ARTICLES


                     
                                                
రాజమాతా కుల్వంత్ కౌర్జీ  శ్రద్ధకు , జిజ్ఞాసకుకర్తవ్య పాలనకు,సేవ సత్కారాలకుఆత్మ సమర్పణకుమాతృ ప్రేమకు
విశాలత్వవ్యాపకతకు,తప త్యాగాలకుసహనశక్తి మరియు 
సహనశీలతకుభక్తికి ప్రతిరూపం.
                 రాజ మాతాజీ  ప్రవచనం
సాదుమహాపురుషుల్లారామనం రోజూ చదువుతాం ‘ధర్మ క్షేత్రంలో భీజాలు చల్లిన వారు ఉజ్వలంగా ఉంటారు. అనిసద్గురు-ప్రకృతి నియమం ఏమనగా మనం  భీజం నాటితే దాని ఫలం పొందుతాంమనం సేవ అనే భీజం నాటితే సేవ లభిస్తుందిప్రేమ భీజం నాటితే అందరిచే ప్రేమించబడతాందీనికి వ్యతిరేకంగా మనం ఎవరినైనా ద్వేషిస్తే ఇతరులు మనల్ని ద్వేషిస్తున్న భావన కలుగుతుందిఎందుకనగా మనం ద్వేషమనే భీజాన్ని నాటాముమనం ఇతరులను సత్కరిస్తే మనకూ గౌరవ మర్యాదలు లభిస్తాయిమనం మధురంగా మాట్లాడితే ఇతరులకు మనతో అలాగే  మాట్లాడతారుఇలా వ్యవహరించటం వలన సంతుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయిఅందరికీ తెలిసిన విషయఇది – నేను నాటిన భీజంనేను పలికే మాటలను బట్టే ఫలితం లభిస్తుందిఇది క్రొత్తగా తెలుసుకోవలసిన విషయం కాదుమన పరివారంలోని పిల్లలతో మనం ప్రేమగా మాట్లాడితే వారూ ప్రేమగానే సమాధానం చెపుతారుమనం కోపంతో కఠినంగా మాట్లాడితే వారి సమాధానం కూడా తీవ్రంగానే ఉంటుంది మనం పిల్లలను దండిస్తూ మాట్లాడుతూ వారు మాత్రం మనతో ప్రేమతో వ్యవహరించాలని భావించరాదువారి సమాధానం కూడా మనం పలికినట్లుగా కఠినంగానే ఉంటుంది ఇక్కడ ఉన్న వారంతా గ్రుహాస్తులే విషయం అందరికీ సుపరిచితమేసంత్ మహాపురుషులు  విషయాన్నే ప్రస్తావిస్తున్నారుఎవరైతే సద్గురువు మహిమను విశ్వసిస్తారో సద్గురువు కూడా వారికి కీర్తి ప్రతిష్టలు కలుగ చేస్తారు.
ఒక సారి షిమ్లాలో సత్సంగం జరుగుతుందిసద్గురు బాబా  గురుబచన్ సింగ్ జీ మహారాజ్ మరియు దాసీ పీఠం పై ఆశీనులై ఉన్నాము ఒక క్రొత్త వ్యక్తీ వచ్చి సభలో ఇలా ప్రశ్నించాడు బాబా గురునానక్ వారు చేదైన కుoకుడుకాయలను తియ్యగా మార్చారుమీ గురువు ఏమి చేసి చూపించారు? అనిమా నుండి సమాధానం రాకుండానే సత్సంగంలో కూర్చుని ఉన్న ఒక భక్తుడు లేచి నిలబడి ఇలా పలికాడు, ‘శ్రీ గురు నానక్ జీ మహారాజ్ వారి సమయంలోనైతే నేను లేను కనుక నాకు  తియ్యదనం ఎటువంటిదో అవగాహణ లేదు కాని  రోజు నిలువెత్తు చేదు భావాలతో ఉన్న నన్ను నా సద్గురువు తియ్యదనంతో నింపారు.’ నా జీవితం ఎంత  చేదుగా ఉండేదంటే ఇతరులతో నా సంబాషణ మొత్తం పరుష పదాలతో ఉండేదినా గుమ్మం బయట ఎవరూ మీసం మెలితిప్పి నడిచేవారు కాదు రోజు మీరు వెళ్లి నా ఇరుగు పొరుగు వారిని అడిగి తెలుసుకోండి సద్గురువు నా మనసులోని భావాలలో పరివర్తన తీసుకు వచ్చారుఇప్పుడు నెను ఇతరులను చూసి ఆనందిస్తున్నానునాలోని  మార్పు నన్నే ఆశ్చర్య పరుస్తుంది.
సాదుమహాపురుషుల్లారా సద్గురువు మన జీవితంలో ప్రవేశించినప్పుడునామ ధనాన్ని ప్రసాదిస్తారు నామ ధనం మన జీవితాన్ని మార్చివేస్తుందిమనం అంతర్ మధనం చేసుకుంటే బ్రహ్మ జ్ఞానం పొందక పూర్వం పొందిన తరువాత మన జీవితంలో కలిగిన మార్పులు స్పష్టంగా అవగతం అవుతుందిఇంతకు పూర్వం మనం దైనందిక జీవనం మరియు ఇప్పుడు సద్గురువు కృపతో బ్రహ్మ జ్ఞానం పొందిన పిమ్మట వచ్చిన పరివర్తన కొన్ని సందర్బాలలోమనలోని మార్పును మనం గుర్తిచనప్పటికీ ఇతరులు మనలోని గమనీయమైన మార్పులను గుర్తించి తెలుపుతారుఎప్పుడైతే సంత్ మహాపురుషులు సద్గురువుని పరిపూర్ణంగా విశ్వసిస్తారోప్రతి క్షణం ఆయన పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి వ్యవహరిస్తారుసద్గురు అపార కృప వలెనే నా జీవితంలో మార్పు సంభవిస్తుంది.
సాదుమహాపురుషుల్లారాబాల బాలికలనుయువతను సత్సంగంలో చూసినప్పుడు ణా హృదయం పరవశిస్తుందిగురువుతో యోగం అయిన పిల్లల గురించిన ప్రస్తావనను బాబాజీ  ప్రవచనాలలో తరచూ వింటూ ఉంటాంఇప్పుడే మీరుఈ పిల్లలు పలికిన ‘అవతార్ వాణి’ శ్లోకాలను విన్నారుపెద్దవారమైన మనం ‘నా అంత గొప్పగా ఎవరూ మాట్లాడలేరు’ అని తలుస్తాముకానీ  చిన్న పిల్లల్ని చూసిన తరువాత వీరికి మించిన ప్రతిభ మనకు ఉందాఅనే ప్రశ్న ఉదయిస్తుందిదాతారుడు తలచిన ఎడల భక్తుల హృదయంలో నివాస ముండి వారిచే  కార్యానైనా చేయించగలడు.  ఇది కేవలం కధ కాదుమనం నలుగురిలో కూర్చోని మాట్లాడలేని మూగ వారిలా ఉండేవారముఎవరైనా ప్రశ్నిస్తే జవాబు చెప్పలేమనే భావన మదిలో మెదిలేదికావున ఇతరులకు దూరంగా ఉంది పోఏవారముఇప్పుడు సద్గురువు జ్ఞానం యొక్క చత్రాన్ని మన శిరస్సుపై ఉంచినందున ఎన్నో మాటలు పలుకుతున్నాము భావమైతే సద్గురు పలికిస్తారో అదే పలుకుతాము భావం ఎవరి మదిలో నిలుస్తుందో వారు అందరికీ ప్రియులువారి ఆలోచన సరళి అందరి (తమ దగ్గరి వారైనా  పరులైనాహితాన్ని కోరేదిగా ఉంటుందిసంత్ మహాపురుషులకు ఎవరూ పరాయివారు కారుఅందరూ తమ వారేఎప్పుడైతే అందరినీ తమ వారిగా తలుస్తారో వారి మాటలలో క్రోధం గోచరిచదుఎందుకనగా ఎప్పుడైతే మనం శీతల హృదయంతో మాట్లాడతామో మన మాటలు కూడా స్వాంతతను చేకూర్చేవిగా ఉంటాయిదీని వలన మనకు మానసిక ప్రశాంతత కలుగుతుందిమహాత్ములు తెలిపినట్లుగా  ऐसे बाणी बोलिए मन का आपा खोय, औरन को शीतल करे आप भी शीतल होय  మీరు మాట్లాడే మాటలు మీకు మరియు ఇతరులకు ఉపసమనం కలిగించేవిగా ఉండాలి మన హృదయం చల్లగా ఉన్నప్పుడు ఇతరులకు  చల్లదనాన్ని పంచగలం.
సాదు మహాపురుషుల్లారామానవుడు ఆలోచించవలసిన విషయం ఏమనగా తను  ప్రపంచంలోకి ప్రభు ప్రాప్తి కొరకు మాత్రమే వచ్చాననికాని వచ్చిన తరువాత ప్రపంచపు తళుకు-బెళుకులురంగులకు పరవశించి పోయి మాయ ఉచ్చులో చిక్కుకొని తను  జన్మను భగవంతునితో యోగామయ్యే నిమిత్తం వచ్చాడని మరిచాడుఅందుకే ఇలా చెప్పబడింది” बन्दा नाम जापान नूं आया, माया ने मार लिया ”భగవంతుని నామాన్ని జపించటానికి వచ్చిన నన్ను మాయ తన వశపరుచుకుందిదీని భావము మాయ యొక్క ప్రలోభం ఎంత బలమైనదంటే మానవుడు ఆసలు విషయాన్ని మరచి పోయాడునేను తల్లి గర్బంలో తలక్రిందులుగా ఉండగా నా తల క్రిందకి ఉండి కాళ్ళు పైకి ఉండగా నేను ప్రభువుకు వాగ్దానం చేసానుకాని బయటకు వచ్చిన వెంటనే నేను చేసిన వాగ్దానాన్ని మరచానుకాలు క్రిందకి శిరస్సు పైకి ఉండి నాకు సాటి ఎవరూ లేరు అనే భావంతో నేలపై నుండి రెండడుగుల పై ఎత్తులో నడవటం మొదలు పెట్టానుతన అహంకారం-అభిమానం కారణంగా మానవుడు తన వాస్తవికతను సైతం మరిచాడుఅందుచేతనే మళ్ళీ-మళ్ళీ మోసగింపబడుతున్నాడుజనన-మరణ చక్రాలలో తిరుగాడుచున్నాడు.

సాదు మహాపురుషుల్లారామీరు ధృవుడు మరియు ప్రహ్లాదుని  పేర్లు  వినే ఉంటారుప్రపంచం వారికి ఎంతటి దుఃఖాన్ని కలిగించినప్పటికీ जल भी राम, थल भी राम, है भी राम होसी भी राम  నీటిలో రాముడుభూమిపై రాముడుఉన్నది రాముడు ఉండబోయేది రాముడు విషయం ఎన్నటికీ మరువ వద్దుఅందుచేతనే  నాటికీ వారి పేర్లను శ్రద్ధతో పలుకుతున్నాంనేను భావించేది ఏమనగా ముందు తరాలలో ఒకటి లేదా రెండు పేర్లు చెప్పబడేవికాని ఇప్పుడు చిన్నారులు తమ ముద్దు-ముద్దు మాటలతో స్టేజ్ పై నుండి మాట్లాడుతున్నారు. బాల సంగత్ లు  జరుగుతున్నాయిసమాగాలు జరుగుతునాయినేను మరియు మీరు కూర్చునే స్టేజి మీద చిన్నారులు కూర్చున్నప్పుడు వారికి నమస్కారాలు అందుతున్నాయివారు తమ లేత పెదవులతో ప్రవచనాలు పలుకుతూ ఉంటేధృవుడు మరియు ప్రహ్లాదుల శిక్షణను వారు ధారణ చేయటం చూసి హృదయం పులకరించి పోతుందిసదా  విధంగానే వారి వచనాలు మరియు కర్మలు ఉండేటట్లుప్రతి రోజు సాంగత్యానికి హాజరయ్యేటట్లు మరియు ఉత్సాహంతో సేవ చేయుటకు  దాతారుడు అనుగ్రహించాలివారికి శక్తిని ప్రసాదించాలిఆశీర్వదిoచాలి. మిషన్ యొక్క వాణిని  నవ యువకులు,బాలలు ప్రతి ఇంటికి అందించేటట్లు నిరాకారుడు కృప చూపాలిపెద్దలమైన మనం వారి భావాలను గౌరవించాలి మరియు ప్రోత్సహించాలి. 
రాజ మాతాజీ – కుల్వంత్ కౌర్ జీ
జయ జయ ప్రియ భారతి
జనయిత్రీ కులవంతీ రాజ మాతాజీ నీకు జోహార్లు 
శతకోటి    వందనాలు !
కూతురు స్థానం నుండి నానమ్మ వరకు అన్ని పాత్రలలో             ప్రేమను పంచుతూ
ఆనందంగా ఆస్వాదించిన ఓ నిరంకారీ రాజమాతా
                                                నీకు మా జోహార్లు !

ఒక సద్గురువుకి కోడలివై మరొకరి సద్గురువుకి భార్యవై
సమయపు సద్గురువుకి తల్లివై నిరంతరం వారి వెన్నంటి ఉండి వారిని ముందుకు నడిపించిన ఓ వీర నారీ రాజమాతా
                                                           నీకు జోహార్లు !

మారు మూల ప్రాంతాలనుండి దేశ విదేశాల వరకు
భర్త అడుగుజాడలలో పయనించి
నీ ప్రవచనాలతో ఎంతో మందికి ప్రేరణ కలిగించి
నారీ మణులను సాంగత్యానికి రప్పించ గలిగిన ఓ స్త్రీ మూర్తీ     రాజ మాతా
                                                           నీకు జోహార్లు !

భర్త వియోగాన్ని తట్టుకొని బాధను దిగమింగుకొని కొడుకును వెన్నంటి పెట్టుకొని
సాంగత్యమనే తల్లి ఒడిలో పరివారాన్ని కూర్చోబెట్టుకొని
ఎటువంటి బంధనాలలో చిక్కుకోకుండా
ఈ నిరంకారీ మిషన్ ని ముందుకు నడిపిoచటంలో నీ పాత్రను సుస్థిరంగా నిలిపిన ఓ ధీర వనితా నీకు జోహార్లు !

సద్గురువు మీకు శ్రద్దాంజలి ఘటిస్తూ
నీ శిరస్సుపై ఆశీర్వదించే చేయి
నేను చరణాలు పట్టుకుందామన్నా నీ పాదాలు నాకు లేవని
తల్లిదండ్రులను తలచుకుంటూ తల్లడిల్లి బరువెక్కిన హృదయంతో మాట్లాడుతుంటే
అక్కడ ఉన్న భక్తులతో పాటు ప్రకృతి కూడా శోక సముద్రంలో మునిగిపోయింది.

నీ లాంటి స్త్రీ మూర్తు గర్భాన ఇలాంటి సద్గురువుకి జన్మ నిచ్చి మమ్మల్ని తరిoప చేయటానికి
బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించి నిత్యం సాంగత్యాలు జరుపుకుంటూ నిరంకారునిలో కలిసిపోయిన ఓ రాజ మాతా
                                                           నీకు జోహార్లు!

నారీమణులకు ఆదర్శప్రాయంగా నిలిచి
భక్తులకు ప్రేరణ కలిగిoచే  ప్రవచనాలను ఇచ్చి
నిరంకారి మిషన్ కే కాక సమస్త మానవాళికి స్పూర్తిగా నిలిచి విశ్వమంతటా సత్య సందేశాన్ని అందించి
 ‘ధర్మ రత్నబిరుదాంకితురాలైన నిరంకారి రాజమాతాజీ
నీకు హృదయపూర్వక శ్రద్దాంజలి, నీరాజనం, నివాళి మరియు పాదాభివందనాలు.
                                                ........
                                               జీవిత సాఫల్య మంత్రం
మనిషి పుట్టుకతోనే ‘కోరిక’ అనేది మొదలవుతుంది. కోరినది నెరవేరక పోవటమే దుఃఖము,శోకము, విచారము, బాధ, నిరాశ, నిస్పృహ వంటి భావావేశాలు కలుగుతున్నాయి. సంసార బంధాల నుండి బయట పడలేక మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. పాంచభౌతికమైన ఈ శరీరానికి శాశ్వతత్వం లేదు. అది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వజాలదు. కంటిని ఆకర్షించే వస్తువుల పట్ల, వినసొంపైన శబ్దాల పట్ల పరిమళభరితమైన సువాసనల పట్ల, దైహికమైన ఉద్దీపనుల పట్ల ఆశక్తి చూపుతూ వాంఛ ఎన్నో లోపాలను కలిగి ఉంటుంది. వాంఛ కోరికగా మారినప్పుడు మొహం జనిస్తుంది. ఈ మొహమే జన్మకు దారి తీస్తుంది. ఆనందభరితమైన కోరికలతో, ఉద్వేగమైన కోపంతో, మోహమనే చక్రంలో బంధింపబడి, కలతపడి మనస్సు వాంఛలలో చిక్కుకొనిపోవటం వలన మానవుడు తన  నాశనాన్ని తనే కోరితెచ్చుకుంటున్నాడు. ఇతరుల నాశనం, తన నాశనం ఉభయుల నాశనం కలిగించుకుంటూ మానసిక బాధను, దుఃఖాన్ని పొందుతున్నాడు.
మహాత్ములు మానవునితో
“అందంగా చేయుబడిన ఈ తోలుబొమ్మను చూడు
నవరంద్రాలతో పుండుపడిన దీని సొగసును చూడు
దురాశతో నిండిన దీని రోగ లక్షణాలను చూడు
             అనర్ధమైన, అనిత్యమైన దీని లోతులను చూడు”      
 అని ఉపదేశిస్తున్నారు.
ఈ మానవ జీవితంలోనే పూర్ణానందాన్ని ఆహ్వానించవచ్చు, ఆకర్షించవచ్చు, అర్ధం చేసుకోవచ్చు మరియు పొందవచ్చు. దుఃఖం నుండి విముక్తి పొందినవాడే పరిపూర్ణ మానవుడు. ఎవరైతే జ్ఞానం, కరుణ, సమతతో ఆచరణాత్మక జీవితం  జీవిస్తారో, వారు పరిపూర్ణ వ్యక్తిగా నిలుస్తారు. సత్యజ్ఞానాన్ని ఎవరైనా సేవ, స్మరణ, సత్సంగాలనే సాధనలతో సిద్ధింపచేసుకోవచ్చు, స్థిరపరచుకోవచ్చు. మానవుడు ఎప్పటివరకైతే ప్రాపంచికమైన విషయ సుఖభోగములను, రాగద్వేషాలను, కోరికలను విసర్జించడో అప్పటిదాకా అతడు జన్మ తరువాత జన్మను పొందుతూ నిరంతరం దుఃఖపీడుతుడై బాధలుపడుతూనే ఉంటాడు. ఈ స్థితిని మానవుడు సద్గురు సహాయంతోనే అధిగమించగలుగుతాడు. 
“భూతలంలోని శక్తులన్నిటికంటే, స్వర్గలోకపు సుఖాలన్నిటికంటే, ఈ ప్రపంచపు శాసనాలన్నిటిలో గొప్పది గురుమార్గంలోకి ప్రవేశం.”
ఎవరైతే సాధు మహాపురుషులతో పరిచయాలు పెంచుకొని, ఉచితనుచితాలను తేలికగా గ్రహిస్తూ, దుఃఖం ఉనికిని కారణాన్ని గుర్తించి, దానిని నివారించే సాధన మార్గంలో ఉంటూ, పవిత్రమైన భావనలతో, వాంఛరహితంగా, శాంతిపూర్వకంగా,ధృఢ నిశ్చయంతో, స్థితప్రజ్ఞుడిగా విషయవాసనలను దరిచేరనివ్వక సకల దుర్గుణాల నుండి ముక్తుడౌతాడో అట్టి వాడు జనన మరణాలను జయించి అమరుడౌతాడు. సద్గురువు పై అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటూ పంచప్రమాణాలకు బద్ధుడై జీవిస్తాడు. లౌకిక దృష్టిని దాటి అలౌకిక దృష్టిని, ఐహిక దృష్టి నుండి పారమార్ధికమైన దృష్టిని కలిగి ఉంటాడు.
సృష్టిలోనివన్నీ అశాశ్వతాలే, దుఃఖ కారకాలే, అనిత్యాలే. విజ్ఞుడైన మానవుడు ‘ఇదంతా నాది కాదు. నేనంటే ఈ శరీరం కాదు. ణా అహంకార కారణమైన ఈ రూపం నాది కాదు’ అని గుర్తించాలి. అప్పుడు 
‘దుఃఖం మాత్రమే ఉంది. దుఃఖితుడు లేదు.
కేవలం కర్మలు మాత్రమే ఉన్నాయి. వాటిని చేసే కర్త లేనే లేడు.’
భూత, భవిష్య, వర్తమానాలలో ఏదైతే యదార్ధంగా ఉంటుందో అది మాత్రమే నిజం. జ్ఞానప్రాప్తి వలన అజ్ఞానం తొలగిపోతుంది. వాంఛ నశించటం వలన జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఒక ప్రమిదలో వేసిన వత్తి నూనె అయిపోయాక వెలుగు దానంతట అదే ఆరిపోయినట్లు జీవితంలోని ఇచ్చా, లోభం అనే దుఃఖం హేతువులు నశించగానే కర్మ విముక్తి లభిస్తుంది.
నిజమైన జ్ఞానం అంటే నిస్వార్ధం, ప్రేమ, అహింస అనే మౌలికమైన మూడు లక్షణాలను కలిగి ఉండటమే. ఈ సృష్టిలోని సకల జీవుల పట్ల నిస్వార్ధ పూరితము, ప్రేమ పూర్వితము, అహింసా పూర్వతమూ అయిన సంకల్పాలు కలిగి ఉండాలి అనగా కామ వాంఛలేని సంకల్పాలు, దుర్భావం లేని సంకల్పాలు, అహింసాత్మక  సంకల్పాలతో మనసుని పవిత్రంగా ఉంచుకొని, పవిత్రమైన మార్గాన్ని అనుసరిస్తే  సత్ఫలితాలు, ప్రయోజనాలు కలుగుతాయి.
జ్ఞానకారకాలైన జాగురూకత, న్యాయ విచారణ, సామర్ధ్యం, నిశ్చలత, ఏకాగ్రత, నిర్వికారత అనే లక్షణాలు మంచి భావనలను పెంపొందించుకోవటానికి పరమానంద స్థితి ప్రాప్తికి ఉపకరిస్తుంది. ఉచ్చమైన మంచి ఆలోచనలను స్వీకరించటానికి మానసికంగా కృషి చేయాలి. మన ముందు నాలుగు మనో సోపానాలు ఉన్నాయి:
     “చెడును నిరోదించటం- చెడును అధిగమించటం                 
మంచికి చోటు కల్పించటం- మంచిని వృద్ధి చేయటం”
సద్గురు మార్గదర్శకాలను అనుసరించి జీవించే గురుశిష్యులు కొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. అవి క్రమశిక్షణతో  ధర్మాచరణ చేస్తూ అహింసా మార్గాన్ని పాటిస్తారు. ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతారు, ప్రమాదానికి హేతువులైన మత్తు పదార్ధాలను తీసుకోరు. పరుషమైన పదాలను పెదవులు దాటనీయరు, కరుణ, ప్రేమ భావనాలను  కలిగి ఉంటూ ఆవేశాన్ని, ఏహ్యభావాన్ని విడనాడి విశ్వప్రేమను, సకల ప్రాణుల పట్ల కరుణను పెంచుకుంటారు. నిజాల ఆధారంగా, సరైన సమయంలో, ఉపయోగకరమైన, న్యాయబద్ధమైన క్రమశిక్షణతో కూడిన మాటలనే మాట్లాడే వారి మాటలే జనులకు ఉపయోగపడతాయి.
జ్ఞాన కాంతికి భీజం వేసిన సద్గురువుకి ఎవరైతే బద్ధుడై ఉంటారో, వారు సకల దుఃఖాల నుండి విముక్తి పొందుతారు. వారిలో ‘నేను’ అనే అహంభావం నశిస్తుంది. సమస్తము అశాశ్వతం, దుఃఖమయం అనే భావన జనిస్తుంది. ఎటువంటి బంధనాలకు లోనవకుండా జీవించగలుగుతారు. విశ్లేషణాత్మిక వైరాగ్య భావంతో ప్రాపంచిక మోహాలకు అతీతంగా ఉండగలుగుతారు. అంతిమ లక్ష్యమైన పరమసత్యంతో యోగపరిచే , భవచక్ర విముక్తిని కలిగించే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. నీతి మార్గంలో జీవిస్తూ మానసికమైన చిదానందాన్ని అనుభవిస్తారు. జ్ఞానులతో స్నేహం మనలోని ఏకాగ్రత ఇచ్చాపూర్వకంగా శక్తిపూర్వకంగా, మనోపూర్వకంగా, పరిశోదన పూర్వకంగా ప్రాపంచికమైన చింతను నశింపచేస్తుంది. అశాశ్వతమైన, మోహపూరితమైన కోర్కెలను విసర్జించి, హింస, ద్వేషాసూయ భావనలను క్షాళన చేసుకోగలుగుతాం.
ఏ పని చేస్తున్నా నిరాకారుని స్మృతితోనూ, గ్రహణ శక్తితోనూ ప్రవర్తించాలి. ఎటువంటి పనిలో ఉన్నా అంటే నడుస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా, దుస్తులు ధరిస్తున్నా, ఆహార పానీయాలను స్వీకరిస్తున్నా, మలమూత్రాదులను విసర్జిస్తున్నా, నిద్రిస్తున్నా, మెలుకువతో ఉన్నా, నిశబ్దంగా ఉన్నా, మాట్లాడుతున్నా, జాగురూకతతో వ్యవహరించాలి. ఏ శిష్యునిలోనైతే దేహభ్రాంతి, సంశయము మరియు ఆచార కట్టుబాట్ల ను అంటిపెట్టుకుని ఉండే దౌర్భాల్యం అనే సంకెళ్ళు తెగిపోతాయో, అటువంటి వాడు ధన్యుడు.
సద్గురు బాబాజీ మనకు సర్వ దుఃఖనివృత్తిని కలిగించే ఉన్నతమైన, పవిత్రమైన జ్ఞానం ప్రసాదించారు. దీనిని శ్రద్ధగా అనుసరించాలి, పరిరక్షించాలి. “ఎల్లప్పుడూ నేను విముక్తుణ్ణి. ఈ జన్మ నాకు చివరిది. ఇక నాకు పునర్జన్మ లేదు.” అనే భావన కలిగి ఉండి ఈ జ్ఞానానుసారం పవిత్ర జీవితాన్ని గడపటమే జీవన ముక్తి మంత్రం.

