , ఖురాన్ మొదలగు మత  గ్రంధాల సారంతో సరి పోల్చుకుని పిమ్మట విశ్వసించమని తెలుపుతున్నారు .
  • సంత్ కబీర్ దాస్ పలికినట్లుగా గురువు , గోవిందుడు ఎదురైతే నేను ముందు గురువుకే నమస్కరిస్తాను .నాకు గోవిందుని  పరిచయం చేసి గోవిందునిగా  మార్చారు  కనుక
  • తులసిదాస్ వారు తెలిపినట్లుగా భగవంతుడు నాకు అత్యంత సమీపంలో వున్నాడు .నాకంటికి పొరలు ఆవరించటం వలన చూడలేక పోతున్నాను .
  • మనం దృష్టిదోష సవరణకు వైద్యుణ్ణి  ఆశ్రయిస్తాము  .ఈనాడు అజ్ఞానం అనే పోర కప్పి వుండటం వలన సమీపములో వున్న భగవంతుణ్ణి  దర్శిం చలేక పోతున్నాము  . దివ్య దృష్టిని ప్రసాదించటంలో  సద్గురువు యొక్క ఆవశ్యకత ఎంతైనా వుంది .
  • గడ్డి వాముఎంత పెద్దదైనా ఒక చిన్ననిప్పు కణిక భస్మం చేసినట్లుగా  సద్గురు సమస్త  భ్రమలను  క్షణంలో దూరం చేస్తారు . భగవంతుణ్ణి  మన వారిగా చేస్తారు . అజ్ఞాన అంధకారాల పొరను గురువు తొలగిస్తాడు .అందరు కూడా పరమాత్మ యొక్క సంతానమే .మన యొక్క అలవాట్లన్నీ అనగా శ్రమించటం , నిద్రించటం మొదలైనవి ఒకేరీతిగా వున్నప్పటికిని మనమంతా ఒకటిగా  ఎందుకు ఉం డలేకపోతున్నామో ఆలోచించాలి .
  • సద్గురు భ్రమలను దూరం చేస్తాడు భగవంతుణ్ణి మన వాడిగా చేస్తారు  అని గురు బ్రహ్మ శ్లోకం తెలుపుతుంది .
  • గురు  బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః  . గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః
  • ఆపిల్ పండులో కొన్నిగింజలు ఉండటం మనకు తెలుసు  కాని ప్రతి గింజలో ఎన్నిఆపిల్ లు   వున్నాయో మనకు తెలియదు సద్గురువుకి తెలుసు .సద్గురు భూత, వర్తమాన, భవిష్యత్  కాలాలను దర్శించగలుగుతాడు . అందుకే సద్గురువు త్రికాలదర్శి .
  • బ్రహ్మ ప్రాప్తి   భ్రమ సమాప్తి అన్న మాట  మన మిషన్ యొక్క నినాదం .
  • ఈరోజు మీ మధ్యలో ఎంతో ఆనందాన్ని పొందగలుగుతున్నాను . ఈ ఆనందానికి మరో పర్యాయ పదం లేదు .
  • మారు మూల గ్రామమైన సూర్యా పేట నుండి కొంత మంది యువకులు సద్గురువు ఎదురుగా ఆనందంగా ఆనందంగా అంటూ నృత్యం చేసారు . ఆ కార్యక్రమం తరువాత దానికి ఎంతోమంది ఎన్నో భాషలలో ఆనందంగా ఆనందంగా అని మెసేజ్ ( సందేశం ) పంపారు .  ఇది సద్గురు యొక్క కృప . మారు మూల గ్రామంలో వున్న వారికి కూడా సద్గురువు గుర్తింపు ఇచ్చారు .
  • భాషలలో కెల్లా శ్రేష్టమైన భాష  ప్రేమ భాష . ఇది బజారులో  దొరకదు .మన హృదయంలో దొరుకుతుంది . ప్రేమ ముఖం మీద ఆనందాన్ని తెస్తుంది .
  • ఒక గురువు తన ఇద్దరి శిష్యు లకు  చెరొక పువ్వుల సజ్జను ఇచ్చి గ్రామంలోనికి వెళ్లి సంతోషంగా వున్న వారికి ఇవ్వమని చెప్పారు . సాయంత్రం ఆశ్రమం  చేరిన ఒక శిష్యుని సజ్జ పూలతో నిండి వుంది .గురువు విషయమేమని ప్రశ్నించగా ఈ గ్రామంలో అందరూ విచార వదనంతోనే ఉన్నారు .పూలను స్వీకరించే వారు లేరని .తెలిపాడు . రెండవ శిష్యుని పూల గంప ఖాళీగా వుండటం గమనించి నీవు ఎలా ఇవ్వగలిగావుఅని ప్రశ్నించారు. ఆ శిష్యుడు నేను నాకు ఎదురైన ప్రతి వారిని చిరు నవ్వుతో పలకరించాను .వారి ముఖంలో వెంటమే ప్రసన్నత ,సంతోషం వచ్చాయి మనం ఏది ఇస్తే అదే పొందగలం . మన మనసు . భావాలు బాగుంటే ముఖం  బాగుంటుంది .అందుకే సద్గురువు ప్రేమతో చెప్పండి అంటారు . ప్రేమ భాష ఉత్తమమైనది .
  • అందరి తోటి ప్రేమతో  మాట్లాడాలి   .ప్రేమతో చెప్పిన మాటలు గుర్తుంటాయి . చెప్పిన వారు సదా గుర్తుంటారు . ద్వేషంతో పలికిన మాటలు గుర్తుండవు .పలికిన వారిని గుర్తు చేసుకోము .
  • మన పిల్లలకు రాముడు అని పేరు  పెడతాం కాని రావణాసురుడు , కుంభకర్ణుడు అని పెట్టము కదా ! దీనికి కారణం  గురువు యొక్క చరణాలను ఆశ్రయించి కర్మలను తదనుగుణంగా ఆచరించటం మూలాన.
  • మహాత్ములు తెలిపినట్లుగా :   एक बनो नेक बनो !
                               सब का मालिक एक है !!              








                               సాక్షి దిన పత్రిక 02-12-2012

                     

సత్సంగం: భీమవరం   20/10/2012             సమయము: సా!! 7 గం!!

వినయ విదేయతలు, నమ్రత, దాస భావన కలిగినటువంటి 

మానవుడు మాత్రమే  పరమాత్మను పొందుతాడు.

ఫలాలను కలిగినటువంటి చెట్టు ఎపుడూ వంగే వుంటుంది.  నీరు 

ఎపుడు పల్లానికే ప్రవహిస్తుంది. అలా  ప్రవహించడము వలననే అది 

తన స్వస్థలమైన సముద్రాన్ని చేరుతుంది. నమ్రతతోటే నరుడు 

ఈస్వరుడుని పొందగలడు.

ద్వైతము వున్నపుడు అహం వుంటుంది.  ద్వైతము అంటే రెండవ 

వస్తువును గుర్తించడము.  ఏకత్వాన్ని తెలుసుకున్నవారు  మాత్రమే 

వినయ విధేయతలతో జీవనాన్ని గడుపుతాడు.


నీతి సూత్రాలలో ఒక శ్లోకం వుంది.  విద్య వలన వినయము, 

వినయము వలన యోగ్యత ,యోగ్యత వలన ధనము, ధనము వలన 

ధర్మము, ధర్మము  వలన సుఖము ప్రాప్తిస్తాయని ఈ శ్లోకం 

తెలుపుతుంది.

ఇక్కడ విద్య అంటే లౌకిక విద్య కాదు, పారమార్ధిక, ఆధ్యాత్మిక విద్య, 

బహ్మ విద్య .  విద్య వినయాన్ని నేర్పించాలి గాని అహంతో కూడిన 

ప్రవర్తనను, నడకను ప్రదర్శించటానికి దోహదపడ కూడదు.  

సద్గురువుని ఆశ్రయించి ఈ బ్రహ్మ విద్యని పొందినపుడే మానవుడు 

వినయముతో, దాస భావనతో జీవనాన్ని జీవించగలడు. అందరిని 

గౌరవించగలడు, ప్రేమించగలడు.  ఇక్కడ ధనము అంటే రామనామ 

ధనము.  ఈ ధనము వలననే భక్తి కలుగుతుంది, భక్తి వలన సుఖం 

లభిస్తుంది..

ఒకే భావాలు కలిగినటువంటి వారితోటే మనము స్నేహము 

చేయగలము.  అలాగనే మనము భగవంతునితో స్నేహం 

చేయాలనుకుంటే భగవంతుని గుణాలు మనలో ఉన్నపుడే 

చేయగలం.  అందుచేతనే నమ్రతను కలిగివున్నవాడే భగవంతుని 

పొందగలడు, సన్నిహితంగా నివాసము ఏర్పరుచుకోగలడు.

మనలో వున్న అహాన్ని గుర్తించినపుడే మనము నమ్రతా భావంతో 

నడుచుకోగలం. అహాన్ని పోగొట్టుకొని నమ్రతా భావాలను 

పెంపొందించుకోవటానికి ముందుగా మనం –


       ఇతరుల ప్రశంస కోసం ఎదురు చూడకపోవడము, దాన్ని 

స్వీకరించకపోవడము.

       తన సమర్ధతకి తనే పొంగిపోక పోవడం.

       చేసిన పనికి ఫలితాన్ని ఆశించక పోవడము.

       సిరి సంపదలు, కీర్తి భగవంతుని కృపవలన, పూర్వ జన్మ 

సుకృతం వలన     లభించాయని భావించడము.

 భగవంతుడు సృష్టించిన జీవరాసులన్ని అడ్డంగా పెరుగుతాయి .  

మానవుడు మాత్రమే ఊర్ధ్వముఖంగా పెరుగుతాడు.  అందుచేతనే 

అహంకారానికి మారు పేరైన తల బిరుసుతనము వుంటుంది. . 

ఎపుడైతే ఆ శిరస్సును సద్గురు చరణాలముందు వంచుతామో   

అపుడే ఈ దుష్ట అహంకారము వదలి నమ్రతా భావనతో జీవనాన్ని 

సాగించగలుగుటాము .

ఇక్కడ శిరస్సు వంచటమంటే ఈ రోజు నుండి సద్గురు సుబుద్ధిని తన 

బుద్ధిగా చేసుకొని జీవనాన్ని  సాగిస్తానని ప్రమాణము చేయడము.  

అది అందమైన, సుందరమైన , వినయ విదేయతలతో , నమ్రతతో 

కూడినటువంటి జీవనాన్ని జీవించడానికి దోహదపడుతుంది

నిత్యము సాంగత్యము చేయడము ద్వారానే మానవుడు దైవీ 

గుణాలను పెంపొందించుకోగలడు.

నేను ఈ దేహము కాదు, నేను శుద్ధ చైతన్య పరమాత్మ 

స్వరూపుడను అనే భావన మనలోని అహంకారాన్ని పోగొడుతుంది.  