                         అడ్డుగోడలు లేని విశ్వం
సద్గురు నిరాకార బ్రహ్మ యొక్క సాకార రూపం. ఒకే నూలుపోగు యొక్క నిలువు-అడ్డం, కుడి-ఎడమల అమరిక ద్వారా వస్త్రంగా తయారవుతుంది. అదే విధంగా పరబ్రహ్మ పరమాత్మ మరియు సద్గురువు ఒకే సత్యం యొక్క రెండు  రూపాలు. బ్రహ్మ మరియు సద్గురు వేరు-వేరు కాదు. వారిరువురి ఆస్థిత్వం ఒకటే.
ధర్మ స్థాపనకు మరియు అధర్మాన్ని రూపుమాపటానికి పరమాత్మ సద్గురువుగా భూమిపై అవతరిస్తారు.
“యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత I
     అభ్యుత్దాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహం II ”                                                                   -భగవద్గీత 4/7
(ప్రతి యుగమునందు నేను ధర్మ రక్షణ మొనర్చుతాను. ఎప్పుడెప్పుడు ధర్మము లోపించునో, అధర్మం వృద్ధియగునో అప్పుడప్పుడు నేను జన్మించుచుందును.) ఇలా సద్గురువు మానవ సంబంధాలు బలహీనపడినప్పుడు సంసారాన్ని పునరుద్ధరించటానికి మరియు సంస్కరించటానికి అవతరిస్తారు. సంసారంలోని ఎందరో మతాధిపతులు ఈ ఆలోచన ధారతో ఏకీభవిస్తారు. వివిధ బాషలలో, వివిధ సంస్కృతులలో, భిన్న-భిన్న రూపాలలో సద్గురువు సంసారంలో ధర్మ స్థాపన చేస్తూ మానవ  కళ్యాణానికి తోడ్పడతారు. 
ఈ విశ్వం వైవిధ్యంతో నిండి ఉంది. బ్రహ్మ సాకార శరీరం దాల్చి సమయ సమయాన ఈ భూమిపై అవతరిస్తాడు. వారి ఆహారపు అలవాట్లు, బాష, వేషధారణ, రంగు, రూపంలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. ఏసుక్రీస్తు స్వరూపం భగవాన్ శ్రీ రామచంద్రునికి భిన్నంగా ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త మరియు గురు నానక్ దేవ్ జీ స్వరూపం మరియు బాష  ఇతర అవతార పురుషులకు భిన్నంగా ఉండేవి. అయినప్పటికీ వారందరిలో ఒక సమానత్వం మరియు సాధారణత్వం వ్యక్తమవుతుంది. వారు కేవలం ఏ ఒక్క ప్రత్యేక సమాజం లేదా దేశం కొరకు అవతరించలేదు. వారు ఎప్పుడు అవతరించినా సమస్త మానవాళి  కళ్యాణమే తమ లక్ష్యంగా ప్రకటించారు. శారీరిక, సాంస్కృతిక మరియు భాషాపరమైన భిన్నత్వాలు ఉన్నప్పటికీ అన్ని యుగాలలోనూ వారి సందేశమైతే ఒకే రీతిగా  ఉంటూ వచ్చింది. సత్యం, ప్రేమ, నమ్రత మరియు విశాలత్వంతో కూడిన సందేశాన్నే ఈ అవతారపురుషులందరూ వ్యక్తపరుస్తున్నారు. వారి ఆలోచన సరళిలో కూడా యుగాల అనంతరం కూడా ఏ మార్పూ రాలేదు. వారు ఒక యుగంలో ప్రేమ కలిగి జీవంచమని సూచిస్తూ మరొక యుగంలో ద్వేషం, శతృత్వం మరియు  హింసా మార్గాన్ని ఎన్నుకోమని ప్రేరణ ఇవ్వటం జరగలేదు.
బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ ప్రపంచపు దేశాలైన యూరప్, కేనడా, అమెరికాలో విశ్వ కళ్యాణ యాత్రలు చేపడుతున్నారు. ఈ యాత్రలు ఎక్కువ శాతం రోడ్డు మార్గం ద్వారా జరుగుతున్నాయి. ఈ ప్రేమ-సత్య సందేశాన్ని వీలైన ఎక్కువ మందికి  అందచేయాలనే ఆశయమే దీనికి గల కారణం. గురుదేవ్ హరదేవ్ వారి విశ్వ కళ్యాణ యాత్రల ముఖ్య నినాదం ‘ The world without walls (అడ్డుగోడలు లేని విశ్వం). ప్రపంచంలో నేడు దేశాలు ప్రాంతాల ప్రాతిపదికన విభజించబడి ఉన్నాయి. ఈ అడ్డుగోడలైతే ఉండనే ఉన్నాయి. బాష, జాతి, మతం, రూపు-రంగు, ధనిక-పేద, పెద్ద-చిన్న అంశాల కారణంగా మానసిక అడ్డంకులను నిర్మించుకుంటున్నాము. ఇది మానవుల మధ్య దూరాలను పెంచుతుంది. మానవుల మధ్య సత్సంబంధాలకు అవరోధంగా నిలుస్తుంది. ఈ అడ్డుగోడలు మన మధ్య ఉన్న దూరాలను సూచిస్తాయి. ఇవి ద్వేష భావనను వృద్ధి చేస్తాయి. బెర్లిన్ గోడ ఎన్నో సంవత్సరాలు ఇరు దేశ వాసులను విభజించి ఉంచటం జరిగింది. ప్రజలలో జాగృతి కలిగినప్పుడు వారు ఆ గోడను కూల్చివేసి ఆ కూల్చిన గోడ శిదిలాలపై ‘ఈ ప్రపంచం గోడలకై ఎంతో చిన్నది.’ అని వ్రాయటం జరిగింది.
నేడు సోదరుల మధ్య మతబేధాలు విజ్రుంబిస్తున్న తరుణంలో ఒకే పరివారంలోనే  అడ్డుగోడలు నిర్మిస్తున్నారు. ధర్మం, బాష, వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయం వంటి కారణాల ఆధారంగా విడగొడుతున్నారు. మండుటెండల కాలంలో వర్షపు జల్లు ఆహ్లాదాన్ని కలిగించే రీతిగా ఈ అడ్డుగోడల రహిత ప్రపంచ నిర్మాణానికి సాకార రూపం ఇవ్వటానికి సద్గురువు చేపడుతున్న ఈ ఉద్యమం అందరికీ సుఖశాంతులను ప్రసాదిస్తుంది. సద్గురువు జ్ఞాన దృష్టిని కలిగి ఉంటారు. వారు అందరిలో ఈ ప్రభు పరమాత్మనే దర్శిస్తారు. ఈ దృష్టి ‘వసుదైక కుటుంబకం’  అనగా ప్రపంచమంతా ఒక పరివారం అనే దృశ్యాన్ని దర్శింప చేస్తుంది. సద్గురువు నుండి మనం ఈ దృష్టిని పొందినట్లయితే అన్ని అడ్డుగోడలు కూలిపోతాయి. దూరాలు సమసిపోతాయి.
మానవులు హిందు, ముస్లిం, క్రైస్తవుడు వంటి అనేక రూపాలలో జన్మించినప్పటికి వారు నైపుణ్యం కలిగిన  డాక్టర్, శాస్త్రవేత్త, ఇంజనీరుగా ప్రగతి సాధించటం ప్రశంసనీయం. ‘మీరు అత్యుత్తమ శిఖరాలను చేరుకోండి. అదే సమయంలో మంచి మానవులుగా జీవించండి.’ అనే సందేశాన్ని సద్గురువు ఇస్తున్నారు. ప్రపంచ మానవులంతా కలిసి మెలిసి సామరస్యంతో జీవిస్తూ జీవిత లక్ష్యం వైపు స్థిరమైన అడుగులు వేయాలని సద్గురువు ఆభిలషిస్తున్నారు.ఇది సాకారమైతే నిశ్చయంగా ఈ భూమిపై స్వర్గం స్థాపించబడుతుంది. ‘అడ్డుగోడలు లేని విశ్వ స్థాపన’ అనే స్వప్నం సాకారమౌతుంది.

                                           సేవ- స్మరణ-సత్సంగo
సేవ కర్మయోగము, స్మరణ జ్ఞానయోగము మరియు సత్సంగము భక్తియోగము. సాధకునికి ఈ మూడు ఆవశ్యకమైనవి.ఈ మూడూ ముక్కాలి పీట యొక్క మూడు కాళ్ళ వంటివి. ఒకటి విరిగితే మిగతా రెండూ నిలబడవు మరియు పీట పడిపోతుంది.ఇదే విధంగా భక్తి అనే పీట కూడా ఇవి లోపిస్తే వృద్ధి చెందవు.
సేవ
తనువు, మనసు, ధనము ద్వారా ఇతరులను బ్రహ్మ భావముతో సేవ చేయటమే సేవ. సంత్ మహాత్ముల సేవయే ఉత్తమ సేవ. ఎందుకనగా సంత్ మహాత్ములు  బ్రహ్మ యొక్క ప్రతిరూపాలు. వారి సేవ(కర్మలు) ప్రపంచానికి కళ్యాణదాయకం. ఈ విషయాన్నిఅన్నిమత గ్రంధాలు తెలుపుతున్నాయి.
సేవ నుoడి లబ్ది పొందాలనే ఆకాంక్ష మన ఆధ్యాత్మిక ప్రగతిలో గొప్ప ఆటంకంగా మారుతుంది. ఫలాపేక్షతో చేసే సేవ భక్తి కాదు. కబీర్ దాస్ చెప్పినట్లుగా నిష్కామ కర్మలతో మాత్రమే నిజదేవుణ్ణి పొందగలము. ఫలాపేక్ష భావం గల సాధకుడు ప్రపంచంలోనే అనగా తనువు, మనస్సు, ధనంతో మమేకమౌతాడు. నిష్కామంగా సేవ చేసే సాధకునికి బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. సద్గురు సేవ చేయటానికి సద్గురువుకు సమీపంగా ఉండనవసరంలేదు. అందరినీ పరమాత్మ స్వరూపులుగా తలచి వారిని సేవిoచటమే అత్యుత్తమమైన భక్తి. సద్గురు ఆదేశాలకు శిరసావహించటమే సద్గురువుకు దగ్గరగా ఉoచుతుంది. సద్గురువు ఆదేశాలను దిక్కరిoచటం సద్గురువుకు దూరంచేస్తుంది.
తనువు,మనస్సు, ధనములపై ఉన్నమోహాన్ని త్యజించి చేసే సేవయే శ్రేష్టమైన సేవ.
తనువు మనసు, ధన సేవ కన్నా, నిష్కామ సేవయే బహు శ్రేష్టం
ఉత్తమమైన ఇట్టి సేవయే శ్రీ గురునకు ఇది బహు ఇష్టం
                                                -అవతారవాణి 226
సంసారంపై ఆశక్తిని కలిగి ఉండి చేసే సేవ ముక్తిని ప్రసాదిoచదు. అది బంధానికి కారణమౌతుంది. సంసారంపై ఆశక్తిని త్యజించి చేసే సేవయే సేవగా పరిగణించాలి. అందుకే సంత్ మహాత్ములకు చేసే సేవలీ సేవలగా మారతాయి. గురుశిష్యులు పంచప్రమాణాలు  పాటించటం అవసరం.
అవతారవాణి చివరి శ్లోకం376 లోచెప్పబడినట్లుగా
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, పాటించును పంచ ప్రతిజ్ఞలు
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, కలిగుoడును నమ్రత దీక్షను
సద్గురు యొక్క ప్రియసేవకుడు, చేయును భక్తుల సత్కారం
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, కలిగుoడును సత్సంగ మమకారం
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, సుజనులను ప్రశంసించేను
అవతారుని మాటిది గుర్వంతర్యామి, చూసి తనను హర్షించేను
                                                                -అవతారవాణి శ్లోకం 376

స్మరణ
స్మరణ అనగా గుర్తు తెచ్చుకోవటం. ఒక వస్తువు మనకు తెలియనప్పుడు దానిని మనం ధ్యానించలేము. జ్ఞానము పొందిన తరువాతే స్మరణ చేయగలం. ఏదో ఒక భగవంతుని నామాన్ని నిరంతరం స్మరిస్తే పరమాత్మ ప్రసన్నుడౌతాడని కొందరు చెపుతారు. ఇది అసత్యం. అస్వస్థకు గురైనప్పుడు మనకు తోచిన మందును స్వీకరిస్తే స్వస్థత చేకూరదు. అదే రీతిగా పరమాత్మను దర్శించి చేసిన స్మరణే ఆచరణ యోగ్యమైనది. సమయపు సద్గురు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన పిదప మూల బాషలో నే ఉచ్చరించాలి. ఇతర బాషలలోకి అనువదిoచి స్మరిస్తే సత్ఫలితాన్ని ఐవ్వదు. కళ్ళు తెరచి చేసిన స్మరణే మనకు సహజావస్తను కలిగిస్తుంది.
ప్రార్ధన
ప్రార్ధన అనగా సద్గురువు/ నిరంకారున్ని ఆర్ధించటం. గురుమార్గంలో నడిచే వారిలో మనం సద్గురువుని ప్రార్దిoచాలా లేదా అనే సందేహం కలుగుతుంది. మహాత్ములు ప్రార్దిoచమనే చెపుతారు. మనం సద్గురువుని/నిరాకారున్నే ప్రార్ధించాలి. ప్రార్ధించటంతో పాటు యధాశక్తి కర్మలను ఆచరిoచాలి. కర్మఫలాన్ని సద్గురువుకే వదిలివేయాలి. కర్మలు సత్ఫలితాన్ని ఇచ్చినప్పుడు భగవంతునికి కృతజ్ఞత తెలపాలి. ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు అది సద్గురుని ఇచ్చగా తలవాలి.
తనువు, మనస్సు, ధనము సద్గురువుకు అర్పిoచినప్పుడు గురుశిష్యునకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, కోరికలు ఉండవు. ఒక గురుశిష్యుడు బాబాజీతో ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని దేని కొరకు ప్రార్ధించను? నాకు ఏది మంచో ఏది చెడో నీకే తెలుసు. ఒక గురుశిష్యునికి ఏది అవసరమో దానిని నీవే ప్రసాదిoచు. ప్రతి గురుశిష్యుని ప్రార్ధన ఈ విధంగానే ఉండాలని బాబాజీ తెలిపారు.
                చరణామృతం
చరణామృతం యొక్క గొప్పతనం భావనలో ఉంది. చరణామృతం తీసుకునే సమయంలో విశ్వాసం మరియు శ్రద్ధ పరిపూర్ణంగా ఉoడాలి
చరణామృతం అహంకారాన్ని తొలగించి మనస్సును నిర్మలపరుస్తుoది. శ్రద్ధ మరియు గురు ఆశీర్వాదం యొక్క కలయికయే చరణామృతం కాని దీనిని కేవలం నీరుగా భావించకూడదు. చరణామృతమును ఏకాంత ప్రదేశంలో తీసుకోవాలి మరియు అడగకుండా ఎవరికీ ఇవ్వకూడదు.
                        మోక్షం
జనన మరణ చక్రముల నుండి బయటపడటమే ముక్తి. కర్మలను పూర్తి చేయటమే మోక్షం అని బాబా అవతా ర్ సింగ్  జీ నిర్వచించారు. దీని భావము ఏ కర్మలు చేయటానికి ఈ జన్మకు వచ్చామో ఆ కర్మలు పూర్తి చేయటమే ముక్తి. బ్రహ్మజ్ఞానం పొందిన పిదప నిరంకారున్ని విశ్వచించి , వర్తమాన సద్గురువు యొక్క ఆదేశాలను అనుసరించిన జీవుడు పొందేదే నిజమైన ముక్తి.
                    జీవన్ముక్తులు
ఏ గురుశిష్యుడైతే నిరంకారున్ని తెలుసుకొని సమయపు సద్గురు యందు అత్యంత శ్రద్ధా-విశ్వాసాలు కలిగిఉండి, సేవ, స్మరణ, సాంగత్యాలు చేస్తూ బంధముక్తుడై, అభిమానం, అహంకారం, ద్వేషాలను అధిగమిస్తాడో అట్టి గురుశిష్యుడే జీవన్ముక్తుడు అనబడతాడు.
                అంత్యకాలం
అంత్యకాలము అనేది మృత్యువుకు సంబందించినది కాదు. అంత్య కాలం జీవితానికి సంబందించినది. జీవుడు 84 లక్షల జన్మలనంతరం మానవ జన్మను పొందటాన్నేఅంత్యకాలం అంటారు. జీవుడు తన జీవిత కాలంలో సంపాదించినదే మరణ సమయంలో పొందుతాడు.  
                జీవుడు
జీవుడిలో ఉన్న చైతన్యం వలననే మనం జీవించి ఉన్నాం. జీవుడు ఎప్పుడైతే మానవ శరీరాన్ని దాల్చి, సద్గురు కృపతో పరమాత్మ మరియు ప్రకృతి మధ్య బేధాన్ని అవగాహన చేసుకుంటాడో, శరీరమును విడిచే సమయంలో ప్రకృతికి సంబందించినవి ప్రకృతిలో వదిలేసి, పరమాత్మ యొక్క అంశైన ఆత్మ పరమాత్మలో లీనమై స్థిరపడుతుంది.
మనస్సు
మన ఆలోచనలే మనస్సు. జీవుడు జన్మకు వచ్చిన తరువాత తన పరిసరాలకు స్పందిస్తూ ప్రేరణ పొంది తదానుకూలంగా ఆలోచనలను చేస్తాడు. జీవుడు ఈ భూమి మీద ఎదిగేటప్పుడు పరిసరాలకు ప్రభావితుడై ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచనలే సంస్కారాలుగా మారతాయి. ఆ సంస్కారాలను అనుసరించి కర్మలను చేస్తాడు. జీవునిలో ఉన్న ఆత్మ ఎటువంటి పరివర్తన చెందదు. దీనికి భిన్నంగా మనస్సు చంచలత్వాన్నికలిగి ఉంటుంది. మార్పు చెందుతుంది.
భక్తి
పరమాత్ముని తెలుసుకొని సమయపు సద్గురువును అనుసరించి కర్మలను ఆచరిoచటమే భక్తి. భక్తి పూర్ణ సద్గురువుపై ఉండాలి. ఈ భక్తి సద్గురు కృపతో ప్రాప్తిస్తుంది.
నామము
నామము అనగా పరమాత్మకు సంకేతంగా వాడే పదం కాదు. పరమాత్మే నామము. ఎప్పుడైతే సద్గురువు మనకు పరమాత్మను ప్రకటింప చేస్తారో ఆ దర్శిoచినదాన్నే నామము అంటారు. పరమాత్మను ప్రకటించటం, పరమాత్మను దర్శిoప చేయటమే నామము. సద్గురు ద్వారా నామాన్ని పొందుతాము కనుక నామము, సద్గురువు మరియు నిరంకారుడు ఒక్కటే.
నిజగృహం
నిరంకార ప్రభు పరమాత్మ జీవాత్మ యొక్క వాస్తవమైన గృహము. శరీరాన్నివీడిన తరువాత ఆత్మ తన వాస్తవ గృహమైన పరమాత్మలో స్థిరపడాలి.
సహజావస్త
సద్గురు కృపతో గురుశిష్యుడు తన సహజావస్తను పొందుతాడు. సేవ, స్మరణ, సాంగత్యంతో మనస్సు నిర్మలమై జీవుడు నిరంకారిడిగా మారతాడు. దీనినే సహజావస్త అంటారు. ఇది తమో,రజో, సత్వగుణాలకు అతీతమైనది. వైరభావము, ఎక్కువ తక్కువలు లేని సహజస్థితి ఇది.
నింద  మరియు  సమాలోచన
కొందరు గురుశిష్యులు ఇతరుల అవగుణాలను ఎత్తి చూపుతూ విమర్శిస్తారు. ఇలా ఆనందాన్నిపొందాలనిఅనుకుంటారే కాని వారిలోని అవగుణాలను దూరం చేసే ఉద్దేశం వారికి ఉండదు. ఇట్టి కర్మలనే నింద అంటారు. ఈ పద్దతిని అనుసరించే వారు గురుమార్గానికి దూరమౌతారు. లోపాలను సరిదిద్దగలిగే మహాపురుషులు ఉన్నట్లయితే వారితో సమాలోచన చేయాలి. ఇతరులతో చర్చిoచరాదు.
               