దేహము అంటీ అర్ధము, దహించటానికి యోగ్యత కలిగినటువంటిది 

అని.  కాబట్టి నశించి పోయేటువంటిది దేహము అని ఏ భక్తుడు దీని 

మీద మమకారాన్ని పెంచుకోడు  .

భక్త కబీరు जब थक मै था, तब गुरु नहीं; जब गुरु है , मै 

नहीं रहा అని తెలుపుతాడు.  అంటే, నేను అనే అహంకారము 

నాలో ఉన్నంత వరకు నా గురువు లేరు, గురువు వున్నపుడు నేను 

లేను.  దీని భావము, సమయపు సద్గురువు చరణాలను 

ఆశ్రయించినపుడే మానవుడు తన అహంకారాన్ని 

వదులుకోగలుగుతాడు,  నమ్రత తో కూడుకున్న జీవనాన్ని జీవించ 

గలడు.

తుఫానులు వచ్చినపుడు పెద్ద పెద్ద వృక్షాలు కూకటి వేళ్ళతో  

పెకలించబడతాయి.  కాని, అతి చిన్నదైనటువంటి గడ్డి మొక్క 

మాత్రము క్షేమంగానే వుంటుంది. దీని భావము, నేను అని 

భగవంతుని ధిక్కరించిన వాడు నశించి పోతాడు.  తాను దాసుడను 

అనే భావము కలిగినటువంటివాడు మాత్రమే ఆనందాన్ని 

పొందుతాడు, పంచుతాడు.

మానవుడు తను సృష్టించుకొన్న కృత్రిమ ప్రపంచములో జీవనాన్ని 

జీవిస్తున్నాడు, అందుకే దుఖాన్ని అనుభవిస్తున్నాడు.  భగవంతుడు 

సృష్టించిన వాస్తవ ప్రపంచము ఆనందముతో, ప్రేమతో నిండి 

వుంటుంది కనుక అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది. 

హనుమంతుడు గొప్ప భక్తుడు, కాని తనలో అహంకారము 

ప్రవేశించుట వలన శ్రీరాముడు ముందు అవమాన పడవలసి 

వచ్చింది.  రామ రావణ యుద్ధము ముగిసిన తరువాత, సీతాదేవితో 

అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు.  పుష్పక విమానము 

ఉన్నప్పటికీ, సీతాదేవి కోరికను తీర్చటానికి, వానరులు నిర్మించిన 

వారధి మీద  నడకను సాగిస్తున్నారు.  వారి వెనుక వస్తున్న 

హనుమంతుడి మనసులో ఒక ఆలోచన కలిగింది.  నూరు యోజనాల 

సముద్రాన్ని నేను ఒక అంగతో దాటగాలిగాను.  వీరేమిటి ఇలా 

నడుస్తున్నారు అని చిన్న అహంకార భావం ప్రవేశించింది.  

సర్వాంతర్యామి అయిన రామచంద్రుల వారు ఈ విషయము గ్రహించి, 

వెనుకకు  తిరిగి తమకు, హనుమంతునికి మధ్య వున్న వారధిని 

బాణముతో మూడడుగుల మేర చిన్నాభిన్నం చేసాడు.  

హనుమంతుడు మూడడుగులే కదా అని దానిని ఒక్క అంగలో 

దాటబోయి మధ్యలోని నీళ్ళలో పడిపోయాడు.    శ్రీరాముడు, 

వెనుకకు తిరిగి, చిరునవ్వుతో హనుమంతా! నూరు యోజనలను 

లంఘించగలిగినటువంటి వాడివి మూడడుగులు లంఘించలేక 

పోయావా అని అడిగాడు.  ఆ మాటలతో, తనలో కలిగినటువంటి 

అహంకారాన్ని గుర్తెరిగి సిగ్గుతో తల వంచుకున్నాడు.


దీని భావము, నేడు మనము ఏ పని సాధించినా  అది పరమాత్మ, 

సద్గురువు కృపతోనే సాధ్యము కాని, మన వలన సాధ్యము కాదు.  

బాబాజి అందుచేతనే, నమ్రత, దాస భావన కలిగినటువంటివారు 

భగవంతుడుని పొందగలుగుతారు అని తెలిపారు.



ఏ భక్తుడు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను కలిగి వుంటాడో, వారే వినయ 


విదేయతులు, నమ్రత మరియు దాస భావనలు కలిగి వుంటారు,  


వారే భగవంతునికి ప్రీతీ పాత్రులవుతారు.
            



సత్సంగం: మహాదేవపట్నం  తేది: 14/10/2012         సమయం:11 am

రోజు మనిషి తాను  మనిషిని అనే విషయాన్ని  మరిచిపోయాడు.  నేడు 

విశ్వంలో మానవులకు కొదవలేదు, కాని మానవత్వము మాత్రము 

కనిపించుటలేదుఅని సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జి మహారాజ్ వారు 

చెపుతున్నారు.  దేవుడిని చూడాలనుకుంటున్నారా, అయితే గుడులు

గోపురాలు తిరగండి.  దేవుడిగా అవ్వాలనుకుంటున్నారా , అయితే, ఆకలితో 

ఉన్నటువంటి అన్నార్తులకు సేవ చేయండి, సహాయపడండి  అప్పుడు నీవే 

దేవుడవు అవుతావు అని ఒక శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువు 

చెప్పినటువంటి సమాధానం. 

మనిషిగా పుట్టాక, మానవత్వమే లేకపోతే ఇక భక్తుడిగా చెప్పుకొనే అర్హత ఏ 

మనిషికి లేదు.  అందుచేతనే, దానవత్వం నుండి మాన వత్వం వైపుకు

మానవత్వం నుండి దైవత్వం వైపుకు మనిషి చేసే ప్రయాణమే జీవితం

దానికి దోహదపడేదే భక్తి, అట్టి భక్తిని తెలిపేటటువంటి వాడే సద్గురువు.  ఈ 

రోజు మనిషి తోటి వారిపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటున్నాడు.  అందరు 

ఒక్కటిగా  ఉండాలి అనేది భగవంతుని ఉవాచ.  నేడు సద్గురు బాబా హర్దేవ్ 

సింగ్ జి మహారాజ్ వారి యొక్క కోరిక, లక్ష్యం అదే. 

మానవుడు తను ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి, కాని నేడు సజీవ 

నరకాన్ని సృష్టించుచున్నాడు.  ఆనందం కోసం ఎక్కడో వెతుకుతున్నాడు

తను ఆనంద స్వరూపుడైనప్పటికి. 

నేడు మానవుని  దుఖానికి కారణం మనతో మనకు పరిచయము  

లేకపోవడము.  అందరితో పరిచయాలు పెంచుకుంటున్నాము, కాని మనతో 

మనకు పరిచయము మాత్రము చేసుకోవటములేదుఈనాడు సద్గురువు 

బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి, మనతో మనకు పరిచయము చేసారు.  మనకొరకు  ఒక 

ఆధ్యాత్మిక ప్రపంచాన్ని  సృష్టించారు.   ప్రపంచములో ఈర్ష ద్వేషాలకు 

తావులేదు.  ప్రేమ, దయ, సహనము వంటి గుణాలకు  మాత్రమే స్థానం 

ఉంది. 


రోజు మనిషి తన ఆరోగ్యాన్ని  కూడా లెక్క చేయకుండా, ధనాన్ని  

సంపాదించటానికి ప్రాధాన్యతను ఇస్తున్నాడు.  తిరిగి అదే  ధనాన్ని తన 

ఆరోగ్యాన్ని  పొందటానికి ఖర్చు పెడుతున్నాడు.  అంటే చివరికి తను 

ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టాడో, అక్కడికే చేరుకుంటున్నాడు  కాని

ఉన్నతిని, ఉత్తమ తత్వాన్ని  మాత్రం సాధించలేకపోతున్నాడు. 

భగవంతుడు  జీవినైనా ఈ భూమి మీదకు ఒక లక్ష్యంతో  పంపిస్తాడు.  

దానిని తెలుసుకొని, జీవించటమే జీవితం.  సృష్టిలోని ప్రతీ జీవి ఇతరులకు 

ఏదో  రకంగా ఉపయోగపడుతుంది.  కాని మానవుడు మాత్రమే ఇతరులకు  

ఉపయోగపడుటలేదు, కనీసం తనకు తాను  ఉపయోగపడుట  లేదు.    

రోజు బాబాజి ఇస్తున్నటువంటి శిక్షణ తనకు తాను ఉపయోగపడుతూ 

ఇతరులకు కూడా ఉపయోగ పడేటువంటిది.

గురువును ప్రసన్నం చేసుకున్నపుడే మాత్రమే  మనకు సేవ లభిస్తుంది.  

గురువును మనము ఎన్నుకోలేము, గురువే శిష్యున్ని ఎన్నుకొంటారు.  

మనలను గురువు ఎన్నుకున్నారు.  మనము ధన్యులము.  కాబట్టి 

జీవితంలో ప్రతి  శ్వాస, ప్రతి క్షణం గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ  

జీవించటమే మనము గురువుకి చెప్పేటువంటి కృతజ్ఞ్యత.

తండ్రి, కొడుకుతో అన్న మాటలు “ నీవు ఏడుస్తూ ఈ భూమి మీదికి 

వచ్చావు, లోకం నవ్వింది.  నీవు ఎలా జీవించాలంటే, నీవు నవ్వుతూ ఈ 

భూమిని వదిలి వెళుతుంటే ఈ లోకం నిన్ను చూచి ఏడవాలి.