 ప్రతి క్షణం చేయాలి సద్గురుని పూజ
ఆత్మజ్ఞానం ప్రసాదించిన సద్గురుని స్థానం సంసారంలో అత్యుత్తమమైనది. సద్గురు జ్ఞానం పొందిన జీవితం సఫలమౌతుంది. అందుకే గురువు ప్రతి క్షణం స్మరణీయుడు మరియు వందనీయుడు. సంత్ కబీర్ జీ తన కవితలో ఇలా స్పష్టం చేసారు, ‘గురువు కేవలం గురువు. గురువును ఎవరితోనూ పోల్చలేము. గురువు జ్ఞాన స్వరూపుడు. గురువు నుండి జ్ఞానం పొందిన మానవుడు తనకే కాక ఇతరులకు కూడా కళ్యాణకారి అవుతాడు.’
సంత్ కబీర్ దాస్ సద్గురుకి సమర్పితమయ్యే జిజ్ఞాసులకు తెలిపెదేమనగా సాధారణ-అసాధారణ, దేవీ-దేవతలు మరియు బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులైనను సద్గురువు లేక ఎవరి జీవితమూ కళ్యాణకారి అవదు.
సద్గురు సమ కోయీ నహీ, సాత్ దీప్ నౌ ఖండ్ I
టీన్ లోక్ న పాయియే, ఆరూ ఇక్-ఇస్ బ్రహ్మాండ్ II
దీని భావము ఈ సంసారంలో సద్గురుకి సమానమైన వారు లేరు. సప్త ద్వీపాలు, నవ ఖండాలు, మూడు లోకాలలో మరియు బ్రహ్మాండంలో సద్గురువుకి సమానమైన వారు లేనే లేరు. సద్గురు గుణాల మహిమ అపారం. అందుకే చెప్పబడింది.
ధ్యాన మూలం గురోర్ రూపం, పూజా మూలం గురోర్ పాదం I
మంత్రం మూలం గురోర్ వాక్కు, మోక్షా మూలం గురోర్ కృప II
స్మరించటానికి, ధ్యానించటానికి గురువు యొక్క రూపం శ్రేష్ఠమైనది. పూజకు గురు పాదాలు శ్రేష్టం. గురు వచనాలే మూల మంత్రం మరియు సత్య భావమే మూలసత్యం. అచలుడు, అవినాశి, అలౌకికుడైన ఈ  నిరాకార ప్రభు పరమాత్ముడే సత్యం.
సంసారంలో సద్గురువుకు సమానమైన వారు ఎవరూ లేరు. మరియు శిష్యునికి సమమైన యాచకుడు లేదు. మూడు లోకాల జ్ఞానరూప అపురూప సంపదకు సమమైనది ఏదియూ లేదు. ముముక్ష శిష్యుడు యాచించినప్పుడు గురు దయ తలచి అతనికి జ్ఞానం ప్రసాదిస్తారు. అందుచేతనే భక్త కబీరు దాస్ ఇలా పలుకుతునారు :
గురు సామాన్ దాతా నహీ, యాక్ హక్ సీస్ సామాన్ I
టీన్ లోక్ కీ సంపదా, సో గురు దీన్హీ దాన్ II
ఏ విధంగానైతే ఆకలి-దాహంతో ఉన్న వాడు భోజనం మరియు నీరు కోసం వెతుకుతాడో, అదే విధంగా నిజమైన ముముక్షువు సంసారిక క్లేశాలు, దు:ఖాల నుండి ముక్తుడవటానికి సన్మార్గాన్ని వెతుకుతాడు. అతనిలోని ఈ శ్రద్ధా భక్తులే వాడిని సద్గురు శరణుకు తీసుకు వస్తుంది. సద్గురుని శరణు కోరిన భక్తుని సమస్త కఠినాతి కఠిన పరిస్థితులు కూడా సులభతరం అవుతాయి. సద్గురు భక్తీ మరియు సాంగత్యం వలన భక్తుని జీవితంలో పరమసుఖము, సహజ శాంతి మరియు అలౌకిక ఆనందాన్ని పొందుతాడు. అతనికి అన్ని బంధాల నుండి విముక్తి కలుగుతుంది. అందుకే ఇలా చెప్పబడింది
గురు కో సర్ పర్ రఖియే, చలియే ఆజ్ఞా మాహీ I
కహ్ కబీర్ తా దాస్ కో, టీన్ లోక్ భయ నాహీ II
గురువును తన శిరస్సు యొక్క కిరీటంగా తలచి సదా ఆయన ఆజ్ఞలను పాటించాలి. గురువు పట్ల ఎవరికైతే ఇట్టి  శ్రద్ధా-భక్తులు, దృఢ విశ్వాసం ఉంటాయో, వాడు తన  శిరస్సును  గురువు ముందు సవినయంగా వంచుతాడు. అటువంటి సేవకునికి మూడు లోకాలలో ఏ భయమూ ఉండదు. సమర్ధ సద్గురు యొక్క జ్ఞానం యొక్క బలంతో వాడు ఎల్లవేళలా నిర్భయంగా ఉంటాడు. మనం ఈ విషయం కూడా చదువుతాం
హే సమారధ్ పరమాత్మా, హే నిర్గుణ నిరంకార్ I
తూ కర్తా హై జగత్ కా తూ సబ్కా ఆధార II
(హే సమర్థ పరమాత్మా, హి నిర్గుణ నిరంకారా ! ఈ సమస్త సృష్టికీ ఆధారం మరియు కర్తవు నీవే.)
ఎప్పుడైతే ఇటువంటి సందర్భం లేదా రోజు వస్తుందో, ఎవరికైతే   గురుపూజ వైపు ప్రేరణ కలిగిస్తారో, వారి గురించి ఇలా చెప్పటం జరిగింది
గురు మూర్తి ఆగే ఖడీ, దుతియా భేద్ కచు నాహి I
ఉన్హీ కూ పరిణాం కరి, సకల తిమిర్ మిటి జాహి II
భక్త కబీర్ దాస్ తెలిపేది ఏమనగా సాకార రూపంలో సద్గురువు స్వరూపం మన ముందు ఉంది. దీనిలో ద్వైత భావనకు స్థానమే లేదు. మరియు మన మనస్సులలో ఎటువంటి సందేహమూ ఉండకూడదు. గురు సేవ-పూజను చేయాలి. ప్రణామం చేయాలి. ఇలా చేసినట్లయితే సమస్త అజ్ఞాన రూప అంధకారం  మటుమాయమవుతుంది.
గురు పూజకు ఏ ప్రత్యేక రోజు, సమయం మరియు స్థానం అవసరం లేదు. గురు పూజ చేయటం మన కర్తవ్యము. ఇలా ఇహలోకం సుఖంగా మరియు పరలోకం సంతోషంగా ఉంటుంది.


మమతామయి నిరంకారీ రాజమాతా కుల్వంత్ కౌర్  జీ బ్రహ్మలీనం
దయా సమర్పణల మూర్తీబవిoచిన రూపం, త్యాగమయ ఉపకారీ,
నిరాకారునిలో లీనమయిన రాజమాతా నిరంకారీ !

नाचांगी ते गावांगी मै तेरे दर के सामने,
खुशियां मनावांगी मै तेरे दर के सामने,
సద్గురువు సాధుమహాత్ముల ఎదుట సంపూర్ణ భావంతో స్వరచిత  గీతాన్నిఆలపిo చే మమతామాయి నిరంకారి రాజమాత వారి శ్రీ ముఖంo నుండి ఈ గీతాన్ని ఇక వినే అవకాశం లేదు.
మమతామాయి నిరంకారి రాజమాతాజీ 29ఆగస్ట్ 2014 రాత్రి 8:35గoII తమ నశ్వర శరీరాన్ని త్యజించి నిరంకారునిలో లీనమయ్యారు. ఆగస్ట్ 29వ ఉదయం అన్ని రోజుల వలె తెల్లవారింది. కాని ఈ శుక్రవారరం సాధారణమైనది కాదు. మమతామయి రాజ మాతాజీ నిరంకారునిలో లీనమయ్యే రాత్రి ఇది. 84 సంవత్సరాల వివిధ అనుభవాలతో నిండిన జీవితం యొక్క చివరి రాత్రి అది. సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ మరియు వరదామయి పూజ్య మాతాజీ ఆ సమయంలో వారి చెంoతనే ఉన్నారు. గురు పరివార సభ్యులు మరియు రాత్రనక పగలనక వారికి సేవ చేసిన వారు, సేవా దళ్ సభ్యులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
84సంవత్సరాల ప్రయాణం యొక్క చివరి రాత్రి అందరి కళ్లు చెమర్చే రాత్రిగా మిగిలింది.  ప్రతి హృదయాన్ని భావోద్వేగంతో నిoపిని రాత్రి అది. రాజమాతాజీ యొక్క ఉత్తమ శిక్షణ మరియు జీవన మృత్యువు యొక్క మర్మాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న మహాపురుషులు సహజత్వంతో నిరాకారుని లీలను ఒప్పుకుంటూ రాజమాతాజీకి అంతిమ వీడ్కోలు పలికారు.
రాజమాతాజీ తమ నశ్వర శరీరాన్ని విడచిన సమాచారం సద్గురువు నివసించే నిరంకారి కాలని నుండి  కొద్ది క్షణాల్లోనే ప్రపంచానికి తెలియవచ్చింది. Whats  Appమరియు Facebook వంటి సోషల్ మీడియా ద్వారా దాలావాహంవలె ఈ సమాచారం ప్రపంచం నలుమూలలకు చేరింది. అందరూ వాత్సల్యమయి, మమతకు నెలవైన రాజమాతాజీ వియోగంతో స్తబ్ధతకు లోనయ్యారు.
ఢిల్లీ నగరంలో కొన్ని రోజులుగా ఎండ తీవ్రత గనరిష్ట స్థాయిలో ఉంది. ప్రకృతి తల్లి వియోగానికి తన నివాళిని వర్షం రూపంలో తెలిపింది. సద్గురు బాబా నివాసం వెలుపలి వీధులలో మరియు అవతార్ పార్క్ వద్ద భక్తులు నెమ్మదిగా, శాంతంగా గంభీర వదనాలతో గుమిగూడారు.
అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా మరియు యూరోప్ నుండి భక్తులు ఈ సమాచారం అందిన వెంటనే మొదటి విమానంలో ఢిల్లీకి  బయలుదేరారు. దేశ నలుమూలలనుండి భక్తులు ఒక ప్రవాహంలా అక్కడకు చేరారు. ఈ సమాచారాన్ని సంత్ నిరంకారి వెబ్ సైట్ లో పెట్టారు. రాజమాతాజీ వారి పార్ధివ శరీరం యొక్క అంతిమ యాత్ర 31-o8-2014న ఉదయం 11 గoటలకు నిరంకారి కాలనీ నుండి మొదలయి, రేడియో కాలనీ, కింగ్స్ వే క్యాంపు ద్వారా మాల్ రోడ్ నుండి యమునాతీరంలో ఉన్న నిగంబోద్ ఘాట్ చేరి అక్కడ ఉన్న C.N.G. స్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతాయని తెలుపబడింది. అలాగే 01-09-2014 (సోమవారం) నిరంకారి చౌక్ గ్రౌండ్ నంo: 8 లో రాజమాతాజీకి శ్రద్ధాంజలి ఘటించుటకు ’ప్రేరణ దివస్’ సమాగం ఏర్పాటు చేయబడుతుంది. సద్గురు బాబాజీ మరియు పూజ్య మాతాజీ వారి పావన సన్నిధిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నభక్తులు ఢిల్లీ చేరి శ్రద్దాంజలి ప్రకటిస్తారు. ఇతర ప్రముఖులు తమ భావాలను ప్రకటిస్తూ శ్రద్ధాంజలి తెలుపుతారు అనే  సమాచారం నిరంకారీ జగత్తుకు అందింది
ఈ సందర్భంగా, రాజమాతాజీ  పార్దివ శరీరాన్ని శ్రద్ధాంజలి ఘటించుటకు వచ్చిన భక్తుల దర్శనార్ధం నిరంకారీ కాలనీ లోని వారి నివాసంలో గల వారి గది బయట వరండాలో అద్దాల AC శవ పేటికలో ఉంచారు. శ్వేత వస్త్రాలు ధరించి ఉన్న వారు ప్రశాంతంగా,సౌమ్యంగా నిద్రిస్తున్నట్లు కనిపించారు. చూసే  వారికి  వారు విశ్రాంతి తీసుకుంటున్నట్లు, మరికొద్ది సమయంలో మేల్కొని భక్తులను ఆశీర్వదిస్తారనే భావనను కలుగ చేసింది.
సేవాదళ్ సభ్యులు అంతిమ దర్శనార్ధం వచ్చిన భక్తులను సహనంతో, క్రమశిక్షణతో లైన్లలోముందుకు నడిపించారు. ఈ విధంగా ఎంతో శ్రద్ధా భక్తులతో భక్తులు రాజమాతాజీ వారి అంతిమ దర్శనం చేసుకున్నారు. వేదన మరియు గౌరవంతో నిండిన హృదయాలతో అందరూ కొద్ది దూరం నుండే వారిని దర్శించుకొని, వారి చరణాలకు అర్పితమై ముందుకు సాగారు. భక్తుల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ అంతిమ దర్శనం 31-08-2014ఉదయం 10గoII వరకు కొనసాగింది. వేల సంఖ్యలో హాజరైన భక్తులు నిరంకారి కాలనీ లోని బస్టాండ్ ముందున్న క్యాంపు వైపు గల మార్గంలోని ఇరువైపులా పంక్తుల్లో నిలబడ్డారు.
ఢిల్లీ పట్టణ అధికార యంత్రాంగం ఉదయం నుండే అంతిమ యాత్ర జరిగేoదుకు వీలుగా రోడ్ ట్రాఫిక్ ను వేరే మార్గంలోకి తరలిoచారు. అడుగడుగునా సేవాదళ్ సభ్యులు, ఢిల్లీ పోలీస్ మరియు అధికార యంత్రాంగం విధులు నిర్వహించారు.
దివ్య ఆత్మలను సత్కరించేందుకు సృష్టి కర్త యొక్క సృష్టి కూడా సిద్ధపడింది. ఎన్నో నెలలుగా వర్షాభావంతో  వేడెక్కిన ఢిల్లీ నగర వాతావరణాన్ని ఇంద్ర దేవుడు వర్షంరూపంలో శాంతింప చేసాడు.అంతిమ యాత్ర ప్రారంభం మొదలుకొని చివరి వరకు వర్షపు జల్లు పడుతూనే ఉంది.  మద్యాహ్నం 12 గంటoIIలకు రాజమాతాజీ వారి పార్ధివ శరీరాన్ని తెల్లటి పూలతో అలంకరించబడిన వాహనంలోఉంచి కోఠీ నుండి బయటకు తీసుకు వచ్చారు. అక్కడి వాతావరణమంతా ‘తుహీ నిరంకార్, మై తేరీ శరణ హ, మైనూ భక్ష్ లో’అనే స్మరణతో నిండిపోయింది.  జయ ఘోష్, సేవా దళ్ బ్యాండ్ మరియు ధుని ని కూడా స్మరణ చేస్తూ ముందుకు వెళ్ళారు.
అంతిమ యాత్ర యొక్క ప్రత్యక్ష ప్రసారం మిషన్ వెబ్ సైట్లో ప్రసారం చేయబడినది. శ్రద్దాంజలి ఘటించుటకు ఢిల్లీ రాలేక పోయిన లక్షలాది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వారి ఇళ్ళల్లో, సత్సంగ్ భవనాలలోఏర్పాటు చేసిన  ల పై రాజమాతాజీ వారి అంతిమ యాత్రను వీక్షించారు.ఈ యాత్ర లోని ప్రతి ఘటనను ఫోటోగ్రాఫర్ లు మరియు వీడియో గ్రాఫర్లు తమ కెమెరాలతో చిత్రీకరించారు.
సద్గురు బాబాజీ ఈ రోజు సద్గురు రూపంలో మన ముందు ఉన్నారు. ఒక కుమారునిగా కూడా వారు తమ బాధ్యతను అత్యంత ఆదర్శంగా నిర్వర్తిస్తున్న భావన  భక్తులందరిలో కలిగింది. రాజమాతాజీ వారి పార్ధివ శరీరాన్ని ఉంచిన వాహనంలో బాబాజీ వారి చరణాల వద్ద నిలబడి ఎన్నో మైళ్ళ యాత్రను చేస్తూ భక్తుల అభివందనకు ప్రతిస్పందిస్తూ ముందుకు సాగారు.
ఈ వాహనానికి ముందుగా సేవా దళ్ వారి వాహనాలు, వారికంటే ముందుగా దేశ నలుమూల  మరియు విదేశాల నుండి వచ్చిన ప్రబంధక్ మహాపురుషులు తెల్లటి వస్త్రాలు ధరించి నెమ్మదిగా నడుస్తూ ముందుకు సాగటం కనిపించింది.
పూజ్య మాతాజీ మాతృ స్వరూపులైన అత్తగారికి నివాళులు అర్పిస్తూ స్మశాన వాటిక వైపు అడుగులు వేసారు. పెద్ద సంఖ్యలో మహిళలు పూజ్యమాతాజీని అనుసరించారు. ఆ సమయంలో కురుస్తున్నవానను భక్తులు అవరోధంగా భావించక ప్రకృతి కురిపిస్తున్న పుష్ప వర్షంగా స్వీకరిస్తూ ముందుకు కదిలారు. సాధారణంగా ఇటు వంటి సందర్భాలలో ఊరేగింపు ముందు పుష్పాలు జల్లడం ఆనవాయితి. కాని ఇక్కడ వాహనాన్ని మాత్రమే అలంకరించారు. భక్తుల శ్రద్ధ మరియు మేఘాలు కురిపించిన వర్షపు జల్లులే పూల వర్షంగా మారాయి.
వాహనం కింగ్స్ వే క్యాంపు కూడలి  సమీపించగానే భక్త సమూహం యొక్క విశాల రూపం కళ్ళెదుట నిలచింది. ఢిల్లీ లోని అతి రద్ధీ అయిన ఈ కూడలిలో  ఆ సమయం ఇతర వాహనాలేవీ కనిపించలేదు. కనిపించినంత మేరకు నలుదిక్కుల ఆ మార్గమంతా శ్రద్ధాలు భక్తులతో నిండిపోయింది.
యాత్ర ముందుకు  సాగుతూ ఉంది. చేరవలసిన గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది. మాల్ రోడ్ చేరుకోనేవరుకు పిల్లలు, వృద్ధులు, యువత ఏ మాత్రం బడలిక లేకుండా సహజ భావనతో ముందుకు సాగుతున్నారు. మాల్ రోడ్ చేరుకున్నాక ఆ ప్రక్క వీధులలో సిద్ధంగా ఉంచిన అనేక బస్సులు, జీపులు, కార్లలో కూర్చోని నిఘం బోద్ ఘాట్ వైపు  యాత్రను  కొన సాగించారు.
నిఘం బోద్ ఘాట్ యమునా నది తీరంలో ఉన్న ఢిల్లీ లోని అతిపెద్ద  స్మశాన వాటిక. ఈ నాడు ఇక్కడ ఎంత భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారంటే ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఇక్కడ రాజ్ మాతా జీ వారి పార్ధివ శరీరాన్ని CNG cremation పద్దతి ద్వారా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. షెహెన్ షా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు మరియు బాబా గురు బచన్ సింగ్ జీ మహారాజ్ నుండి మొదలుకొని ఈ నాడు మమతామాయీ రాజమాతాజీ పార్ధివ శరీరంయోక్క అంతిమ సంస్కారానికి ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు.
మహాపురుషులు మానవ కోటిని జాగృతపరచే ధ్యేయం వారి మాటల లోనే కాకుoడా  వారి కర్మల ద్వారా కూడా వ్యక్త పరచబడుతుంది. ప్రపంచంలోని అన్ని పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు  वृक्ष बचावो विश्व बचावो వృక్షాలను కాపాడండి, విశ్వాన్ని కాపాడండి అనే నినాదం చేస్తున్నాయి.  సద్గురు బాబాజీ  కూడా ‘క్లీన్ అండ్ గ్రీన్ ’ (పరిశుబ్రత మరియు వృక్ష సంరక్షణ) అనే విశ్వ వ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విధంగా రాజ మాతాజీ వారి అంతిమ సంస్కారం జరగటం విశ్వాన్ని ప్రభావితం చేసే మరియు  స్పూర్తిని ఇచ్చేమాధ్యమoగా (సంఘటనగా) చిరకాలం నిలుస్తుంది.