సత్సంగం: కోలమూరు  తేది: 13/10/2012 .సమయం: మ!! 3 గంటలకు

అవతారవాణిలో బాబాజి తెలిపినట్లుగా, “భక్తుడు ఇంకా తెలియదేమిటి భగవంతుని తెలుసుకోవటమే భక్తి అని, త్యజించి వేసి ఎల్ల భ్రమలను సద్గురుని చెంత శిరస్సుని వంచుట భక్తి అని
కాని నేడు మానవుడు అటువంటి  భక్తిని చేయకుండా, తనకు నచ్చినట్లుగా భక్తిని చేస్తూ జీవితంలో ఆనందాన్ని ఆశిస్తున్నాడు.  భక్తి ఆనందాన్ని ఇవ్వాలి.  భక్తి ప్రేమను ఇవ్వాలి, పంచాలి.   రోజు భక్తి అంటే, పూజా గది తలుపులు మూసిన వెంటనే ప్రపంచపు గది తలుపులు తెరవటానికి మానవుడు సిద్దమవుతున్నాడు.  భక్తి వేరు, జీవితము వేరు అనే భ్రమలో, భ్రాంతిలో మానవుడు జీవితాన్ని జీవిస్తున్నాడు.
సద్గురు చెప్పినట్లుగా  “राम भोलो, या अल्लाह भोलो, पहले पह्चान के नाम भोलोఅంటే నీవు రాముడు అను లేదా అల్లాః అను తెలుసుకొని ఆ నామాన్ని జపించు   అలా కానిచో, ఆ భక్తి భిక్షగాడి భక్తి అవుతుందేమో కాని, వాస్తవమైన భక్తి మాత్రం అవదు. 
మానవుడిని భగవంతుడు తన ప్రతిరూపంగా  సృష్టించాడు.  తనను తెలుసుకొని, తనలో ఐక్యమవ్వటానికి ఈ జన్మనిచ్చాడు.  దానిని సాధించటమే మానవ జీవిత లక్ష్యం. 
భక్తి అంటే మనకు జన్మను ప్రసాదించిన  భగవంతునికి కృతజ్ఞత తెలపటం, అంతే కాని ప్రాపంచిక సుఖాలకోసమో, భౌతిక సుఖాలకోసమో ఆరాధించటం  భక్తి అని అనిపించుకోదు.
दुखिया सब संसार, सो सुखिया राम आधारఅని గురునానక్ చెప్పినట్లుగా, ఈ సంసారం అంతా దుఖమయము, ఒక్క భగవంతుని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి వాడే సుఖవంతుడు, ఆనందమయుడు.  ఈ సత్యాన్ని తెలుసుకున్న మానవుడే ఈ దుఃఖ ప్రపంచములో ఎలాంటి మలినాలు అంటుకోకుండా భగవంతుని చేరవచ్చు.  లక్ష్యాన్ని సాదించవచ్చు.
శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునునికి భగవద్గీతలో ఈ బ్రహ్మ జ్ఞానాన్ని బోధించినపుడు, నేను చెప్పింది విను, మాట్లాడు అని తెలుపలేదు.  నన్ను  దర్శించమని తెలిపాడు.  బ్రహ్మ జ్ఞానాన్ని నేడు బాబాజీ  మనకు ప్రసాదించి, ఈ విశ్వమంతా  ఒకే ఆత్మను దర్శించి, అందరిని నువ్వు ప్రేమించు, భేద భావాన్ని విడనాడు అని సందేశాన్ని ఇస్తున్నారు.
యుగ యుగాలలో అవతార  పురుషులు ఇచ్చిన సందేశం ఒకటే, వారందరూ తమ దేహాన్ని కాలి క్రింద తొక్కిపెట్టి, దేహాతీతులు కండి అని సందేశం ఇచ్చారు.  కాని నేడు మానవుడు వారు చెప్పినటువంటి  సందేశాన్ని కాలి క్రింద తొక్కిపెట్టి, దేహాలను ఆరాదిస్తున్నాడు.  తిరిగి నేను భక్తుడను అని  గొప్పలు చెప్పుకుంటున్నాడు.  ఇది కాదు భక్తి, సంతు మహాత్ముల యొక్క మాటలను జీవితములో  స్వేకరించి , అనుసరించి  జీవించటమే భక్తి అని  తెలిపారు.
ప్రాపంచిక సంపదలు కలిగినటువంటివాడు నిజమైన ధనవంతుడు కాదు, రామ నామ ధనాన్ని సంపాదించినటువంటి వాడు నిజమైన ధనవంతుడు.  నేడు మన మధ్య శరీర పరంగా లేనప్పటికీ, భక్త కబీరు, మీరాభాయి, తులసీదాసు, సజ్జన్ సింగ్ వంటి వారిని తలుచుకుంటున్నామంటే, వారు రామ నామ ధనానికి అధిపతులు కాబట్టే.
సద్గురు చరణాలను ఆశ్రయించి, పరమాత్మను దర్శించి, భగవంతుని అరాధించటమే భక్తి, అటువంటి  వారే సంత్ మహాత్ములు.  లోకంలోని మానవులందరూ కూడా జీవం వున్న  రాళ్ల వంటి వారు, వారి మధ్యలో స్పర్శమణి వంటివారు సంత్ మహాత్ములు.   .  పరశువేది లోహాన్ని బంగారంగా మారుస్తుంది, కాని ఈ రోజు సద్గురువు ప్రతి ఒక్కరిని ఒక పరశువేదిగా మారుస్తున్నారు. నిద్ర, భోగం, భోజనం, భయం మొదలైనవి అన్నీ మనిషి అనుభవిస్తున్నాడు, జంతువులు అనుభవిస్తున్నాయి.  ఈ రెండిటికి భేదం ఆత్మ జ్ఞానం పొందటమే అని, ఈ ఆత్మ జ్ఞానం లేనివారిని పశువులు మాత్రమే గుర్తిస్తాయని, మనుషులు గుర్తించరు అని అవతార పురుషులు తెలుపుతున్నారు.  




సత్సంగం: భీమవరం  తేది: 12/10/2012  సాయంత్రం 7 గం!!ల కు

మనము  ఎప్పుడైతే తోటి భక్తుణ్ణి  మెప్పించగలమో అపుడే గురువు 

యొక్క మెప్పును పొందగలము.  అంతటా, సర్వత్రా,  పరమాత్మ  

వున్నాడు అనే భావన మనకు తోటి భక్తునికి దగ్గర చేస్తుంది. 

ఒక  కట్టెను కాల్చినపుడు అది  కాలి పూర్తిగా బూడిద  అయినప్పుడే 

కాలింది అని చెప్పగలము.  ఆ విధంగానే, మనలోని గుణాలు రహితం 

అయినప్పుడే జ్ఞాని అని అనిపించుకునేందుకు అర్హతను కలిగి 

ఉంటాడు.  నేటి మానవునికి ఒక వస్తువు యొక్క ఖరీదు తెలుసు 

కాని, విలువ మాత్రము తెలియుటలేదు.  మానవ జన్మ అత్యంత 

విలువైనటువంటిది, మళ్లీ, మళ్లీ రానటువంటిది. కాని దాని విలువను 

తెలుసుకొని విలువైన జీవితాన్ని మాత్రము జీవించుటలేదు.  నేడు 

బాబాజి ఈ విలువలనే సేవా, స్మరణ, సత్సంగముల ద్వారా శిక్షణను 

ఇస్తున్నారు.  నిరంకారి భక్తుడు అయినటువంటి వారికి ఏ సమస్య 

వచ్చినా వాటికి పరష్కారం  సేవా, స్మరణ, సత్సంగము మరియు 

చరణామ్రుతములే అని మహాత్ములు తెలుపుతూ వుంటారు.

ఒక  వాయిద్యాన్ని వేరు వేరు కళాకారులు  పలికించినా, దాని నుండి 

వినిపించే  శబ్దం ఒకేలా వుంటుంది.  అదే విధంగా, సంతు మహాత్ముల 

యొక్క భావాలు ఒకే విధంగా వుంటాయి.  అందుచేతనే మనము ఏ 

మహాపురుషుని కలిసినా ఆనందాన్ని పంచుకోగాలుగుతున్నాము 

స్తితి నేటి సంసారంలో లోపించింది.  భక్తి జీవితంలో సుఖాన్ని, శాంతిని

ఆనందాన్ని ఇచ్చేదిగా  వుండాలి, కాని నేడు మానవుడు  చేసే భక్తి 

మనిషిని, మనిషి  నుండి వేరు చేసేదిగా వుంది  కాని, కలిపేదిలా లేదు.  

ఈనాడు సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ వారుకలుపునదే 

ధర్మము , కాని విడదీయునది కాదుఅని మానవాళికి సందేశాన్ని 

ఇస్తున్నారు.


అడవిలో  భిన్నమైన జాతికి చెందినటువంటి మృగాలు అన్ని కలిసే 

వుంటాయి, తమ జాతి నుండి తమకు ఎలాంటి అపాయము వుండదు.  

కాని,   జనారణ్యంలో ఒకే జాతికి చెందినా  మానవులు మాత్రము 

కలిసి  వుండలేకపోతున్నారు.  చింతించవలసిన విషయము 

ఏమిటంటే, మనిషికి  తోటి మనిషి నుంచే ప్రమాదం  పొంచి వుంది.   

సత్యాన్ని  తెలుసుకుని, సద్గురు నడిచిన మార్గంలో కనుక మనము 

అడుగులు  వేస్తే,  ప్రపంచములో ఆనందంగా వుండగ లుగుతాము.  

అందుచేతనే నిత్యము, మనము ఒక సేవకుడిగానే భావించుకోవాలి.


భిన్నత్వాన్ని వీడి ఏకత్వాన్ని దర్శించినపుడే, తోటి మానవునితో మన 

వ్యవహారం సుందరంగా వుంటుంది.   జగత్తు కూడా సుఖ 

శాంతులతో వర్ధిల్లుతుంది

మనం జీవితంలో ఉన్నతంగా, ఉత్తమంగా ఎదగాలంటే మనము 

ఎవరిని అయితే  ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో వారి 

గుణగణాలను మన జీవితంలో ఆచరించాలి.  ఒక రాముడిగా

కృష్ణుడుగా, హనుమంతుడిగా, వివేకానందగా, బాబా అవతార్ సింగ్ జీ 

లా, బాబా గురుబచన్ సింగ్ జీ లా   ఎదగాలంటీ వారి నడకను

బోధను  స్వీకరించి, కర్మల ద్వారా వ్యక్తపరచాలి.  ఇదే నేడు సమయపు 

సద్గురువు మానవాళికి ఇస్తున్నటువంటి దివ్య సందేశం.




తేది: 10/10/2012 బుధవారము ఉదయం 7గం!! సత్సంగ భవనము,                        

భీమవరం

సత్గురు బాబా హరదెవ్ సింగ్ జీ మహారాజ్  వారి కృపతో, పూజ్య 

మోహిని బెహెన్ జీ గారి ఆశీర్వాదంతో  మన భీమవరం బ్రాంచి తరఫున  

భీమవరంనిరంకారీస్ అనే ఒక వెబ్ సైట్ ని  పూజ్య మోహిని బెహెన్ జీ 

గారు ప్రారంభించారని తెలపటానికి దాసుడు చాలా సంతోషిస్తున్నాడు 

మరియు సత్గురు చరణాలలో  ధన్ నిరంకార్..  వెబ్ సైట్ పూర్తిగా 

తెలుగులోనే మనమందరమూ చూడవచ్చు.  అలాగే మహాపురుషులు 

శ్రీమతి దాట్ల విజయకుమారి గారికి సత్గురువు మరింత ఇలాంటి ప్రేరణా 

పూర్వకమైనటువంటి సేవలు చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థన..  దీనికి  