          నూతన సంవత్సరంలో నూతన ప్రగతిపధం  

సమయం బహుమూల్యమైనది. ఎంతగానంటే అత్యంత విలువైనవిగా భావించే వజ్రాలు, వైడూర్యాలను రాసులగా పోసినా కొన్ని క్షణాలను కూడా మనం కొనలేనంత విలువైనది. అందుచేతనే సంతులు, మహాపురుషులు, జ్ఞానవంతులు సమయానికి విలువనివ్వాలనే శిక్షణనే  ఇచ్చారు మరియు సమయాన్ని వృధా పరచవద్దని హితం పలికారు. వారు ఇంకా చెప్పేదేమనగా మంచి కర్మలను తక్షణమే చెయ్యాలి. రేపటికి వాయిదా వెయ్యకూడదు. శుభకర్మలను వెంటనే ఆచరించాలి. సంత్ కబీరు దాస్ చెప్పినట్లుగా –
“ కాల్ కారే సొ ఆజ్ కర్ ఆజ్ కారే సొ అబ్  I
పల్ మై పరలై  హోయేగీ బహురి కరోగీ కబ్ I ”
పనిని రేపటికి వాయిదా వేయటం మానవ ప్రవృతి. కావున, మంచి కర్మలను నేడు చేయాలి మరియు తక్షనమే చేయాలని చెపుతున్నారు. వారు ఇంకా ఇలా చెపుతున్నారు. ప్రళయం ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు. రేపటికి వాయిదా వేసిన పనిని ఎలా చేయగలవు? క్షణంలో ప్రళయం అనగా ‘మృత్యువు నిన్ను ఏ క్షణంలోనైనా కబలించవచ్చు. ప్రతి వ్యక్తికి తన మృత్యువు క్షణంలో వచ్చే ప్రలయంతో సమానం.’
క్షణాలు కలిస్తే నిముషం అవుతుంది. కొన్ని నిమషాలు కలిస్తే ఒక గంట. కొన్నిగంటలు కలిస్తే ఒక రోజు. ఇలా ఒక వారం, నెల, సంవత్సరం మరియు శతాబ్దంగా మారతాయి. సమయం అనేది వయస్సును లెక్కించటానికి ఒక కొలమానం మాత్రమే. జననం నుండి మృత్యువు వరకు జరిగే జీవన యాత్రను ఈ క్షణాలనే రధం పై స్వారీ చేస్తూ మానవుడు పూర్తి  చేస్తాడు. ఈ క్షణాలే జీవితాన్ని మెరుగు పరచేవి లేదా నాశనం చేసేవి.
నిద్ర, భోజనం, భోగం, భయం విషయాలలో మనిషికీ ఇతర పశు పక్షాదులు, కీటకాలకు ఏ బేధమూ లేదు. మనిషిలో అంతర్లీనంగా ఉన్న బుద్ధి-వివేకమే మనిషికి గల ప్రత్యేకత. ఎవరి వివేక-బుద్ధులు నిద్రావస్తలో, దారి-తప్పి మరియు వికృతంగా ఉన్నాయో అటువంటి వారిని ఉద్దేశించే ‘కర్మలలో మానవజాతి కంటే పశువులే మేలు’ అని చెప్పటం జరిగింది. బుద్ది-వివేకమనే స్వర్ణ మఖుటాన్ని పరమాత్మ మానవుని శిరస్సుపై ఉంచాడు. మానవుణ్ణి సర్వశ్రేష్టునిగా సృష్టించాడు. ప్రతి క్షణాన్ని మానవుడు అత్యుత్తమంగా జీవించాలని తలచాడు. మనిషి తను జీవిస్తున్న ప్రతి రోజు, నెల, సంవత్సరం జాగురూకతను కలిగి ఉంటూ దయ మరియు సుందర మానవీయ గుణాలను కలిగి ఉండి పరోపకారంలో జీవించాలి.
భక్తుడు ఎల్లవేళలా చేతనావస్తలో వుంటూ నింద-విమర్శ చేయక కేవలం ప్రేమ-సత్కారాలను ప్రదర్శిస్తాడు. బియ్యంలో ఉన్న రాళ్ళను ఏరివేయాలి బియ్యాన్ని కాదని తెలుసుకోవాలి. బియ్యాన్ని కనుక పారవేసి పళ్ళెంలో మిగిని ఉన్న రాళ్ళు, బెడ్లతో వంట చేస్తే ఆకలి తీరుతుందా? జీవితంలో నింద, ద్వేషం, నమ్మక ద్రోహం ఇవన్నీ రాళ్ళతో సమానం. వాటిని ప్రోగు చేయటం అజ్ఞానపు  చేష్ట. నింద అనేది జీవితమనే కలపలో చెద పురుగు వంటిది. చెద పట్టిన కలప ఎప్పుడు నాశనం అవుతుందో తెలియదు. నింద, విమర్శ ఎవరికీ ఎన్నడూ హితం చేకూర్చదు. మనకు లభించిన సమయాన్ని, ఆయుషును దయ, కరుణ, పరోపకారం మరియు విశాలత్వ గుణాలను పెంపొందిoచుకొనుటకు ఉపయోగించుకుంటే శుభం కలుగుతుంది.
మనం ఎంతకాలం జీవించామన్నది కాదు ఎలా జీవించామన్నదే కీలకమైన విషయం. సీతాకోక చిలుక ఆయుషు తక్కువే కాని అది జీవించినంత కాలం ఎంతో సంతోషంతో జీవిస్తుంది మరియు పువ్వు  పువ్వుకు పుప్పొడిని  పంచటమే తన నిత్య కర్మగా చేసుకొని జీవిస్తుంది. కాని రాబందు మరియు తాబేలు ఎన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ అవి ప్రపంచానికి ఏ లాభాన్ని చేకూర్చవు. తిమింగలం యొక్క వేల సంవతసరాల జీవితం కూడా నిద్ర, భోజనాలతోనే గడిచిపోతుంది. ఏ అయుషునైతే దాతారుడు మనకు ప్రసాదించారో, దానిని సార్ధకంగా జీవించటమే జీవిత పరమార్ధం. స్వామి వివేకానంద సంత్ జ్ఞానేశ్వర్ మరియు ఆది శంకరాచార్య వంటి మహనీయులు తమ స్వల్ప ఆయుషులోనే చేసిన సత్కర్మల వలన ప్రపంచం ఈ నాటికీ ప్రతి క్షణం వారిని స్మరిస్తుంది.
రోజు, నెల, సంవత్సరం, దశాబ్ధం ఇవన్నీ నిత్యం మార్పు చెందేవే. ఇటీవల 2015వ సంవత్సరం ఎంతో  ఉల్లాస-ఉత్సాహాలతో ప్రవేశించింది. అది ఇప్పుడు ఒక వృద్ధుని వలె  తన జీవితకాలమైన 365 రోజులు జీవించి నిష్క్రమించింది. అది నిష్క్రమిస్తూ చేసిన అడుగుల సవ్వడిని ఆధారం చేసుకునే నూతన సంవత్సరం 2016 ఒక కోమల శిశువు వలె  ప్రవేశించింది. దాని జీవిత కాలం కూడా 365 రోజులు, 12 నెలలే. ఈ వ్యవధిలోనే ఎన్నో ఋతువులు, సుఖ-దుఃఖాలు, తీపి గుర్తులు- చేదు అనుభవాలు, ప్రశంసా- నిందలు ఇమడి ఉంటాయి.

2014వ సంవత్సరం ఎలా ఉన్ననూ అది వెళ్ళిపోయింది. దానిలో పరివర్తన తీసుకు రావటం ఇప్పుడు సాధ్య పడదు. ఇప్పుడు నూతన సంవత్సరం మన ముందు ఉంది. క్రొత్త సంవత్సరం యొక్క ప్రతి క్షణాన్ని మనం మానవీయ గుణాలను అలంకరించుకొని జీవిద్దాం. ధర్తిని స్వర్గంగా మార్చుతూ జీవిద్దాం, ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం, దాహార్తితో ఉన్నవారికి నీరు, వ్యాధి గ్రస్తులకు ఔషుధం ఇస్తూ , క్రింద పడిన వారికి చేయూతనిచ్చి పైకి లేపుతూ జీవిద్దాం.  అందరూ తమ హృదయాలలో ఈ భావననే కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో ఆత్మచింతన చేస్తూ నూతన ఉత్సాహంతో ముందడుగు వేద్దాం. ఇదే నూతన ప్రగతి పధం యొక్క మార్గాన్ని సుగమనం చేస్తుంది. మనం దీనిని ఈ రూపంలోనే స్వాగతం పలకాలి. మీ  అందరికీ 2016 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
                                                                                                            షరతులు లేని ప్రేమ
నేడు ప్రపంచంలో 'ప్రేమ' అనే పదం కేవలం యవ్వనం లోని స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని సూచించేదిగా భావింపబడుతుంది. అయితే ప్రేమ అనేది ఎంతో విశాలమైనది.  తల్లి- బిడ్డల మధ్య, అన్నా-చెల్లుల్ల మధ్య , స్నేహితుల మధ్య ప్రేమ, గురువు-శిష్యుల మధ్య గల ఆత్మీయత అనురాగం కూడా ప్రేమయే. గురువు-శిష్యుల మధ్య గల ప్రేమ బంధం  అలౌకికమైనది మరియు సర్వశ్రేష్టమైంది. సద్గురు చరణాలను చేరిన శిష్యులు ప్రేమే భక్తి అని తెలుసుకుంటారు. నారద భక్తి సూత్రాలలో తెలిపినట్లుగా ''భగవంతున్ని అమితంగా ప్రేమించటమే భక్తి'. ప్రేమ షరతులు లేనిదై, విశాలమైనదిగా  ఉండాలి.  ఎదుటివారు ఎటువంటివారైనను అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. ఇలా మన ప్రేమ పరిపూర్ణ మైనదిగా ఉండాలి. ఒకరి పట్ల ప్రేమ మమకారాలు మరొకరి పట్ల ద్వేషం, చీత్కారం, శత్రుత్వం కలిగి ఉండటం మన అపరిపక్వతను సూచిస్తుంది. బాబాజీ, 'ప్రేమించటానికి ఒక జీవిత కాలం సరిపోనప్పుడు మానవుడికి ద్వేషించటానికి సమయం ఎక్కడిది?' అని ప్రశ్నిస్తున్నారు. మన జీవితాలలో ప్రేమ కరువై అంతరించిపోతుంది. సాధు మహాపురుషులు పరిపూర్ణమైన ప్రేమకు  ప్రతి రూపాలుగా ఉంటారు. ప్రేమ భక్తిలో రమించేవారే మానవులుగా పరిగణింపబడతారనేది బాబాజీ అభిప్రాయం.
అందరినీ ప్రేమించటం, భగవత్  ప్రేమను అనుభూతి చెందటం, అందరిలో ఆయన్ని దర్శించటం - ఇదే మనం జీవించవలసిన విధానం. మన శాస్త్ర గ్రంధాలలో కూడా ప్రేమ గురించి విశిష్టంగా పేర్కొనటం జరిగింది. "భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఎవరైతే ప్రేమిస్తారో వారు భగవంతునిలో జీవిస్తారు. వారిలో భగవంతుడు వ్యక్తమౌతాడు." అని బైబిల్ లో తెలపబడింది. అవతార పురుషులు ప్రేమ స్వరూపులు. అన్ని యుగాలలో గురువులు పీరు పైగంబరులు ప్రేమతో జీవించాలనే సందేశాన్నే ఇస్తున్నారు. బాబా గురు బచన్ సింగ్ జీ అందరి పట్ల సహజమైన ప్రేమ భావాన్ని ప్రదర్శించేవారు. నేడు నిరంకారీ బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ విశ్వ వ్యాప్తంగా కళ్యాణ యాత్రలు చేస్తూ సత్య సందేశాన్ని,  ప్రేమ సందేశాన్ని ఇస్తూ విశ్వ సౌభ్రాతృత్వాన్ని స్థాపించటానికి ఎనలేని కృషి చేస్తున్నారు.
ప్రేమ లేని జీవితం అర్ధరహితమైనది. ద్వైత భావన కలిగి ఉండటమే ప్రేమ రాహిత్యానికి మూల కారణం. సత్యం తెలిసే వరకు మనం అజ్ఞానజనిత  ద్వైత భావనలోనే  ఉండిపోతాం. 
"ద్వైతము నందు చిక్కిన నరుడు, ప్రభువుతో వేరై తానుండు
ద్వైతము నందు చిక్కిన నరుడు, ఉత్తమ శక్తిని మరిచాడు"
                                                                     - అవతార వాణి- 356
సద్గురు ప్రసాదించిన భగవత్ సాక్షాత్కారం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది విశ్వ ప్రేమకు నాంది పలుకుతుంది. మహాత్మా గాంధి తెలిపినట్లుగా "ఎప్పుడైతే ప్రేమకు గల శక్తి ద్వేషాన్ని అధిగమిస్తుందో అప్పుడే విశ్వశాంతి స్థాపింపబడుతుంది."
బేధ భావం లేని ప్రేమను కలిగి ఉండటం సాధ్యమేనా అనే సందేహం సగటు మానవునికి కలుగుతుంది. మనం అవతార పురుషుల జీవితాలను పరిశీలించినట్లయితే ఇది సాధ్యమే అని బోధపడుతుంది.
శ్రీ రామ చంద్ర మూర్తి జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మానసిక సంఘర్షణలను లోనైనా అందరితో ప్రేమతోనే వ్యవహరించాడు. ఏసు క్రీస్తును విరోధులు ఎంతగా బాధించినావారిపై ప్రేమనే కురిపించారు. వారి మదిలో ద్వేష భావన ఇసుమంతైనా లేదు. తనను హింసించేవారి హితం కోరుతూ భగవంతుణ్ణి, 'తెలియక తప్పులు చేస్తున్న వీరిని రక్షించు' అని కోరిన కరుణామయుడు ఆయన. భాయి కనయ్య శత్రుసైన్యం వారికి సైతం నీరు అందించి తన విశాల ప్రేమను చాటాడు. 1980 వ సంII లో బాబా గురుబచన్ సింగ్ జీ ముష్కరుల దాడిలో బలిదానం గావించినప్పుడు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి పట్ల ద్వేషాన్ని ప్రదర్శించక నిరంకారీ జగత్తుకు ప్రేమ మార్గంలోనే ముందుకు సాగాలని హిత బోధ చేసారు. ప్రేమతోనే మనం శత్రువులను మిత్రులుగా చేసుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు.
లౌకికంగా చూస్తే వీరంతా గొప్ప విజయాలను సాధించలేదు. అయితే వారు ఎన్నుకున్న మరియు చరించిన ప్రేమ మార్గం వారిని చిరస్మరణీయులు చేసింది. సమస్త మానవాళి వారిని దైవ స్వరూపులుగా, ఆదర్శవంతులుగా మార్గదర్శకులుగా కొలుస్తుంది.

ఇది ప్రేమ కలిగి ఉన్న అలౌఖిక శక్తి. రండి, 

బాబాజీ నేర్పిన ప్రేమ మార్గంలో చరిస్తూ ప్రేమ 


సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం.  
  
                                గురువు మెచ్చే కానుక
మనం గురువును హృదయపూర్వకంగా ప్రేమిస్తాం ఆరాధిస్తాం గౌరవిస్తాం. గురువుకు ఏదైనా సమర్పించాలని తహతహలాడతాం. సృష్టికర్త అయిన నిరకారునికి మనం ఏమి ఇవ్వగలం? వాస్తవంగా సద్గురువును ప్రసన్నం చేసుకోవటమే మనం నిరకారునికి ఇచ్చే అత్యుత్తమమైన బహుమతి.
సద్గురువును ప్రసన్నం చేసుకోవటానికి మనం ఎలా వ్యవహరించాలి?
·       సద్గురువుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సద్గురువుకు చేసిన పంచ ప్రమాణాలను
 ఆచరణలో పెట్టాలి.
·       తోటి సాధు మహాపురుషులతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఇది మనల్ని సేవ, స్మరణ, సత్సంగంతో జోడించి ఉంచుతుంది.
·       నిరాకారునితో ఎడతెగని బంధం ఏర్పరచుకోవాలి.

ప్రపంచంలో అందరూ మనకు ఏం చేయాలో చెపుతారు. అయితే మనం ఎలా ఉండాలనే శిక్షణను ఇచ్చేది కేవలం సద్గురువు మాత్రమే.
"సద్గురు యొక్క ప్రియ సేవకుడు, పాటించును పంచ ప్రతిజ్ఞలు
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, కలిగుండును నమ్రత దీక్ష
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, చేయును భక్తుల సత్కారం
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, కలిగుండును సత్సంగ మమకారం
సద్గురు యొక్క ప్రియ సేవకుడు, సుజనుల ప్రశంసించేను
"అవతారు"ని మాటిది గుర్వంతర్యామి,  చూసి తనను హర్షించేను"
            అవతార వాణి-    376

సద్గురువు ద్వారా విలువ కట్టలేని బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన మనం సంపూర్ణ శరణాగతి భావం కలిగి వుంటూ, అంతా చేసేది మరియు చేయించేది నిరాకారుడే అని తలచి, త్రికరణ శుద్దితో గురుమార్గంలో నడవటమే మనం ఆయనకు ఇచ్చే కానుక.

              
               రాజ మాతాజీ – కుల్వంత్ కౌర్ జీ
                            రాజ మాతాజీ – కుల్వంత్ కౌర్ జీ
జయ జయ ప్రియ భారతి
జనయిత్రీ కులవంతీ రాజ మాతాజీ నీకు జోహార్లు శతకోటి వందనాలు !

కూతురు స్థానం నుండి నానమ్మ వరకు అన్ని పాత్రలలో ప్రేమను పంచుతూ
ఆనందంగా ఆస్వాదించిన ఓ నిరంకారీ రాజమాతా
నీకు మా జోహార్లు !

ఒక సద్గురువుకి కోడలివై మరొకరి సద్గురువుకి భార్యవై
సమయపు సద్గురువుకి తల్లివై నిరంతరం వారి వెన్నంటి ఉండి వారిని ముందుకు నడిపించిన ఓ వీర నారీ రాజమాతా నీకు జోహార్లు !

మారు మూల ప్రాంతాలనుండి దేశ విదేశాల వరకు
భర్త అడుగుజాడలలో పయనించి
నీ ప్రవచనాలతో ఎంతో మందికి ప్రేరణ కలిగించి
నారీ మణులను సాంగత్యానికి రప్పించ గలిగిన ఓ స్త్రీ మూర్తీ రాజ మాతా
నీకు జోహార్లు !

భర్త వియోగాన్ని తట్టుకొని బాధను దిగమింగుకొని కొడుకును వెన్నంటి పెట్టుకొని
సాంగత్యమనే తల్లి ఒడిలో పరివారాన్ని కూర్చోబెట్టుకొని
ఎటువంటి బంధనాలలో చిక్కుకోకుండా
ఈ నిరంకారీ మిషన్ ని ముందుకు నడిపిoచటంలో నీ పాత్రను సుస్థిరంగా నిలిపిన ఓ ధీర వనితా నీకు జోహార్లు !

సద్గురువు మీకు శ్రద్దాంజలి ఘటిస్తూ
నీ శిరస్సుపై ఆశీర్వదించే చేయి
నేను చరణాలు పట్టుకుందామన్నా నీ పాదాలు నాకు లేవని 
తల్లిదండ్రులను తలచుకుంటూ తల్లడిల్లి బరువెక్కిన హృదయంతో మాట్లాడుతుంటే
అక్కడ ఉన్న భక్తులతో పాటు ప్రకృతి కూడా శోక సముద్రంలో మునిగిపోయింది.

నీ లాంటి స్త్రీ మూర్తు గర్భాన ఇలాంటి సద్గురువుకి జన్మ నిచ్చి మమ్మల్ని తరిoప చేయటానికి
బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించి నిత్యం సాంగత్యాలు జరుపుకుంటూ నిరంకారునిలో కలిసిపోయిన ఓ రాజ మాతా నీకు జోహార్లు!

నారీమణులకు ఆదర్శప్రాయంగా నిలిచి
భక్తులకు ప్రేరణ కలిగిoచే  ప్రవచనాలను ఇచ్చి
నిరంకారి మిషన్ కే కాక సమస్త మానవాళికి స్పూర్తిగా నిలిచి విశ్వమంతటా సత్య సందేశాన్ని అందించి
 ‘ధర్మ రత్న’ బిరుదాంకితురాలైన నిరంకారి రాజమాతాజీ
నీకు హృదయపూర్వక శ్రద్దాంజలి, నీరాజనం, నివాళి మరియు పాదాభివందనాలు.



  ముక్తి పర్వ దినోత్సవము

ప్రతి సంవత్సరము  ఆగష్టు 15 ను సంత్ నిరంకారి పరివారము ‘ముక్తి పర్వ దినోత్సవము’గా జరుపుకుంటుంది. అనేక మహాపురుషులు, వారి తప-త్యాగ, సేవా భావమును మిషన్ ప్రచారకులను గుర్తు చేసుకుంటూ ఎవరైతే గురుచరణలలో సమర్పించుకొని అంతిమ శ్వాసను వదిలారో వారిని గౌరవిస్తూ ముక్తి పర్వ దినోత్సవము జరుపుకుంటాము. దీనినే లోగడ ‘జగత్ మాతాజీ దినోత్సవం’గా జరిపేవారు.
జగత్ మాతా బుద్ధవంతి వారు శరీరం వదిలి ఈ రోజుకు (15-8-2014) 50 సoవత్సరాలు అయినది. వీరు 15-8-1964లో బ్రహ్మలీనం అయ్యారు.ఈ రోజునే ‘జగత్ మాతాజీ స్వర్ణ వర్దంతి’ అని కూడా అంటారు. వారి జీవితం  Simple living High thinking కు ప్రతీక. గురు వచనాన్ని సర్వోత్తమమని నమ్మారు. వారి నరనరాలలో సేవా భావన నిండి ఉండెను. వారు సేవాదారుల బట్టలు ఉతకటం, కుట్టటం, రాత్రి-పగలు వంట చేయటం నిరంతరం చేసేవారు. పూజ్య జగత్మాత గారు బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్(షహన్ షా) వారి అడుగు జాడలలో నడుస్తూ సహకరించారు. సేవా దారులకు సేవా  మార్గం చూపించటం వారు ఇచ్చిన వరం. బాబా బుటా సింగ్ జీ మహారాజ్ వారిని 10 సoవత్సరాలు ఇంట్లో ఉంచుకొని, సేవ చేసి వారిని ప్రసన్నం చేసుకున్నారు. షహన్ షా వారికి 1943 లో గురుపీఠం లభించినప్పుడు జగత్ మాతాజీ గారు షహన్ షా వారిని గురువుగా మొదట  నమ్మారు. భర్తగా తరువాత స్వీకరించారు. వారు షహన్ షా వారి గదిలోకి వెళ్లే ముందు తలుపు కొట్టి ఆ తరువాత నమస్కరించి  భక్తుల మధ్య సాంగత్యంలో కూర్చునే వారు. మిషన్ లో ప్రతి మర్యాదను పాటించారు. ఇలా వారు ఒక ఉదాహరణగా జీవించారు. బాబా అవతార్ సింగ్ జీ వారు కూడా బాబా భుటాసింగ్ గారికి సర్వస్వం సమర్పించారు. వారి మాటలను సత్య వాక్కులుగా నమ్మి ఆచరించారు. గురువు ఆశీర్వాదాన్ని పొందారు. ఈ రోజు ఈ మిషన్ రూపురేఖలు ఏదైతే మనం దర్శిస్తున్నామో అది వారి ఆశీర్వాద ఫలమే.
ప్రధమ ప్రధాని శ్రీ లాభ్ సింగ్ గారు స్కూల్. కాలేజీ లో చదవలేదు. కాని ప్రతి సమస్యకు సమాధానాన్ని వారి చెంతే ఉండేది. వీరు తోటి భక్తులతో ‘మీరు జ్ఞానవంతులు, మహా పురుషులు. మీరు సంసారుల్లా నిoదించుకుంటూ, గొడవలతో దూషించుకోవటం శోభనివ్వదు. ప్రేమ, గౌరవం, సత్కారం అందరికీ పంచినచో సద్గురు ప్రేమ శిష్యులపై ఎల్ల వేళలా ఉంటుంది’ అని హితవు పలికేవారు.
వీరు శహన్ షా గారికి మిత్రుడైనా వీరిలో గురు భక్తి మంత్రం రోమ-రోమములో నిండి ఉండెను. ఎల్ల వేళలా గురు ఆదేశము కొరకు నిరీక్షిస్తూ ఉండేవారు. వారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. గురు వచనాలను ఉన్నది ఉన్నదిగా నమ్మటం, ఆచరించటం వారి స్వభావం. శ్రీ లాభ్ సింగ్ గారు 15-8-1979లో తన నశ్వర శరీరంను వదిలారు.ఆ రోజును ‘ముక్తి పర్వ దినోత్సవము’ గా ప్రకటించారు.వీరందరూ తమ గురు భక్తి. ఆచరణతో మిషన్ కు   ఇంత సుందర స్వరూపాన్నిచ్చారు. అటువంటి గురుమతి జీవితాన్ని ప్రసాదించమని, చివరి శ్వాస వరకు సేవ, స్మరణ, సాంగత్యం చేస్తూ అందరికీ  ప్రేమ భక్తితో జీవించే శక్తిను, బుద్ధిని ప్రసాదించమని, ఇహ పరలోకాలలో సుఖశాoతులు, ఆనందం లభించాలని మనం సద్గురువు చరణాలలో ప్రార్ధించాలి.  ఇదే మనం త్యాగమయ మరియు ఆదర్శమైన జీవితాని జీవించిన నిరంకారి సంత్ మహాత్ములకు అర్పించే ఘన నివాళి.
                          

సద్గురు  ఆవశ్యకత
మానవునికి రెండు జన్మలు ఉంటాయి. మొదటిది తల్లి గర్భంలో. రెండవది సద్గురువు ఒడిలో. సద్గురువు వద్ద బ్రహ్మ జ్ఞానం పొంది ద్విజుడుగా మారతాడు. మానవుడు పుట్టుకతో శూద్రుడని వేదాలు, గ్రంధాదలు, శాస్త్రాలు తెలుపుతున్నాయి.  గురువును ఆశ్రయించి నిరాకార పరబ్రహ్మను తెలుసుకొనటం వలన మానవుడు బ్రాహ్మణుడు అవుతాడు. అందువలన సద్గురువును ఆశ్రయించి, బ్రహ్మ జ్ఞానం పొందటం అత్యంత ఆవశ్యకం. లేనిచో శూద్రుడుగా పుట్టిన మానవుడు శూద్రుడుగానే మరణించి జనన మరణ చక్రాలలో చిక్కుకుంటాడు.  
నిరాకార పరమాత్మ నేడు నిరంకారి బాబా హరదేవ్ సింగ్ జీ వారి రూపంలో ప్రకటితమయి ప్రతి మానవునికి బ్రహ్మ జ్ఞానాన్ని, నిరాకార తత్వాన్ని తెలిపి మానవుడు తన జీవిత లక్ష్యాన్ని సాఫల్యవంతం చేసుకోవటానికి తోడ్పడుతున్నారు.
సద్గురు చరణాలను చేరి శరణొందిన శిష్యుడు తన జీవిత గమ్యమైన నిజ గృహాన్ని, తన స్వస్వరూపాన్ని అనగా ‘నేను ఈ దేహము కాదు  నిరాకార పరమాత్మ యొక్క అంశను’ అని తెలుసుకుంటాడు.
గురు మహిమను గురించి శాస్త్రాలలో ఈ విధంగా తెలుపబడింది:
“గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”
సృష్టిని సృష్టించటం బ్రహ్మ యొక్క కార్యము. సంసారంలోని జీవ రాశుల యొక్క పాలన-పోషణ బాధ్యతలు విష్ణువు నిర్వహిస్తారు. కర్మలను అంతమొందించే వాడు శివుడు.
గురువును ఎందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు?
సద్గురు చరణాలను ఆశ్రయించి బ్రహ్మ జ్ఞానాన్నిపొంది గురు శిష్యుడు జన్మిస్తాడు. కనుక గురువును బ్రహ్మతో పోలుస్తారు. సద్గురువు తన మధుర, ప్రేరణాదాయక వచనాలతో, ఉత్తమ శిక్షణనిచ్చి తన శిష్యుని యొక్క ఆలనా పాలనా చూస్తారు. కనుక గురువును విష్ణువుతో పోల్చారు. శిష్యునిలో ఉన్న వికారాలు,అవగునాల వలన ఉత్పన్నమయ్యే చెడు ఆలోచనలు , గుణాలను సద్గురువు అoతమొందిస్తారు. కావున  సద్గురువుని శివునితో పోలుస్తారు.
·        సద్గురువుని శరీరంగా భావించకూడదుసద్గురువుని శరీరంగా భావించటం ఘోరమైన పాపంగా వేదాలు,శాస్త్రాలు వర్ణించాయి. సద్గురువు నిరాకార పరమాత్మ యొక్క సాకారరూపం కనుక పరమాత్మ సద్గురువులో  ఏ భేదమూ లేదు.
·        గురు చరణాలను సృజించిన సాధారమైన నీటిని  పవిత్రమైన చరణామృతoగా భావించాలి.
·        సద్గురువు యొక్క వాక్కు బ్రహ్మ వాక్కు. ఆ వాక్కును చులకనగా తీసుకోకూడదు.
·        సద్గురువు మిగిల్చిన భోజనమును ఎంగిలి పదార్ధాలుగా భావింపక ప్రసాదంగా భావించి స్వీకరిoచవలెను.
“తీన్ లోక్, నౌ ఖండ్ మై తుజ్ సె బడే న కోయి
దాతా కరే న కర్ సకే గురు సె హోఏ  ”
కబీరు వాణిని లోతుగా అధ్యయనం చేయటం వలన తెలుయునది ఏమనగా :
మూడు లోకాలో, నవ ఖండాలలో గురువుకంటే గొప్పవారెవరు లేరు.  భగవంతుడు చేయలేని కార్యాన్ని కూడా గురువు చేయగలడు.
పరమాత్మ సృష్టికర్త మరియు సర్వ శక్తిమంతుడు . ఆయన ఆజ్ఞ లేకుండా ఆకు కూడా చలించదు. సృష్టిని నింయంత్రణలో ఉoచువాడు ఈ పరమాత్మ. సర్వవ్యాపకత పరమాత్మ యొక్క ప్రత్యేక గుణం.
పరమాత్మ ఎటువంటి వర్ణము లేనటు వంటి వాడు. నీటికి కూడా వర్ణము లేదు కాని నీరు సర్వవ్యాప్తం కాదు. పరమాత్మ నిరాకారుడు. వాయువు కూడా నిరాకారమే కాని వాయువు సర్వ వ్యాపకము కాదు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు. అగ్ని కూడా జ్యోతి స్వరూపమే కాని అగ్ని సర్వవ్యాపకం కాదు.  సర్వత్రా వ్యాపించి  ఉండటమే పరమాత్మ యొక్క ప్రత్యేక గుణం.
పరమాత్మ ఆద్యంత రహితుడు. పరమాత్మ ఆజ్ఞ లేనిదే సృష్టిలో ఏ కార్యము జరగదు. అయినప్పటికి పరమాత్మ కంటే సద్గురువు గొప్ప వాడు. ఎoదుచేతనంటే పరమాత్మ నిర్వర్తించని కార్యము సద్గురువు నిర్వర్తిస్తాడు. ఆ కార్యమేమిటంటే భగవంతుడు తనను తాను  వ్యక్తపరచుకోలేదు .  అది కేవలం సద్గురువు  మాత్రమే  చేయ గలడు . మన భక్తికి మెచ్చి పరమాత్మా తన ఉనికిని ఆకాశవాణి ద్వారా కనుక తెలిపితే, మనం ఆయనను భగవంతునిగా విశ్వసించక ఒక భూతంగా తలచి భయభ్రాంతులకు లోనవుతాము. మానవునికి భగవంతుని బోద కేవలం సద్గురువే చేయగలరు.
సాకారరూపుడైన సద్గురువు మానవునిగా సంచరిస్తూ తోటి మానవులకు బ్రహ్మజ్ఞానం తద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధించి తాను  దేహం కాదు నిరాకార స్వరూపమనే తెలివిని కలుగచేస్తారు. ఈ బోధ వలన భగవంతుడు త్రికాలుడనే విశ్వాసం ఏర్పడుతుంది. మనం ముల్లోకాలలో  కీర్తిoపబడతాం.
శాపవశాత్తు రాయిగా మారిన గౌతమ ముని భార్య అహల్య శ్రీ రామచంద్రుని చరణాలను తాకటం వలన తిరిగి తన పూర్వ రూపాన్ని పొoదగలిగిoది. గంగోత్రి లో ఉద్భవించిన గంగ శివుని పాదాలను తాకి ప్రవహించటం వలన ముల్లోకాలకు కళ్యాణకారిణిగా అయ్యింది.
రబ్బరు స్టాంప్ మీద అక్షరాలు తిరగబడి ఉండటం వలన ప్రత్యక్షంగా చదవలేము. అదే ఒక కాగితం పైన ముద్రించి నప్పుడు అక్షరాలు సరైన రూపం దాల్చటం వలన స్పష్టంగా చదవగలం. అదే విధంగా గురుచరణాలలో శరణొందిన శిష్యుని తలరాత కూడా మారుతుంది.  ఇది సద్గురువు మహత్యం. మన భార్యా, పిల్లలు, బంధువులు, ఆస్తి పాస్తులు, ధనం, అదృష్టం మనల్ని వీడినా గురు కృప ఎల్లవేళలా మనకు తోడుగా నిలుస్తుంది. ఇహ పర లోకాలలో కూడా మనల్ని రక్షించేవాడు సద్గురువు.
జోదా సింగ్ అనే ఒక శిష్యుడు శ్రద్ధా భక్తులతో తన గురువును సేవిoచేవాడు. గురు ఆజ్ఞలను తు చ తప్పకుండా పాటించేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు వివాహాన్ని నిశ్చయించారు. గురు అనుమతి పొంది వివాహ నిమిత్తం తన స్వగ్రామానికి బయలుదేరాడు. వివాహం  జరుగుతున్న సమయంలో గురువు వేరొక శిష్యునితో ఉన్న పళంగా బయలుదేరి రమ్మని సందేశాని పంపారు. గురు సందేశము తెలుసుకొని వివాహం మధ్యలోనే గురువు వద్దకు బయలు దేరాడు. ఆ సమయంలో వివాహానికి విచ్చేసిన పెద్దలు, ‘వివాహానంతరం బయలుదేర వచ్చు కదా ?’అని నచ్చజెప్ప ప్రయత్నిoచారు. వివాహము తరువాత అయినా చేసుకోవచ్చు కాని గురు ఆజ్ఞను దిక్కరిoచలేనని తెలిపి బయలుదేరాడు.  గురు వద్దకు పయనిస్తుండగా అతనికి అభిమానంతో కూడిన ఒక ఆలోచన కలిగింది. ‘గురు ఆజ్ఞను శిరసావహించటం వలన నన్ను అందరూ గొప్ప గురుశిష్యునిగా పరిగనిస్తారు. వివాహాన్ని సైతం కాదని గురు ఆజ్ఞను పాటించిన శిష్యులు ఎవరూ ఉండి ఉండరు. నేను చాలా గొప్ప శిష్యున్ని’ అన్న భావన మనసులో కలిగింది. అభిమాన అహంకారముల మూలంగా అతనిలో వికారాలు ప్రవేశించాయి. మార్గ మద్యములో వేశ్య వాటిక తటస్త పడినప్పుడు అతనిలో  కామ వాంఛ కలిగింది. ఆ గృహం వైపు అడుగులు వేసాడు. అదే సమయంలో ఒక కాపలాదారుడు ‘జాగురూకతతో ఉండండి... జాగురూకతతో ఉండండి ’ అని అరుస్తూ అటూ ఇటూ ఆ వీధిలో తిరిగుతున్నాడు. ఆ గాస్తీదారుని (చౌకిదార్) దృష్టిలో పడితే తన పరువు పోతుందనే ఉద్దేశంతో అతను పక్కకు తప్పుకోగానే ఆ ఇంట్లోకి ప్రవేశించటానికి కాచుకొని కూర్చున్నాడు. కానీ ఆ చౌకీదార్ ఆ ఇంటి మెట్ల మీదనే తిష్ట వేసాడు. ఇక శిష్యుడు ఏమీ చేయలేక తెల్లవారుతూనే గురువు వద్దకు ప్రయాణమయ్యాడు. గురువు చెంత చేరి భక్తితో నమస్కరించాడు. గురువుగారి కళ్ళు ఎర్రబడి ఉండటం, ముఖం నీరసంగా ఉండటం గమనించి కారణమేమని  అడిగాడు. సమాధానంగా గురువుగారు, ‘నీ కోసం రాత్రంతా చౌకీదార్ పని చేయవలసి వచ్చింది’ అన్నారు. ఆ మాటలు విన్న శిష్యుడు పరిస్థితి అర్ధమయ్యి సిగ్గుతో తలవంచుకున్నాడు. పై సంఘటను విశ్లేషిస్తే మనకు బోధపడేది ఏమిటంటే శిష్యునిలో తెలిసో తెలియక కలిగిన వికారాలను సద్గురువు అoతమొందిస్తారు. మనకు ఎల్లవేళలా రక్షకుడిగా () నిలుస్తారు. కావున సద్గురువు ఇచ్చిన సేవను త్రికరణ శుధితో కనుక నిర్వర్తిస్తే సద్గురువు ఎల్లవేళలా మనకు తోడూ నీడై ఉంటారు.
శిష్యుడు తన సేవతో వ్యక్తులను మెప్పించటానికి కాక సద్గురువును మెప్పిoచాలి. సేవలో ఉన్న ఒక యువకుడు తను చేసిన సేవకు  స్థానిక సంచాలక్, ముఖి తగిన గుర్తింపు ఇవ్వటం లేదని తలచి ఇక భవిష్యత్తులో సేవ చేయనని తన తల్లికి తెలుపుతాడు. కారణం తెలుసుకున్న తల్లి తన కుమారున్ని ఒక మహాపురుషుని వద్దకు తీసుకు వెళ్ళింది. ఆయన ఆ యువకున్ని “నీవు ఎవరికి సేవ చేస్తున్నావు? గురువుకా, ముఖికా ?” అని ప్రశ్నించాడు. ఆ యువకుడు ‘గురువుకే ’అని సమాధానమిచ్చాడు. వ్యక్తుల ప్రశంసల కొరకు ఆరాట పడకుండా సద్గురువు కృపకు పాత్రులవ్వటానికి సేవ చేయమని హితబోధ చేసాడు.
సద్గురువును ఆశ్రయించి ఆయన ఆదేశానుసారం సేవ, స్మరణ, సాంగత్యం కనుక చేస్తే శిష్యుని బాధ్యతను సద్గురువు స్వీకరిస్తారు.   
“ధ్యాన మూలం గురోర్ రూపం
పూజా మూలం గురోర్ పాదం
మంత్రం మూలం గురోర్ వాక్కు
మోక్షా మూలం గురోర్ కృప ”
నిరాకార పరమాత్మ సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ గా భూమి మీద అవతరించటానికి గల కారణం మానవునికి జ్ఞాన బోధ చేయటానికి తద్వారా మనసులోని వికారాలను నాశమొందించి మోక్షాన్ని ప్రసాదిo చటానికి. ప్రతి ఘటము సద్గురు స్వరూపమే. అదృశ్య రూపంలో ఏదో ఒక ఘటము ద్వారా తన శిష్యులను ఎల్లవేళలా రక్షిస్తుoటారు. సద్గురు చరణ కమలాల యందు సదా వినయ విధేతలతో సమర్పించుకోవాలి.
సద్గురువుకి దూరం అవటం వలన  కలిగే నష్టము, వెయ్యి మంది శత్రువుల వలన కలిగే నష్టము కంటే తీవ్రంగా ఉంటుంది. ఏ పరిస్థితుల లోనైనా సద్గురువుకి దూరం అవ్వకూడదు. సాదు సాంగత్యానికి దూరమవ్వటం ఘోర అపరాధమని సంత్ తులసిదాస్ తెలిపారు. అహంకార అభిమానాలను త్యజించి గురువును శరణు వేడినప్పుడే ఫలము లభిస్తుంది.
సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు జ్ఞానం ఇచ్చి సేవ, స్మరణ , సాంగత్యం అనే మూడు సోపానాలను ప్రసాదించారు. సద్గురు ఇచ్చిన స్మరణ వలన మూడు యోగాల ఫలితం దక్కుతుంది.
తూ హీ నిరంకార్ (జ్ఞాన యోగం)
మై తేరి శరణ్ హా (కర్మ యోగం )
మైనూ భక్ష్ లో (భక్తి యోగం)

శ్రద్ధతో శ్వాస శ్వాస ‘తూహీ నిరంకార్ ’ అని స్మరణ చేస్తూ ఉండాలి. 