నాంది మహాత్ములు శ్రీమతి దాట్ల విజయకుమారి గారికి సత్గురువు 

కలిగించినటువంటి ఆలోచన.  దానిని వెంటనే అమలుపరచ 

గలగాటానికి బాబాజి యొక్క ఆశీర్వాదములు  కారణం


సత్గురు బాబాజిమీరు నేను చెప్పినట్లుగా చేస్తే, మీ కార్యాలు 

సఫలీకృతం అవటానికి కావలసిన ఆశీర్వాదం నేను ఇస్తానుఅని 

తరచూ చెపుతుంటారు. మన లౌకిక జీవితములో ఏ 

పాత్రనునిర్వహించినా(తల్లి, తండ్రి, భార్య, కొడుకు,కూతురు

వ్యాపారస్తుడు, ఉద్యోగి) అది గురు భోధకు అద్దినట్లుగా జీవిస్తే వారు 

ధన్యులు.  మనము సత్గురు కార్యానికి దోహదపడేలా మన మనసుకి 

నచ్చ చెప్పుకోవాలి. మనసును గురు మార్గంలో మళ్లించి, చెడువైపు 

వెళ్ళకుండా మనము మనసుకి నచ్చ చెప్పుకోవాలి.  గురువు 

చెప్పినట్లుగా మధురముతో కూడినటువంటి మాటలు, నమ్రతతో 

కూడినటువంటి ఆచరణతో జీవనాన్ని సాగించాలి.  తోటి 

మహాపురుశులతోటి సత్సంభందాలు కలిగి వున్నపుడి సత్గురువు 

సంతోషిస్తారు.  

తేది: 10/10/2012 బుధవారము      సమయం: రాత్రి  7గం!!  ఆదర్శనగర్, భీమవరం


ఊపిరి అనేదిమనకు  తెలియకుండా ఎలా జుఅరుగుతుందో తెలియదు.  

అదేవిధంగా గురుకృప  అనేది ఎలా మనకు లభిస్తుందో మనకు 

తెలియదు.  గడిచిన సమయము  వేస్ట్ పేపర్ లాంటిది. భవిష్యత్తు అనేది 

ప్రశ్నా పత్రము లాంటిది.  వర్తమానం సమాధాన పత్రం వంటిది.  

వర్తమానంలో జీవిన్చేవాడే జ్ఞాని అని సత్గురు బాబా హరదేవ సింగ్ జీ 

వారు తరచుగా చెపుతుంటారు. 


మనము ఎపుడు  సంత్ మహాత్ములతో సహవాసం చేయాలి.  గంధం 

చాల సువాసననిస్తుంది.  అదే మురికి నీటిలో ఉంచితే దుర్గంధాన్ని 

ఇస్తుంది.   దీనికి కారణం సహవాస దోషము.


భగవంతుడు చిన్న  చిన్న ద్వారాలు తెరుస్తాడువాటిని గుర్తించి 

మనము ప్రవేశిస్తే  ఆనందం పొందగలం. 


సంత్ మహాపురుషులు, తమ కోసం కాకుండా, యితరుల కొరకు  తమ 

జీవాన్ని, జీవితాన్ని త్యాగం చేస్తారు.


సత్సంగాముకు రావటము వలన తనువుకి(శరీరానికి) స్వస్థత

మనసుకి స్వేఛ్చ, ధనమునకు  సార్ధకత వస్తుంది.






తేది: 08/10/2012                       భీమవరం                 సత్సంగం సమయం:  ఉదయం  గం

                                                                          


విద్య లేని మానవుడు వింత పశువు .  ఎందుచేతనంటే గుడ్లగూబ పగలు చూడలేదు ; కాకి రాత్రి సమయములో చూడలేదు; విద్యా హీనుడు రాత్రి పగలు చూడలేడు.  ఇక్కడ విద్య అంటే లౌకిక విద్య కాదు, ఆధ్యాత్మిక విద్య అని మనకు సనాతనంగా అవతార పురుషులు యుగ యుగాలుగా తెలుపుతున్నారు.

ఆత్మ విశ్వాసం, ఆత్మ స్త్యర్యం, నైతిక విలువలను పెంపొందించేదే వాస్తవమైన విద్య అని భీష్మచార్యులు మహాభారతంములో  తెలిపారు. 

రాజవిద్య రాజగుహ్యయోగంలో శ్రీ కృష్ణ భగవానుడు విద్యలలోకేల్ల బ్రహ్మ విద్య తలమానికమైనది అని తెలుసుకోదగినది అని భగవద్గీతలో తేలిపారు.

చదివి చదివి చావంగానేంటి  చావు లేని చదువు చదవవలె
చదివి చదివి కోటి మంది చచ్చిరి కదా
విశ్వధాభిరామ వినుర వేమా అని వేమన తెలిపారు.

నేడు సత్గురు బాబా హరదేవ సింగ్ జీ మహారాజ్ వారు ఈ విద్యనే భగవత్ సాక్షాత్కారం ద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగచేసి ఈ బ్రహ్మ విద్యని సర్వ మానవాళికి భోధిస్తున్నారు. 

నచికేతుడు చూపించిన శ్రద్ధ  (ఈ బ్రహ్మ విద్య కొరకు సమస్త ప్రాపంచిక సంపదలు సుఖాలను త్యజించాడు)  ; బుద్దుడులో ఉన్నటువంటి కరుణ (పక్షి కోసము తన ప్రాణాలను త్యాగం చేయటానికి సిద్ద పడ్డారు ) ; చాణుక్యునిలో ఉన్నటువంటి నిజాయతి (తన ప్రయోజనం కంటే ప్రజల ప్రయోజనము కొరకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు); అశోకుడు పాటించినటువంటి అహింసా మార్గం (కలింగ యుద్దంలో పారినటువంటి రక్తపుటేరుని చూచి కలతచెంది హింసను వీడాడు); బాబా గురుబచన్ సింగ్ జీ మహారాజ్ , మహాత్మా గాంధి  వంటి వారు పాటించినటువంటి సత్య నిష్ఠ (తమ ప్రాణాలను లెక్క చేయకుండా తము నమ్మిన సిద్దాంతాన్ని వీడలేదు).