                                

                
                              గురు భక్తి
గురు భక్తి కొరకు గురు పూజ అత్యంత మహాత్వపూర్ణమయినది. శిష్యుడు గురువును పూజించటం ద్వారా తన కృతజ్ఞతను తెలుపుతాడు.
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ ” యొక్క భావము గురుపూజకు మూలాధారము.
సుఖదుఃఖాల సమ్మిలితము జీవితము.  అయితే గురు పూజ వలన  కలిగే ఆనందము అఖండమైనది మరియు సతతము ఉండేది.
సద్గురువు ఈ చరాచర జగత్తుకి పరమపిత, సర్వశ్రేష్టుడు మరియు పూజ్యనీయుడు. అఖిల బ్రహ్మాండములో సద్గురువుకి సాటి రాగల వారు ఎవరూ లేరు. భక్తుడు ఎల్లప్పుడూ తన తప్పొప్పులను క్షమించమని సద్గురువును యాచిస్తూ ఉంటాడు. వేడిన వారిని ఉద్దరించటం సద్గురువు యొక్క సహజ స్వభావము. సద్గురువు యొక్క చరణ ధూళి లభించుట దుర్లభము. సద్గురు చరణాలను సృజించి గంగా నది మూడు లోకాలను పావనమొనర్చే పవిత్ర జలముగా మారింది. సద్గురు పాద స్పర్శ వలననే రాయి అహల్యగా మారింది. సద్గురు యొక్క చరణ కమలాల చింతన వలన అంతఃకరణము శుద్ధి అవుతుంది. గురు శిష్య పరంపర యొక్క వాస్తవ రూపాన్ని సద్గురువు స్వయంగా జీవించి చూపిస్తారు. యుగపురుషుడు బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు ఆరంభములో బాబా భూటా సింగ్ జీ మహారాజ్ వారికి ఏ సత్కారం చేసారో అటువంటి సత్కారమే తరువాత బాబా గురు బచన్ సింగ్ జీ వారికి కూడా చేసారు.
సద్గురువు మరియు పరమాత్మ ఇద్దరూ ఒకరేనా?
ఇద్దరిలో భేదముందా?
గురువు మరియు పరమాత్మలో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలని విశ్లేషిస్తే 
“గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ”
దీని భావము గురువే బ్రహ్మ; గురువే విషువు; మరియు గురువే పరమేశ్వరుడు.
జగతిని సృష్టించి, పోషించి మరియు శాంతపరచే మూడు శక్తులూ గురువులో ఇమిడి ఉన్నాయి.
పరమాత్మ నిరాకారుడు. సద్గురువు శరీర ధారుడు. శరీరము ధరించినప్పటికీ విదేహునిగా నిరాకారుని లీలలను సాకార శరీర రూపంలో ప్రదర్శిస్తారు. ‘గురు’ శబ్దములో ‘గు’  యొక్క అర్ధము అంధకారము మరియు రెండవ అక్షరమైన ‘రు’ యొక్క అర్ధము పారద్రోలేవాడు. గురువు జ్ఞాన జ్యోతిని వెలిగించి శిష్యుని యొక్క అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి ప్రకాశం వైపుకు నడిపిస్తారు.
సద్గురు ప్రసాదించిన జ్ఞాననేత్రము ద్వారా సత్యాసత్యాలను శిష్యుడు గుర్తించగలుగుతాడు. మరియు గురువు కంటే అధిక కల్యాణం కలిగించే వారు సంసారంలో ఎవరు ఉండగలరు? ఎవరూ లేరు.
నేడు ఎవరిని భగవంతునిగా ఆరాదిస్తున్నామో వారి జీవితము కూడా గురువు ద్వారానే సత్యము వైపుకు మరల్చబడింది. శ్ర్రీ రామ చంద్రులు వశిష్ట మహర్షి శిష్యునిగా మరియు సాందీప మహర్షి  వెన్న దొంగ అయినటువంటి  శ్రీ కృష్ణున్ని జ్ఞానులలో అగ్రగణ్యుడుగా తీర్చిదిద్దారు. వివేకానందునికి చికాగో సమ్మేళనంలో అందరి ప్రశంసలు పొందటానికి కావలసిన శక్తిని ఎవరిచ్చారు? స్వామి రామ తీర్థునికి తత్వదర్శి బ్రహ్మ నిష్టుడిగా ఎవరు చేసారు? స్వామి దయానంద సరస్వతిలో  సమాజ ఉద్దరణ చేయాలన్న ప్రభల కాంక్షను ఎవరు రగిలించారు? ఈ అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానము ‘గురువు’.
తులసిదాస్ గురువు లేక సంసార సాగరాన్ని ఎవరూ దాటలేరని ఈ క్రింది శ్లోకం ద్వారా తెలిపారు.
“ बिना गुरु भव निधि तरई न कोई I
बरू बिरंची शंकर सम होई II ”
 అందుచేతనే గురువు యొక్క స్థానము భగవంతునికన్నా ఉన్నతమైనదిగా నిర్వివాదంగా అంగీకరించటమైనది.
అంధుడైన మానవుడు భగవంతుడు వేరు గురువు వేరు అని చెపుతున్నాడు.
భక్త కబీరు మాటలలో
“ कबीरा ते नर अंध है, गुरु को कहे और I
हरि रुठे गुरु टौर है, गुरु रुठे नहीं टौर II 
భగవంతుడు కోప్పడితే గురువు రక్షిస్తాడు. గురువు కోప్పడితే రక్షించే వారెవరూ లేరని కబీరుదాస్ తెలుపుతున్నారు.
లోతుగా  ఆలోచిస్తే, అహంకారమనే రోగమును దూరము చేసి ముక్తిని కలిగించే ఔషదము పరమాత్మ. ఈ ఔషదాన్ని ప్రసాదించే వైద్యుడు గురువు. ఔషదము గొప్పదా లేక వైద్యుడు గొప్పవాడా అని ఆలోచన చేస్తే ఔషధము యొక్క గొప్పదనము వైద్యుని పట్ల గల విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది.
వైద్యుని యందు ఎవరికైనా విశ్వాసం మరియు శ్రద్ధ కనుక లెకపొతే ఔషధమును స్వీకరిoచము. కనుక ఔషధము కంటే వైద్యుడే గొప్పవారు. అందుకే గురువు దాత మరియు హరి దానము. హరి శక్తి అయితే గురువు శక్తివంతుడు. హరి వజ్రమైతే గురువు వజ్రపు గని.
ఈ కారణాల వలననే  మహాపురుషులు ఈ క్రింది విధముగా చెప్పవలసి వచ్చింది:
“ गुरु गोबिंद दोऊ खड़े, काके लागू पाय I
बलिहार गुरु आपणा, जिनि गोबिंद ये मिलाय II”
-    కబీరదాస్
గురువు గోవిందుడు ఎదురైతే ఎవరికి నమస్కరించను? గోవిందునితో కలిపిన గురువుకే నన్ను నేను సమర్పిoచుకుoటాను.
ముక్తి పరమాత్మను కలవటం ద్వారా ప్రాప్తిస్తుంది. మరి గురువు గుణగానము ఎందుకు చేయాలి అని కొందరు ఆలోచిస్తుంటారు. ఇక్కడ మనము ఒకటి గమనించాలి. దాహము నీటి వలన తీరుతుoది. ధన్యవాదాలు ఇచ్చిన వారికి తెలుపుతాము కాని నీరుకి కాదు. ఆకలి భోజనము వలన తీరుతుంది. ధన్యవాదాలు అన్నదాతకు తెలుపుతాము కాని భోజనముకు కాదు. పరమాత్మ యొక్క కలయిక వలన జన్మజన్మల దుఃఖము సమాప్తమవుతుందనేది సత్యం. కాని పరమాత్మను పరిచయం చేసిన గురువు వందనీయుడు.
జ్ఞానము, భక్తీ గురువు లేక సంభవము కావు. సాక్షాత్తు భగవంతుడినే ప్రత్యక్షం చేసుకున్నా గురు కృప లేనిదే ముక్తి లేదు.
గురువు జ్ఞాన దాత మరియు భక్తికి ఆధారం కూడా. శ్రద్ధతో కూడుకున్న సేవకు ప్రతిరూపమే భక్తి. నిరాకార పరమాత్మ యొక్క సాకార రూపమే లేకపోతే సేవ ఎవరికి చేస్తాం? చరణాలు ఎవరివి స్పర్శిస్తాం? ఎవరి వాక్కులు శ్రవణము చేస్తాo? ఎవరిని సాకారంగా వీక్షిస్తాం?
పరమాత్మలో మూడు స్వరూపాలు ఉంటే, పరమాత్మ కంటే గురువులో రెండు స్వరూపాలు అధికంగా ఉన్నాయి.  హరి జ్ఞాన స్వరూపుడు ( సత్) ; ప్రేమ స్వరూపుడు(చిత్); మరియు ఆనంద స్వరూపుడు(ఆనంద్). కాని గురువు ఈ మూడు స్వరూపాలతో పాటు ‘నామ’ మరియు ‘రూపము’ను కూడా కలిగి ఉంటారు. నామరూపాలు(విగ్రహం) కలిగి ఉండటం వలన వారి దర్శనము. చరణ స్పర్శ, సేవ మొదలగునవి అన్నియూ చేయగలం. వారి వాణి శ్రవణం చేయగలం, మనం వారికి వినిపిoచగలం. అందుకే గురు గీతలో
“ ధ్యాన మూలo గురోర్ మూర్తి :
పూజా మూలం గురోర్ పాదం
మంత్రం మూలం గురోర్ వాక్యం
మోక్ష మూలం గురోర్ కృప ”
దీని భావము : ధ్యానానికి మూలం గురువు కావున గురువును ధ్యానించు.
            పూజకు మూలం గురు చరణాలు కావున గురుచారణాలను పూజించు.
            మంత్ర మూలం గురు వచనాలు, వాటిని ఆచరించు.
           మోక్షానికి మూలం గురువు యొక్క కృప, అనగా మోక్షప్రాప్తి కొరకు గురు కృపకు పాత్రులవ్వాలి.
వాస్తవంగా ఎవరికైతే పరమాత్మతో యోగం చేసే పూర్ణ సద్గురు లభిస్తారో వారి జీవనం సఫలం. వారి కంటే భాగ్యశాలి ప్రపంచంలో ఎవరుంటారు?
·       సద్గురువు యొక్క వాక్కు అత్యంత శక్తివంతమైనది.
·       సద్గురువు యొక్క ఆశీర్వాదం యుగాల వరకు ప్రభావం కలిగి ఉంటుంది.
గురు వచనాలను పాటించటం వలన మూడు లాభాలు ఉంటాయి.
·       గురువు కీర్తిని పెంచిన వారమౌతాము
·       హరి నామ స్మరణ స్వతహాగా జరుగుతుంది మరియు
·       దుర్మతి చెంత చేరదు.
సద్గురు యందు విశ్వాసము కలిగి ఉంటే నిరాకార పరమాత్మ యొక్క ఇచ్చానుసారం జీవిస్తాం. అందుచేతనే గురువు యొక్క పూజ అన్నిటి కంటే ఉత్తమమైనది. ఎవరు గురువును పూజిస్తారో వారు కూడా ఉత్తములౌతారు.
నేడు మన ముందు సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు నిరాకార పరమాత్మ యొక్క సాకార రూపుడుగా మనకు లభించారు. అట్టి గురువుకు పూజ- శ్రద్ధ అనే పల్లెములో, ప్రేమ అనే పుష్పాలతో, భక్తీ అనే కుంకుమతో, జ్ఞానమనే చందనముతో చేయాలి. గురు మార్గములో పయనించటం వలన కలిగే ప్రభావము మనస్సు, వాక్కు మరియు కర్మల ద్వారా ప్రకటితమవ్వాలి.
గురుభక్తుడు సద్గురువును ఈ విధంగా వేడుకుంటాడు.
“ఓ గురుదేవా! నిన్ను స్తుతించే తెలివికాని, నీ గుణగణాలు కీర్తించే వాణిలో శక్తి గాని నా వద్ద లేదు. నేను స్వయంగా నీ చరణాలలో సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ మీ చరణ ధూళిగా మరియు ఎల్లప్పుడూ మీ కృపకు పాత్రుడవుదును గాక”.
                 ***************************   
స్మరణ  - బీజ మంత్రం
తూహీ నిరంకార్ (నీవే నిరంకార్ )
మై తేరి శరణ్ హా (నిన్నే శరణంటిని)
మైనూ భక్ష్ లో (నన్ను క్షమించు)
సద్గురువు బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించి నిత్యము ఆ పరమాత్ముని ఎరుకలో ఉండటానికి సేవ, స్మరణ, సాంగత్యం అనే సోపానాలను ప్రసాదించారు. సాధారణంగా మనము సాంగత్యము మరియు సేవకు ప్రాధాన్యతనిస్తున్నాము కాని స్మరణకు ఇవవలసినంత ప్రాధాన్యత ఇవ్వటం లేదని  సద్గురు బాబా హర దేవ్ సింగ్ జీ మహారాజ్ వారు తెలుపుతున్నారు. వాస్తవంగా సాంగత్యము చేస్తున్నా, లేదా సేవ చేస్తున్నా స్మరణ కనుక జరుగకపొతే వాటి యొక్క పూర్ణ ఫలితాన్ని పొందలేము.
స్మరణ యొక్క ప్రాధాన్యతను మరియు భావాన్ని గుర్తెరిగి చేసిన, దాని ద్వారా పొందే ఫలితము అత్యంత అద్భుతమైనది.
నిరాకారున్ని తత్వత తెలుసుకొనక, తదానుసారంగా కర్మలు చేయక స్మరణను వల్లె వేయటం వలన ఎలాంటి ఉపయోగమూ లేదు. సద్గురు ముఖత పొందిన బీజమంత్రం యొక్క అంతరార్ధాన్ని గ్రహించి  ప్రేమభావముతో స్మరించాలి.
కాని కేవలం పదే పదే వల్లె వేయటం వలన ఏ ఉపయోగమూ ఉండదు.
నిరంకారి బాబా ప్రసాదించిన బీజ మంత్రం “తూహీ నిరంకార్; మై తేరి శరణ్ హా; మైనూ భక్ష్ లో” వర్తమానంలో సర్వ శ్రేష్టమైనది. ఈ బీజ మంత్రం అంతఃకరణాన్ని నిర్మల పరచి, మనస్సుకు శాంతిని ప్రసాదించి, భ్రమలను దూరం చేసే అమోఘమైన శక్తిని కలిగి ఉంది. నాలుగు వేదాలలో వివరింపబడిన జ్ఞానము, భక్తి మరియు ఉపాసనల సారము సద్గురు ప్రసాదించిన ఈ బీజమంత్రములో ఇమిడి ఉంది.   
తూహీ నిరంకార్ – జ్ఞాన ఖాండము( స్మరణ; ధ్యానము)
మై తేరి శరణ్ హా  -- కర్మ ఖాండము ( భక్తి; సేవ)
మైనూ భక్ష్ లో – ఉపాసనా ఖాండము ( ప్రార్ధన; యాచన )
మనం ఒక సారి ఆలోచిoచినట్లయితే “తూహీ నిరంకార్ ” అనేది అద్వైత జ్ఞానములో సర్వ శ్రేష్టమైనది. దీని ద్వారానే ఆత్మ పరమాత్మతో యోగమవుతుoది. నాలుగు వేదాలలోని నాలుగు మహా వాక్యాల సారము ఇదే.
·       ‘ అయామాత్మ బ్రహ్మ ’
·       ‘ అహం బ్రహ్మస్మి’
·       ‘ తత్వమసి’
·       ‘ ప్రజ్ఞానం బ్రహ్మ’
నాలుగు వేదాలలోని ఈ నాలుగు మహా వాఖ్యాలు పరమాత్మ యొక్క శుద్ధ అద్వైత జ్ఞానమును ప్రతిపాదిస్తున్నాయి. వీటి సమస్త సారము ‘ తూహీ నిరంకార్ ’ లో స్వతహాగా ఇమిడి ఉన్నది.
ఈ విధముగానే ‘మై తేరి శరణ్ హా’ కంటే శ్రేష్టమైన కర్మ ఏదియూ లేదు.  హరి లేక గురువును శరణు వేడుటకంటే శ్రేష్టమైన కర్మ ఏదైనా ఉందా? సమాస్త కర్మలూ దీనిలోనే ఇమిడి ఉన్నాయి. శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునితో ‘ నన్నే శరణు వేడి నిష్కామ కర్మలను ఆచరించినచో నీవు బంధములో చిక్కుకోవు ’అని తెలిపెను.
ఇదే విధముగా అన్నిటి కంటే గొప్ప ప్రార్ధన మరియు ఉపాసన భగవంతుని సమక్షములో దీన భావనతో నిరంతరము తన తప్పులను క్షమించమని యాచించటం. మనం మళ్ళీ మళ్ళీ ‘ మైనూ భక్ష్ లో ’ అని పలుకుతూ ఉండాలి.
వైదిక సాహిత్యము యొక్క సంపూర్ణ సారమైనటువoటి జ్ఞాన ఖాండము, కర్మ ఖాండము మరియు ఉపాసనా ఖాoడములను నిరంకారి మిషన్ యొక్క ఈ బీజ మంత్రము పూర్ణ రూపంలో తనలో ఇముడ్చుకొని ఉంది. ఇదే కలియుగంలో మహా మంత్రం. ఈ మంత్రము యొక్క భావాన్ని గురు కృప ద్వారా తెలుసుకొని జపించిన, అలౌకిక శాంతి, సఫలత మరియు ఆనందము ప్రాప్తిస్తాయి.
మానవుని అంతఃకరణ మనో, బుద్ధి, చిత్త అహంకారాలతో కూడుకొని ఉంది. సంకల్ప వికల్పాలను కలుగ చేసేది మనస్సని, నిర్ణయించేది బుద్ధి అని మరియు అంగీకరించేది చిత్తమని తెలుపబడింది. ఇదే విధముగా ‘నేను, నాది ’ అనే భావన అహంకారానికి  చిహ్నంగా  చెప్పబడింది. ఈ నాలుగింటినీ కలిపి శాస్త్రాలు ‘అంతఃకరణ చతుష్టయము’గా తెలిపాయి.
సద్గురు ద్వారా పొందిన బీజ మంత్రము అంతఃకరణములోని ఆవరణ, మల మరియు విక్షేప దోషాలను దూరం చేస్తుంది. అంతఃకరణ (మనస్సు) అద్దం వంటిది.  ఆవరణ = తెర ; మలం = మలినం; విక్షేపం= చంచలత్వం
పరమాత్మ యొక్క జ్ఞానము మనస్సు అనే అద్దము లోనే ప్రకటింపబడుతుoది. అద్దము శుబ్రముగా ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. కంటికి అద్దానికి మధ్య తెర ఉంచినట్లయితే ప్రతిబింబం కనిపించదు. ఇదే ఆవరణ దోషము. మాయ అనే ఆవరణ మనస్సు అనే దర్పణంలో భగవంతుని రూపాన్ని చూడకుండా అడ్డు పడుతుంది. అదే అద్దం మీద ధూళి కణాలు కనుక చేరి ఉంటే ప్రతిబింబం కనిపించదు. దీనికి కారణం మల దోషము. విషయ వాసనలు మనస్సులో మలినాలను కలుగ చేస్తాయి. అద్దాన్ని కనుక అటూ ఇటూ కదిపినప్పుడు కూడా ప్రతిబింబమును చూడలేము. మానవునిలోని తృష్ణలు ( విత్తోషణ్, పుత్రోషణ్, లోకోషణ్- ధనము గురించిన, పుత్రుని గురించిన మరియు లోకము గురించిన చింత) మనస్సుకు చంచాలత్వాన్ని మరియు చపలత్వాన్ని కలుగచేస్తుంది.
ఇదే విక్షేప దోషము. ఆవరణ , మల, విక్షేప దోషాల కారణంగా మనస్సు అనే అద్దంలో చిత్రం కనిపించదు. ఆవరణ, మల మరియు విక్షేప దోషాలను దూరం చేసి అంతఃకరణాన్ని పవిత్రముగావిoచే అనుపమ శక్తియే నేటి ఈ బీజ మంత్రం. ఈ మంత్రము గురువు ద్వారా సాక్షాత్తు ప్రభు దర్శనము కలిగిన పిదపనే ఫలితాన్ని ఇస్తుంది. ఈ మంత్రములోని మూడు భాగాలు మూడు దోషాలను దూరం చేస్తాయి.
·       తూహీ నిరంకార్ ( జ్ఞాన యోగం) – అంతఃకరణo యొక్క ఆవరణ దోషమైన మాయను దూరంచేస్తుoది.
·       మై తేరి శరన్ హా (కర్మ యోగం )-- అంతఃకరణo యొక్క మల దోషమైన విషయ వాసనలను దూరంచేస్తుoది.
·       మైనూ భక్ష్ లో ( భక్తీ యోగం ) -- అంతఃకరణo యొక్క విక్షేప దోషమైన చంచలత్వాన్నిదూరంచేస్తుoది.
ఈ విధముగా మనో దర్పణము మూడు దోషాల నుండి విముక్తిని పొంది స్వచ్చంగా ఉండటం వలన భగవంతుని ప్రతిబింబము (జ్ఞానము) దానిపై  ప్రకటితమవుతుoది. దర్పణము ఎంత స్వచ్చంగా ఉంటే చిత్రం అంత స్పష్టంగా ఉంటుంది.
జ్ఞానం, కర్మ, ఉపాసనల ప్రతీకలైనటువంటి బీజ మంత్రం లోని మూడు భాగాలు అంతఃకరణలోని మూడు దోషాలను సమర్ధవంతంగా నిర్మూలిస్తాయి. అంతఃకరణం శుద్ధి అవటం వలననే బ్రహ్మ జ్ఞానం స్థిరపడుతుంది.
మననము, ధ్యానము మరియు స్మరణలు అంతఃకరణాన్ని శుద్ధి చేయటానికి, జీవనాన్ని పవిత్రమొనర్చటానికి అనగా గురు మార్గంలో పయనించటానికి సర్వ శ్రేష్ఠ సోపానాలు. కావున ‘తూహీ నిరంకార్ ; మై తేరి శరన్ హా; మైనూ భక్ష్ లో’ అనే నేటి బీజ మంత్రాన్ని భావ పూర్వకంగా మననం చేస్తూ ఉండాలి. దీని వలన మనలో శ్రవణము, ధ్యానము, త్యాగము మరియు శాంతము క్రమంగా వృద్ది చెందుతాయి. జ్ఞానము పొందిన పిదప శాంత స్థితికి చేరటం ఆవశ్యకం. ఈ బీజమంత్రాన్ని సద్గురువు ఉపదేశించిన విధంగానే అనగా ‘తూహీ నిరంకార్ ; మై తేరి శరన్ హా; మైనూ భక్ష్ లో’అని ఉచ్చరిoచటం  వలన అత్యుత్తమమైన ఫలాన్ని పొందగలుగుతాం.



సంస్కరణ
 ప్రాధాన్య క్రమంలో దేవుని తర్వాతి స్థానం మనిషిదే అతడిని సంస్కరిoచగలగడం ఒక మహత్తర ప్రయోగంఅనాగారికులను నాగరికులుగా రూపుదిద్దాలి. మనిషిలోని చెడు సంస్కారాలు అడుగడుగునా అతనికి ఆటంకాలను సృష్టిస్తాయి వికృతమైన ఆలోచనలు అతడిలోనికి శారీరిక మానసిక రోగాలను ఆహ్వానిస్తాయి.ఇవే అతని వైఫ్యల్యానికి,  దుఃఖానికి మూల కారణం మరోపక్క ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి తన ధృక్పధం ఆధారంగా, క్రమబద్ధమైన కార్య కలాపాల ఆధారంగా మహిమాన్వితుడిగా రాణిస్తాడు.
ఆహారం నిద్ర మనిషికి ఎంత అవసరమో ఆనందంగా ఉండటం అంతకంటే అవసరం. ఆనందం అనేది మనందరి హక్కు.  సంతోషం ఒకరు ఇచ్చేదికాదుసద్గురువు నుండి స్పూర్తిని,  ప్రేరణను పొంది, బ్రహ్మ జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా మలచినప్పుడు  అనుభవపూర్వకంగా ఆస్వాదించగలం.
“తన నిజమైన ఆత్మను ఎవరైనా తెలుసుకున్నప్పుడు మృత్యువు మరణిస్తుంది ” ఉపనిషత్తులు
జననం మన చేతిలో లేదు మరణం మన చేతిలో లేదు అమృతత్వాన్ని పొందాలి చిరంజీవులవ్వాలి.

పుట్టటం చావటం మరల పుట్టటం చావటం ఇలా మనం జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోతూ ఉంటాము. ఈ మహాప్రవాహంలో నుండి మనలను బయటకు లాగి జనన మరణములతో సంబంధం లేని బ్రహ్మ స్థితి కలుగ చేయటమొక గురువుకే సాధ్యం.
గీతలో పరమాత్మ,”నన్నుప్రేమిoచు, నన్ను ఉపాసన చెయ్యి. నన్ను జపించు. నీ మనస్సును నాకు ఇచ్చేయి ”అని పదే పదే చెప్పుతున్నాడు. ఎoదుచేతనoటే మనో విషయానుభవాలకు, బౌతిక బోగాలకు అలవాటుపడి తన్మయమవుతున్నాము. వాటి నుండి మనస్సును  భగవంతుడి వైపుకు మళ్ళించటానికి ఇది చాలా అవసరము.
లోకంలో ఉన్న ఆకర్షణలు మనకు తెలియాలి. బలహీనతలు మనకు తెలియాలి. అందులో పడకుండా ఉండాలి. అదీ వివేకమంటే. లక్ష మందిలో ఉన్నా నీ ఏకాంతం చెడకూడదు.అదీ ఏకాoతమంటే. విషయాల మధ్యలో ఉండి నిర్విషయ స్థితిలో ఉండాలి.వికారాల మధ్యలో నిర్వికారంగా ఉండాలి. ఆకర్షణల మధ్యలో ఆకర్షణలు లేని స్థితిలో ఉండాలి.
ఈశ్వర చింతన తప్పించి దేనిని చింతించిన చివరకు చీకటి మిగులుతుంది. సత్యంతో అనుబంధం పెంచుకోవాలి. ఎందుకంటే అది ఒక్కటే నిజం. ఈశ్వరుని పట్ల నీకు ఉన్న విశ్వాసం ధృడపడాలి. గురువు యొక్క కటాక్షం లేకుండా మనం దేనినైనా పొందాలి అనుకుంటున్నావో దానిని పొందలేము. మన దుఃఖాన్ని ఎవరు ఆర్పగలరంతే అది గురువుకే సాధ్యం. మనల్ని దుఃఖం లేని స్థితికి తీసుకొని పోవాలంటే అది ఒక గురువుకే సాధ్యం.
అండర్సన్ ‘ ప్రతీ మానవ జీవితం భగవంతుని స్వహస్తాలతో వ్రాసిన
అద్భుత గాధ’ అన్నారు. మనస్సును మనసుతోనే జయించాలి. మన మనస్సులో దుర్గుణాలతో  పాటు కొన్ని సద్గుణాలూ ఉన్నాయి. మనలో దుర్గుణాల శక్తి ప్రభలితే పతనమవుతాము. సద్గుణాలను పెంచుకుంటూ మనస్సును సన్మార్గంలో నడిపించగలిగే అమృతమయ స్థితిని పొందుతాం. విశుద్దమైన బుద్ధితో చేసే స్వార్ధరహిత కార్యం యజ్నమే.మానవత్వానికి మరో పేరు సజ్జనత్వం. కోరికల నిషాలో వివేకం నశిస్తుంది. సన్మార్గంలో పయనించాలి. ఆత్మ భలాన్ని పెంచుకోవాలి. ఇతరులను దూషించటం, ద్వేషించటం, వారిలోని దోషాలను ఎత్తి చూపటం వీడాలి. సువాసన లేని పుష్పం , క్రియాశీలత లేని మాటలు ఎంత బాగున్నా వ్యర్ధమే. సద్గురు వచనాల శ్రవణంతో బాహ్యార్ధం, మననంతో అంతరార్ధం, ఆచరణతో పరమార్ధం బోధపడతాయి.
నీటిలో మొసలికి ఎంత బలం ఉంటుందో మనలోని అహంకారము, మకారములకు అంత బలం ఉంటుంది. వీటిని తొలగించుకోవటానికి సేవ,  భక్తి, ధ్యానము, విచారణ అవసరము. వాసనలు ఉన్నంతవరకు అవి మనస్సును తూట్లుపెడుతూ ఉంటాయి. వాసనల వేగం, అలవాట్ల యొక్క  వేగం చాలా బలీయమైనది. గురువు అనుగ్రహం లేనిదే ఒక్క చిన్న వాసన  నుండి కూడా బయట పడలేము. మనలో దేహబుద్ధిని నశింప చేసి ఆత్మబుద్ధిని ప్రసాదిస్తారు.
“బురద నేలల్లో ఇల్లు కట్టుకోవద్దు. రాతి నేల మీద కట్టుకొoడి” – ఏసు ప్రభు
బాగుపడే లక్షణాలను, దైవీ గుణాలను జీవితం పొడుగునా పెంచుకోవడమే అగ్నిహోత్ర కర్మ. ఆధ్యాత్మిక ప్రగతికి మన ప్రయత్నం నిజాయితీగా ఉండాలినిస్వార్ధమైన ప్రేమతో వారి పాదాలయందు దృష్టి నిలపాలి మన పవిత్రతతోనే మనం ఆయనకు దగ్గరౌతాము గురు అనుగ్రహం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు .అందుకునే అర్హత మనం సంపాదించుకోవాలి.
అర్జునా! నీవు అనసూయుడవు. అసూయ ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఆ ఒక్క మంచి గుణానికి పరమాత్మ అయిన నేను నీకు లొంగిపోయి భగవద్గీతను ఉపదేశిస్తున్నాను” అని పరమాత్మ చెప్పాడు.
“శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ” శ్రద్ధ వలన జ్ఞానo  కలుగుతుంది. ధర్మాచరణలో జీవించటమే జ్ఞానయోగం. సమర్పిత భావంతో జీవిస్తూ గురువు అడుగు జాడలలో నడవటమే భక్తి.  ఆత్మజ్ఞాన సముపార్జన (జ్ఞాన యజ్ఞం) కన్నా గొప్ప పని ఈ లోకంలో ఏదీలేదు.
లోక చింతన వద్దు. ఆత్మ చింతన చెయ్యాలి. ప్రాపంచిక సుఖం క్షణ భంగురం. ఎలా జీవించాలో దాన్ని అన్వేషించి అలా జీవిస్తే కృతార్ధులవుతాము. జీవితంలో అజ్ఞానమూతో పోరాటం సాగుతూ ఉంటే లోన దాగి ఉన్న ఆత్మ ప్రకాశించి ప్రకటితమౌతుంది.
“ఈనాడు ఆధునిక మానవునికి బుద్ధ భగవానుని హృదయం,
శంకరాచార్యుల  మేధా శక్తి, ఈ రెండూ అవసరం”- స్వామి వివేకానందా
హృదయాలను తెరిచినప్పుడే మనస్సులు తెరుచుకుంటాయి. మన సత్ప్రవర్తన వల్లే మనలో హృదయ సౌందర్యం పెంపొందుతుంది. మనిషికి వివేకమనే భీజం రావాలంటే దానికి సద్గురు అనుగ్రహమనే అమృతంలో నానబెట్టి, మొలకను గురు రక్షణ వలయంలో ఉన్నప్పుడే చెట్టు అయి  ఫలాలతో అలరారుతుంది.
మనం లోకుల కళ్ళతో చూస్తున్నాము. ప్రపంచాన్నిసద్గురువు దృష్టితో చూడాలి. జీవితాన్ని వ్యర్ధంగా గడపక జీవిత రహస్యాలను గుర్తించి పరివర్తన చెందిన వాడు ధన్యుడు. మనం ప్రకృతిని, ప్రకృతి గుణాలను దాటి వెళ్ళాలి.
“ యత వాక్కాయ మానస:” అంటే మాట, శరీరం, మనస్సు ఈ మూడింటిని మీకు జ్ఞానం కలిగేలాగ మీరు ఉపయోగించుకోవాలి. 
శ్రద్ధ ఉంటే  భక్తి పుట్టుకొని వస్తుoది సద్వస్తువును గ్రహించిన వాడు సత్పురుషుడు అని అంటారుమనం అజ్ఞానమనే సముద్రంలో సంసారం అనే సముద్రంలో ఉన్నాము  సముద్రంలో నుండి ఒడ్డుకు రావటానికి సద్గురువు మనకు సహకరిస్తారు.
ప్రహ్ల్లదుడు తండ్రితో అంటాడు, “ఓ తండ్రీ! నీ హృదయంలో గంగ ఉంది. ఆ గంగని త్రాగటం మానేసి ఎండమావులలో నీరు తాగుదామని పరిగెడుతున్నావా? అలాగే నువ్వు ఇంద్రియాల తోటి, మనస్సు తోటి అనుభవించే భోగాలలో సుఖం లేదు, శాంతి లేదు. నిజమైన శాంతి, సుఖం నీ హృదయంలో ఉంది. ఎక్కడో శాంతి సుఖం ఉందని వాటి కోసం బయట వెతుకుచున్నావు. అక్కడ ఉంటే కదా నీకు దొరకటానికి? ”
గురుబోధ శ్రవణం, మననము మరియు సత్సంగముల ద్వారా మనస్సు
ఎప్పటికప్పుడు పరిశుద్దమవుతుంది.  పరిసరాలలో ఉన్నప్పుడు మనకు భగవంతుని పట్ల భక్తి కలుగుతుందో శ్రద్ధ కలుగుతుందో  పరిసరాలలో జీవించటం నేర్చుకోవాలి  గురువు మాటను ప్రమాణంగా తీసుకొని తదనుగుణంగా జీవించటం నేర్చుకుంటే మనం ఒడ్డుకు వస్తాము.
లోక చింతన వద్దు. ఆత్మ చింతన చెయ్యాలి. ప్రాపంచిక సుఖం క్షణ భంగురం. ఎలా జీవించాలో దాన్ని అన్వేషించి అలా జీవిస్తే కృతార్ధులవుతాము. ఈ ప్రపంచాన్ని చూసి మోహ పడకండి. ఎలుకలు పట్టటం కోసం బోనులు ఎలా పెడతారో అలాగే ఈ జీవకోటి ఏదో ఒక ఆకర్షణలో పడటానికి భగవంతుడు ఈ లోకంలో అనేక ఆకర్షణలు పెట్టాడు. శ్రీపతి రూపాన్ని  ధ్యానం చేసుకొంటే ఆ బోనుల్లో పడకుండా మీరు రక్షింప బడతారు.
మనిషికి వివేకమనే భీజం రావాలంతే దానికి సద్గురు అనుగ్రహమనే అమృతంలో నానబెట్టి, మొలకను గురు రక్షణ వలయంలో ఉన్నప్పుడే చెట్టు అయి  ఫలాలతో అలరారుతుంది.
మనం లోకుల కళ్ళతో చూస్తున్నాము. ప్రపంచాన్నిసద్గురువు దృష్టితో చూడాలి. జీవితాన్ని వ్యర్ధంగా గడపక జీవిత రహస్యాలను గుర్తించి పరివర్తన చెందాలి. మనం ప్రకృతిని, ప్రకృతి గుణాలను దాటి వెళ్ళాలి.
“ యత వాక్కాయ మానస:” అంటే మాట, శరీరం, మనస్సు ఈమూడింటిని  జ్ఞానం కలిగేలాగ మనం ఉపయోగించుకోవాలి.
అర్జునుడు శ్రీ కృష్ణున్ని సారధిగా పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా మన
జీవితానికి సద్గురువుని సారధిగా పెట్టుకుంటే  మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, తరిస్తాం.
“God Realization leads to Self Realization” Baba Hardev Singh Ji Maharaj
రియలైజేషన్ పొందేవరకు సత్యాన్ని అసత్యంగా అనుకొంటాము. అసత్యాన్ని
సత్యంగా అనుకొoటాము. గురుబోధ శ్రవణం, మననము మరియు సత్సంగముల ద్వారా మనస్సు ఎప్పటికప్పుడు పరిశుద్దమవుతుంది.
ఆత్మజ్ఞాన సముపార్జన (జ్ఞాన యజ్ఞం) కన్నా గొప్ప పని ఈ లోకంలో ఏదీలేదు.
అజ్ఞానం అంతం అవటానికి, మోక్షం పొందటానికి గురువనుగ్రహం కావాలి. గురువుపై దృష్టిని నిలిపిన వారే సుఖంగా ఉంటారు. ఎవరి సాంగత్యంలో ఆత్మ పరివర్తన కలుగుతుందో వారే నిజమైన గురువులు. వారు దరిద్రానికి చలిoచరు. భాగ్యానికి పొంగరు. దయ, ఓర్మీ, స్వార్ధం లేని  ప్రేమతో, ఎవరినీ శత్రువుగా చూడక ప్రశాంతంగా స్థిరంగా  పరమాత్మలో నిమగ్నమై ఉంటారు. వారితో అనుబంధం కలిగి ఉండాలి. అప్పుడు అది జ్ఞాన హేతువు అవుతుంది.
పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుంది. శిష్యుడు గురువు పైనే నిరంతరం దృష్టిని నిలపాలి. గురు శక్తి సాగరంలో కలిసిపోవాలి.
వర్తమాన కాలంలో జీవించాలి. భగవంతుడు మనకు ఇచ్చిన అవకాశములను తప్పక ఉపయోగించుకోవాలి. వాయిదాలు వద్దు. భగవంతుడు మెచ్చే పనులు చెయ్యాలి. దైవమును ప్రీతితో, ప్రేమతో  స్మరిoచటం వలన అహంకారం నాశనమౌతుంది.  ప్రేమ తత్వం తెలిసిన వ్యక్తికి భక్తి తెలుస్తుoది. అటువంటి వ్యక్తి భగవంతున్ని ఆరాధిస్తాడు.
 “మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషుల సంశ్రయః ”అన్నారు శ్రీ ఆది
శంకరాచార్యులు. ఉత్కృష్టమైన మానవ జన్మ లభించిన మనకు తగిన సాధన మరియు  సత్పురుషుల సాంగత్యం అత్యంత ఆవశ్యకం. ఎలాగైతే కుళ్ళిన విత్తనం మొలకెత్తడానికి పనికిరాదో వికారాలతో కూడిన కలుషిత మనస్సు బ్రహ్మకారం చెందదు.
ఒక నదిని దాటటానికి ఒక వంతెన లేక పడవ ఎలాగైతే అవసరమో,ఈ సంసార సాగరాన్ని దాటి తరించడానికి సత్పురుషుల యొక్క అవసరం అంతే ముఖ్యం. సత్సాoగత్యంతో మోక్ష మార్గం సుగమం అవుతుంది.
దేవుడిగా మారే కళను గురువు ద్వారా నేర్చుకోవటమే జీవిత లక్ష్యం. తను 
ఎవరో తనకు తెలిపిన గురువుతో మనం కలిసి కదలాలి. గురువు అంటే సాధకునకు ఏ మాత్రం తెలియని దారులను చూపించే వాడని అర్ధం. మనం  ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళము. తాను ఎవరో తెలిసిన గురువుతో కలిసి కదలాలి. ఆత్మ వెలుతురు వైపు మన కళ్ళను తెరుచుకునే సాయం చేస్తారు.
ఎలాంటి వారు అమృతమయ స్థితిని పొందటానికి అర్హులో కఠోపనిషత్తు ఇలా
వివరిస్తుంది: ‘యస్తు విజ్ఞానవాన్ భవతి సమానస్క: సదా సుచి:
స తు తత్ పదమా ప్నోతి యస్మాద్ భూయోన జాయతే ‘(1.3-8)
ఎవడు సదా అప్రమత్తగా ఉంటాడో, ఎవడు మనోనియంత్రణ కలిగి ఉంటాడో ఎవడు సదా పవిత్రంగా ఉంటాడో అలాంటి వాడు అమృతమయ స్థితిని పొందుతాడు. 
ఈ సృష్టిలోని అశాశ్వతత్వాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటే ప్రాపంచిక వైభవం
పట్ల ఆశక్తి తగ్గుతుంది. చూస్తుండగానే దినదినము ఆయుషు నశిస్తుంది. యౌవ్వనం నశిస్తుంది. గడచిన రోజులు తిరిగి రావు. కాలం జగత్తును భక్షిస్తుంది సంపద నీటి తరంగాల లాగా చంచలమైనది. భగవంతుడే శాశ్వతుడన్న భావన  మదిలో స్థిరపడాలి. కాబట్టి “ఓ గురుదేవా ! నిన్ను శరణు పొందిన నన్ను దయతో కాపాడు” అని ఆర్తితో ప్రార్ధించాలి .

బాబాజీ జీవన సరళి భక్త కోటికి కరదీపిక. మన మధ్య నడియడుతున్న అట్టి మహాత్ముని స్పూర్తితో మనం జీవించి, తరిస్తే అదే మనము వారికి సమర్పించే గురు దక్షిణ. ఏ శిష్యుడైతే తన కర్మల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆచరణ ద్వారా తన గురువును ప్రపంచానికి పరిచయం చేస్తాడో అట్టి శిష్యున్నిగురువు ముల్లొకాలలో కీర్తివంతున్ని చేస్తారు.   



మానవుడు  తక్షణ కర్తవ్యం

మానవ జీవితం ఒక శోభాయాత్ర. ఈ జీవితాన్ని – ప్రపంచములో ప్రకృతితో కలిసి భగవంతుని వైపు సాగే పవిత్ర యాత్రగా మలిచేదే  ‘ఆత్మజ్ఞానం’. ముక్తిని , మోక్షాన్ని పొందాలంటే ‘ఆత్మజ్ఞానం’ ఒక్కటే మార్గం. ఇదే విషయాన్ని ఉపనిషత్తులు కూడా నొక్కి చెపుతున్నాయి. “జ్ఞానే నైవతు కైవల్యం” అంటే జ్ఞానం ద్వారానే కైవల్యం అని.

ఆత్మ గురించిన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం . ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా  తెలుసుకోవటమే జీవిత లక్ష్యం . అవినాశియైన భగవంతున్ని ఏ జ్ఞానంచే చేరుకొంటామో అదే అత్యున్నతమైన  జ్ఞానం.  

అన్ని బంధాలకు ముఖ్య కారణం అజ్ఞానం . స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానమే నిజమైన జ్ఞానం . భగవంతున్ని తెలుసుకొన్నవాడే అంటే అనుభూతిలో ఆయనను గ్రహించిన వాడు బంధాలనుండి విడివడుతున్నాడు .  మరణానంతరం కాదు , సజీవుడై ఉన్నప్పుడే అతడు ముక్తుడవుతాడుఅంటున్నారు శ్రీ శంకరులు.
జ్ఞానం ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే ఆరోపాన్ని తొలగించివేస్తుంది. యుగ యుగాలుగా మనమూ జనన మరణ చక్రంలో తిరిగివస్తున్నాం .జ్ఞానం వలన అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలిగితే ప్రాపంచ భ్రమ పోతుంది. ప్రపంచ భ్రమ పోతేనే పరమాత్మ దర్శనం కలుగుతుంది.  అనిత్యమైన  ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం చెందక, నిత్య వస్తువైన పరమాత్మలో ఎవడు మనసు నిలిపి వుంటాడో అట్టివానికే సుఖం.
 భోగలాలస  లేని నిర్మలమైన మనసే మోక్షమని వసిష్ట గీత బోధిస్తుంది.
మనస్సును సదా భగవత్ చింతనతో నింపివేయాలి. మనం లక్ష్యమయంగా అయిపోవాలి . మన దైవస్థితిని పొందాలి. స్మరణే ధనుస్సు ; ఆత్మ బాణం ; భగవంతుడే లక్ష్యంగా జీవించటమే  ఆధ్యాత్మిక ప్రగతి మార్గం .