సేవ , స్మరణ , సత్సంగాల ద్వారా  మాత్రమే శ్రద్ధ, కరుణ, నిజాయతి, అహింస, సత్య నిష్ఠ వంటి సద్గునాలను  పెంపొందించగలమని నేడు సత్గురు బాబా హరదేవ సింగ్ జీ మహారాజ్ వారు నిరూపిస్తున్నారు. 

నేటి సమాజంలో మానవుడు తన స్వార్ధం కోసం అసత్య మార్గాన్ని అనుసరిస్తూ
పాపాచరణతో ధనార్జన చేస్తూ తను దుఖం పొందుతూ తోటి మానవునికి కూడా దుఖాన్ని కలుగచేస్తున్నాడు. ఇలాంటి నడక నడుస్తూ కూడా తాను  భక్తున్ని అని భావిస్తున్నాడు.  దీనికి కారణం వాస్తవమైన సత్యము తెలియకపోవటము మరియు నేర్వకపోవటము.  ఏ విద్యను పొందితే మిగిలిన విద్యలను  పొందవలసిన అవసరము లేదని  అర్జునుడుకి శ్రీ కృష్ణ భగవానుడు తెలుపుతూ ఏ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చారో , అట్టి ఆత్మ విద్యను నేడు  సత్గురు బాబా హరదేవ సింగ్ జీ మహారాజ్ వారు అందిస్తున్నారు.

మానవుడు భగవంతుడు సృష్టించిన జీవులలో సర్వశ్రేష్టుడు..  ఆ ఉన్నత తత్వాన్ని కాపాడటమే మానవుని యొక్క ధర్మమై ఉండాలి.  ఈ సత్యమైన బ్రహ్మ విద్యని వ్యాప్తి చేయుట కోరకే నేడు సంత్ నిరంకారి మిషన్ కంకణం కట్టుకొని ముందుకు సాగుతుంది. 

కావున, మానవుడు ఈ విద్యను పొంది పశుత్వం నుండి మానవత్వంవైపుకు, మానవత్వం నుండి దైవత్వం వైపుకు అడుగులు వేయాలి, ఇదే మానవుని జీవిత లక్ష్యం అయి ఉండాలి.   


తేది: 09/10/2012                       భీమవరం                 సత్సంగం సమయం:  ఉదయం  గం


అవతారవాణి నిరంకారిలకు  ప్రామాణిక గ్రంధం, దీనిలోని 376 శబ్దాలు , జ్ఞానము పొందని వారు  ఏమి పొందాలి, జ్ఞానం పొందిన వారు ఎలా ఉండాలో తెలుపుతుంది.  ఉదాహరణకు 191 శబ్దములో -
వేష, భాష , ఆహారపు అలవాటులను చూసి ఇతరులను ద్వేషించరాదు అని, పరుల ఉన్నతిని చూసి అసూయ చెందరాదు అని,  వ్యర్ధమైన కర్మలతో జీవితాన్ని వ్రుదాచేయ రాదనీ, ఏ రీతిగా అంటే నీళ్ళను చిలికి వెన్నను ఆశించుట  అని  బాబా అవతార్ సింగ్ జీ వారు తెలుపుతున్నారు.

మహాభారతములో, దుర్యోధనుడు మయసభను చూసి, అసూయ  చెంది  అదే కావాలని కోరుకున్నాడు.  తన తండ్రి మరొకటి నిర్మిస్తానని తేలిపినా అదే కావాలని మొండితనాన్ని ప్రదర్శించటం వలన కౌరవ వంశము నాశనం కావటానికి కారణమయ్యాడు.

వెన్న కావాలనుకుంటే నీళ్ళను చిలికితే వుపయోగాముండదు, పాలను చిలికితేనే  ఉపయోగము. అదేరకంగా  సద్గురు చరణాలను చేరి ఆత్మా జ్ఞానాన్ని పొందిన వారు ఈ భవసాగరాన్ని తేలికగా దాటగలరు.

ద్వేషం పుట్టేది ఎక్కడో, కాని మనలను దహించివేస్తుంది. ఏ రకంగా అంటే వెనుకటికి ఎవరో ఎలుకను పట్టుకోవటానికి తన ఇంటిని తగలపెట్టినట్లుగా. అందుచేతనే నేడు బాబా హరాదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు ద్వేషము స్థానములో ప్రేమను నేర్పించి, క్షమా గుణాన్ని పెంపొందిస్తున్నారు.  మానవుడు ఈ గుణాలను కలిగి వున్నపుడు మాత్రమె శాంతియుతమైన, ఆనందమయమైన జీవనాన్ని జీవించగలడు.  ద్వేషము అంటే ద్వివిషం లాంటిది, అంటే విషము కంటే ఎక్కువ హానికరమైనది.

మనము సమయాన్ని మనమీద పెట్టుబడిగా పెట్టుకుంటే ఉపయోగము వుంటుంది కాని, ఇతరుల గురించి వెచ్చించి మన జీవితాన్ని మనమే దుఖమయము చేసుకుంటున్నాము.

పుట్టుకే కనుక కులాన్ని తేలిపితే  అందరమూ బ్రాహ్మణులు అని శుక్రాచార్యులవారు తెలిపారు.   అందరి యొక్క తండ్రి ఆ పరమపిత పరమాత్మ కనుక మానవులందరూ బ్రహ్మ పుత్రులే.

ఇదే ఈనాడు మన సమయపు సద్గురువు బాబా హరదేవ్ సింగ్ జీ 
మహారాజ్ ఇస్తున్నటువంటి సందేశము.