అందుకనే భగవద్గీతలో  స శాన్తి మాప్నోతి నకామ కామీ  – భోగాలు కోరేవారికి శాంతి కలగదు – అని అంటాడు భగవానుడు.
చావు పుట్టుకల చక్రభ్రమణంలో సగటు జీవి కొట్టుకుపోతుంది. అనంతమైన ఈ యానంలో అలసిన జీవిని శాశ్వత విశ్రాంతిని ఇచ్చేది ముక్తి. అది భగవంతుని కృపా కటాక్షం వలనే కలుగుతుంది.
 శరణాగతే మోక్షపురికి సింహ ద్వారము. 

ముక్తికి మూలం జ్ఞానం. జ్ఞానం వలన శాంతి చేకూరుతుంది. ప్రేరణాదాయకమైన  జీవితాన్ని గడపగలము. మనలోని మానవత్వం, దివ్యత్వం పరిమళిస్తుంది.
“ దుర్లభం  త్రయమే వైతత్  ,
మనుష్యత్వం  ,ముముక్షత్వం ,
మహాపురుష సంశ్రయం
దైవానుగ్రహ హేతుకం   ”
శంకరాచార్యులవారు -వివేక చూడామణి 
మానవ జన్మ, మోక్షం పొందాలనే జిజ్ఞాస కలగటం , సాధు సాంగత్యము లభించటం దుర్లభం . ఇవి భగవంతుడి అనుగ్రహం వలననే ప్రాప్తిస్తాయి . కనుక మనకు లభించినటువంటి ఈ సౌభాగ్యాన్ని, వివేకంతో  మెలిగి జీవిత లక్ష్యాన్ని సాదించాలి .
                                                                                                                    


పూజ్య మాతాజీ- జీవన దర్శనం

       
పూజ్య మాతాజీ వారి యొక్క పేరు సవిందర్  కౌర్ జీ. వారు ఇద్దరు తండ్రులు మరియు తల్లుల ప్రేమను పొందిన భాగ్యశాలి. వీరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు హర్యానా రాష్ట్రములోని యమునా నగర్ కు చెందిన  మాతా అమృత్ కౌర్ జీ మరియు మన్మోహన్ సింగ్ జీ. వీరి పాలనా పోషణ ఉత్తర ప్రదేశ్ వాస్తవ్యులైన మాతా మదన్ జీ మరియు గురుముఖ్ సింగ్ ఆనంద్ జీ వద్ద జరిగింది. వీరు శహన్ షా బాబా అవతార్ సింగ్ జీ వారి యొక్క పరమ భక్తులు.
పుజ్యమాతాజిగారు మసూరిలో విద్యాభ్యాసము చేసిరి. వీరు తమ తల్లిదండ్రులనుండి గురుమత్ అనుసారము జీవించే కళను నేర్చుకొన్నారు.
వీరి వివాహము  బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ తో 14నవంబరు 1975 వ సంవత్సరములో సద్గురు బాబా గురుబచన్ సింగ్ జీ మహారాజ్ మరియు పరమ పూజ్య రాజమాతాజీ వారి సమక్షములో జరిగింది. వీరు తమ సంతానమైన సమతాజీ, రేణుకాజీ మరియు సుధీక్షాజీ లను మంచి విద్యాబుద్ధులతో తీర్చిదిద్దారు.  
మొదటి నుండి పూజ్య మాతాజీ మరియు  బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు, బాబా గురు బచన్ సింగ్ జీ మరియు రాజ మాతాజీ వెంట భారత దేశము మరియు విదేశాలలో ప్రచార యాత్రకు వెళ్లేవారు. 1980 వ సంవత్సరములో బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారు పీఠాన్నిఅదిష్టిoచినప్పుడు, పరమపూజ్య రాజ మాతాజీతో పాటు వీరు కూడా వేదిక మీద ‘త్రివేణి’ రూపములో  ఆశీనులయ్యారు. అప్పటి నుండి వీరిని ‘పూజ్య మాతాజీ ’ గా పిలువబడుతున్నారు. నాటి నుండి నేటివరకు సద్గురుబాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి అడుగులో అడుగు వేస్తూ ప్రచార యాత్రలలో చురుకుగా పాల్గొంటున్నారు.
నేడు పూజ్య మాతాజీ అనేక విధాలుగా మిషన్ యొక్క ప్రచార ప్రసారాలలో వారి అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. ‘వాయిస్ డివైన్’(Voice Divine)  మరియు ఆధ్యాత్మిక సందేశాల ద్వారా సాధు మహాపురుషులకు, ప్రత్యేకించి యువతకు ఆశీర్వాదము మరియు మార్గదర్శకత్వం చేస్తున్నారు.
సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి ప్రచార యాత్రలను పర్యవేక్షించటంతో పాటు భక్తుల యొక్క భావనలను వినడమే కాకుండా వారి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తుంటారు. భక్తుల  గృహాలలో జరిగే వివాహాది మరియు పిల్లల నామకరనోత్సవాలలో పాల్గొనటమే కాకుండా వారికి తగిన సూచనలను కూడా ఇస్తూ ఉంటారు.
మిషన్ యొక్క సామాజిక సేవలు, ప్రచారణ విభాగము, పత్రిక విభాగము మరియు అంతర్జాల (Internet) విభాగాలను సమన్వయ పరుస్తున్నారు. రక్త దాన శిభిరం, సహనం(Tolerance) నినాదంతో చేపట్టిన బైకు ర్యాలిలు, నిరంకారి అంతర్జాతీయ సమాగం(NIS), వార్షిక నిరంకారి సమాగం(డిల్లీ), ప్రాంతీయ సమంగాల నిర్వాహణలో పూజ్య  మాతాజీ తమ అమూల్యమైన సేవలను అందిస్తారు.
నిరాకారున్ని ఎల్లప్పుడూ స్మరించటం అత్యంత ఆవశ్యకమని వీరు తరచు తెలుపుతుంటారు.
భవిష్యత్తు పిల్లలదే. వారి భవిష్యత్తును పరిరక్షించటానికి వారి పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి శాయశక్తులా  కృషి చేయాలని, అప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుoదనేది పూజ్య మాతాజీ వారి అభిప్రాయము.
పూజ్యమాతాజీ వారి అనేక స్పూర్తినిచ్చే సూక్తుల్లో (Quotations) ఒకటి
“There is little difference in the people that makes a big difference. The little difference is attitude. The big difference is whether it is positive or negative.”
భావము: మనుష్యుల మధ్య ఉన్న తేడా చిన్నదే. ఆ చిన్న తేడానే పెద్ద తేడాకు కారణభూతమవుతుంది. చిన్న తేడా ‘దృక్పదం’. పెద్ద తేడా ‘ఆశావాదమా’ లేదా ‘నిరాశావాదమా’.
“काम करो ऐसा के पहचान बन जाए I
हर कदम ऐसा चलो के निशान बन जाये I
यहाँ जिंदगी तो सब काट लेते है I
ज़िन्दगी ऐसे जियें के मिसाल बन जाए III ”
కర్మలు వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచాలి
ప్రతి అడుగు లక్ష్యం వైపే పడాలి
జీవనం ఇతరులకు స్పూర్తినివ్వాలి.
నేడు పూజ్య మాతాజీ మిషన్ యొక్క ప్రతి కార్యములో చురుగ్గా పాల్గొంటూ సద్గురు మానవాళి కొరకు చేసే పరోపకార కార్యములో గొప్ప తోడ్పాటును అందిస్తునారు. బాబాజీ యొక్క దైనందిక అవసరాలతో పాటు ప్రచార యాత్రలు మొదలైన వాటిలో అత్యంత జాగురూకతతో క్రియాశీల పాత్రను పోషిస్తున్నారు.
వినయము, దాస భావన వీరి సహజ ఆభరణాలు. ఒకసారి ఆసుపత్రిలో ఉన్న రోగులను పరామర్శించి పండ్లను పంచుతున్నారు. నిరాడంబరమైన దుస్తులను ధరించి ఉన్న వారికి, రోగులు ప్రేమ మరియు గౌరవపూర్వకంగా చరణాలకు నమస్కరించటం అక్కడవున్న డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది గమనించారు. పండ్లు పంచటం పూర్తవగానే ఆసుపత్రి బయటకు వెళుతున్న పూజ్య మాతాజీని అక్కడున్న ఒక డాక్టర్ వారి వద్దకు వెళ్ళి,” మీకు అందరూ అంత ప్రేమ, నమ్రతతో నమస్కరిస్తున్నారు. మీరెవరు?” అని వినయ పూర్వకంగా ప్రశ్నించారు. దానికి సమాధానంగా, “ నేను నిరంకారి బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి శిష్యురాలను”అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. సాక్షాత్తు సద్గురు యొక్క సతీమణి అయినప్పటికీ ఆ విషయం తెలుపకుండా తనను ఒక శిష్యురాలిగానే ప్రకటించుకొన్నారు.
ప్రేమమయి మరియు పరోపకార పూజ్యమాతాజీ పూర్తి ఆయురారోగ్యాలతో ఈ విధముగానే సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి అడుగులలో అడుగులు వేస్తూ మిషన్ యొక్క సత్య ప్రచారములో ముందుకు వెళుతూ మరియు సాధు మహాపురుషులకు తమ దివ్య ప్రేమను అందిస్తూ ఉండాలని ఆ నిరాకారున్ని ప్రార్ధిస్తున్నాము.
మన శిరస్సుపై ‘పవిత్ర త్రివేణి ’ యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండుగాక!      
                       నరేంద్ర పాల్ సింగ్ నూర్ జీ (Tracy U.S.A)

                                              వారి సౌజన్యంతో (BBM)

*****************************          దృడ విశ్వాసం

లక్ష్య శుద్ధిలేకుండా లక్ష్య సిద్ది జరగదన్నది పెద్దల మాట”.
సంసారికైనా , సన్యాసికైనా ఆశించదగ్గ ఏకైక బ్రహ్మపదార్ధం భగవంతుడే !
ఆధునిక ప్రపంచంలో లౌకిక జీవనం  చేసే మానవులకు ఈ విషయాన్ని పదే పదే గుర్తుచేస్తున్నారు మహనీయులు.  ‘నేను – నాది’ అనే భ్రమను వీడమంటున్నారు.  స్తితప్రజ్ఞ్యతను ప్రతిపాదిస్తున్నారు. సుఖానికి పొంగిపోతూ , దుఖానికి కుంగిపోతూ, రోగాలకు చలి౦చిపోతూ  , చావంటే వణికిపోతున్న మనకు మార్గదర్శకత్వం చేస్తున్నారు.
సదా భగవంతుని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి . సంపద , పలుకుబడి , అందం , అధికారం  , హోదా వంటి ప్రలోభాలకు దాసుడుకాక ఆత్మ సాధన కోసం నిజాయితీగా  ప్రయత్నించాలి. సద్గురు పట్ల గల భక్తి , విశ్వాసాల ద్వారానే దైవాన్ని సార్ధకం చేసుకోగలం . సద్గురు పట్ల దృడ విశ్వాసం సాధకునికి ఉండటం అత్యంత ఆవశ్యకం .
హోమపక్షి ఎప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంది. దానికి ఆహారం ఆకాశంలో దొరకదు కాబట్టి , భూమి మీద ఆహారాన్ని స్వీకరిస్తుంది. కాని, కాళ్ళు భూమిపై  మోపదు. అది గుడ్లు కూడా భూమిపై పెట్టదు . ఆకాశంలో ఎగురుతూనే  గుడ్లు జారవిడుస్తు౦ది. గుడ్డు భూమిపైకి జారేలోగానే దాన్నుంచి  పిల్లపక్షి బయటకు వస్తుంది . పిల్ల అలా  కిందికి జారుతున్న సమయంలోనే రెక్కలు మొలుచుకొస్తాయి.  పక్షి పిల్ల లక్ష్యం తన తల్లిని చేరటమే ! రెక్కల్ని అల్లాడించి పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది . నెమ్మదిగా తల్లిని కలుసుకోవడమనే  లక్ష్యాన్ని సాధిస్తుంది.  భగవంతుని చేరాలనే లక్ష్యాన్ని  భక్తుడు అలా సాధించుకోవాలి.

            .................
                                జీవితాదర్శం
 “ప్రతి వ్యక్తి ప్రగతి అతని జీవితాదర్శంలో ఉంటుంది” అంటారు మహాత్ములు. ఒక వ్యక్తి  ఎలా రూపొందాలని అనుకుంటాడో, దేన్ని పొందాలని కోరతాడో అందులోనే అతని ప్రగతి ఉంటుంది. ఏ విధంగానూ రూపొందాలని అనుకోని వ్యక్తీ, దేనినీ పొందాలని కోరని వ్యక్తి చైతన్యరహితుడు , నిర్జీవి.
సద్గురువు కన్నా పరమాత్మ కన్నా తక్కువ   స్థాయికి చెందినది అసలు ఆదర్శమే కాదు.
“శాశ్వత దుఃఖ నివృత్తికి అద్వైతానుభావమే తరుణోపాయం” శంకరాచార్యులు.
సద్గురు  బ్రహ్మం యొక్క సత్యత్వం గురించి, జీవాత్మ పరమాత్మల అభేదత్వం గురించి, బంధ మోక్షాల గురించి వివరంగా తెలియ జేస్తారు.
మన ఆశయాలను ఎక్కడ ఉంచాలన్నది  మన చేతుల్లో ఉంది. ఉన్నత స్థాయిలో ఉంచగోరితే మన జీవన ధార ఎగువకు ప్రవహిస్తుంది. నిమ్న స్థాయిలో ఉంచగోరితే మన జీవనధార దిగువకు ప్రవహిస్తుంది. మన ఆదర్శం ఎక్కడ ఉంటే మన ప్రగతి అక్కడ ఉంటుంది.
ఏ దిశలో స్మృతి పరుగు తీస్తే ఆ మార్గంలో ఆలోచనలకు భీజారోపణ జరుగుతుంది. ఆలోచనలే ఆలోచనలకు బీజం. నేటి ఆలోచన రేపు అనుకూల సందర్భంలో అంకురించి ఆచరణగా పరిణమిస్తుంది. కనుక మనo విలువైన  ఆదర్శాన్ని ఎంపికచేయడమే జీవితంలో అన్నింటికంటే ముఖ్య అంశం.  రామ రావణ యుద్ధ సమయంలో విబీషణుడు అన్న రావణాసురుడిని వదిలేస్తాడు. ధర్మం కోసం దుర్మార్గుడిని వదిలేయటం మంచిది అనుకొని
అన్నగారిని వదిలేస్తాడు.
గురువు ప్రేమలో స్వార్ధం లేదు. హ్యూమన్ లవ్(human love) తో ఉన్న వారికి డివైన్ లవ్ (divine love) నేర్పుతారు. మన మనస్సులో ఉన్న బలహీనతల నుoడి విడుదల పొందటానికి గురువు సహాయం అవసరము.
“ మీకు ఎంత చదువు ఉన్నా, ఎన్ని యోగాభ్యాసాలు చేసినా, ఎంత నిష్కామ కర్మ చేసినా అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా మీకు స్వరూప జ్ఞానం కలుగదు ‘అని శుక మహర్షి తెలిపారు.
गुरु बिनु भवनिधि तरही न कोई
जो बिरंचि संकर सम सोई
అనగా గురువు లేకుండా, గురువు యొక్క సహకారం లేకుండా భవసాగరమును దాటడం అసంభవం. బ్రహ్మ, శంకరులకు  కూడా గురువు యొక్క అవసరం ఏర్పడింది.
సద్గురువు అనే జ్ఞాన భాస్కరుని వెలుగులో పయనిస్తూ ఉన్నత జీవిత శిఖరాల వైపు మన దృష్టి సారించాలి.  మన సద్గురువు మనకు బహుకరిoచిన  ఆధ్యాత్మికతను గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి. అది మన మొదటి కర్తవ్యo.
“ఈశ్వరార్పితంనేచ్చయాక్రుతం
చిత్త శోధకం ముక్తి సాధకం ”- రమణ మహర్షి
ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధం కావించి ముక్తికి సాధనమవుతుంది.
స్వామి వివేకానంద “మీరు ముత్యపు చిప్పలా కావాలి. స్వాతిబిoదువు పడటంతో అది వెంటనే మూసుకొని సముద్ర గర్భాన్ని చేరి ఆ నీటి బిందువు ముత్యంలా ఎదిగే వరకు ఓపికగా ఉంటుంది. మనమూ అలా ఉండాలి.  మొదట వినండి, తరువాత గ్రహించండి, పిమ్మట తొణకకుండా బాహ్య ప్రభావాలు పడకుండా మనస్సును నిగ్రహించుకొని మీలోనున్న సత్పదార్ధాన్ని వికసింప చేసుకోవడానికి కృషి చేయండి.”
హనుమంతుడు గురుభక్తిలో శ్రేష్టుడు. సంశయరహితమైన  గురు భక్తి- ఇదే హనుమంతుని విజయ రహస్యము. రామసేవలో తన ప్రాణాలను సైతం నిస్సంశయంగా సమర్పిoచగల సాహసం, ఇతర విషయాలన్నిటి పట్ల ఔదాసీన్యం, రాముని ఆజ్ఞా పాలనమే జీవన ప్రతిజ్ఞ. అట్టి సంపూర్ణ శ్రద్ధ నేడు కావాలి.
మన అల్పతర సత్యమునుండి గురుతర సత్యము వైపుగా నడవాలి. బహుజన్మ సుకృత విశేష వసమున మానవుడు పరిపూర్ణ బోధ నెరుగు యత్నించి గురువు వద్ద చేరి జ్ఞానవంతుడవుచున్నాడు. అట్టి వివేకి నిజబోధనలను గ్రహించి  పరిపూర్ణ స్తితిని పొందగలడు.
భ్రాంతియను నుసి ఊది పోగొట్టే జ్ఞానాగ్నిని ప్రజ్వలింప జేయువారు సద్గురువులు.  సద్గురు కృపచే నిజబోధామృతము గ్రోలిన వానికి ఇతర సాధనల ఆవశ్యకత ఉండదు.
గురువు అంటే సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఎన్నో జన్మలనుoడి వస్తున్న వాసనలను మనలో నుoడి బయటకు లాగి వాటిని కాల్చి బూడిద చేసి మన హృదయాన్ని జ్ఞానంతో, కాంతితో, ఆనందంతో నింపుతాడు.
దత్తత్రేయుడు “ఉత్తమమైన మానవ జన్మ లభించటం, పిమ్మట సద్గురువు లభించటం, అతి సద్గురువు పట్ల సజీవ విశ్వాసo కలిగి ఉండటం, గురుబోధ శ్రవణం చేసి దానిని ఆచరించడం ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన సత్కర్మల యొక్క పుణ్య ఫలమే.”
ప్రహ్లాదునికి శ్రీహరి పై, హనుమంతునికి రామునిపై ఉన్నదే శ్రేష్టమైన భక్తీ. గురు భక్తే వానరున్ని హనుమంతున్ని చేసింది. సీతాన్వేషనే జ్ఞానాన్వేషణకి ప్రతీకగా నిలిచింది. భగవంతునకు లేక గురువుకు పూర్తిగా తన్ను తానూ అర్పిoచుకోవటమే శరణాగతి. శరణాగతే నిజమైన ప్రార్ధన.
మనలను గురువు నడిపిస్తున్నాడు అనే స్పూర్తి గురుమంత్రం కన్నా గొప్ప శక్తినిస్తుంది. గురు ప్రార్ధన మనకు, మన మనస్సుకు వారధిగా నిలుస్తుంది.  గురువే పుణ్య క్షేత్రం. పాపాలను కడిగే అమృత సరస్సు. దానితో జీవితలక్ష్యం చేరి సుఖిస్తాము.
బాబాజీ మనకు బోధించినది సత్య మార్గం, సూటి మార్గం మరియు ప్రత్యక్ష మార్గం. భక్తి గురించి బోధించి, జ్ఞానామృతాన్ని పంచి, ఆత్మస్వరూపాన్ని దర్శింప చేసి మంచి మార్గంలో నడిపిస్తారు. స్మరణ వలన మాత్రమే మనం పవిత్రుల అవుతాం.
మనస్సు చంచలత్వం లేకుండా ఉంటేనే పరమాత్మ అందులో  ప్రతిబంభిస్తాడు. గురుకృపతో పొందిన విశాల దృష్టి  మనస్సును వాసనలకు దూరo చేస్తుంది. భావ శుద్ధి, మానసిక శుద్ధి కలుగుతుంది.  ఈ శరీరం భూమి మీద తిరుగుతున్నప్పుడే మన హృదయంలో కళ్యాణగుణాలు సొంతం చేసుకొని  చావులేని సద్వస్తువును అనుభవంలోకి తెచ్చుకోగలం. స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తాము.
                                                                                                                                రాధ జీవుడు. కృష్ణుడు దేవుడు. రాధ కృష్ణుణ్ణి ఎలా ప్రేమిoచిందో అలా మనం కూడా భగవంతున్ని ప్రేమిoచగలిగితే ఈ లోకం నిన్ను గుర్తించక పోయినా పరమాత్మ నిన్ను గుర్తిస్తాడు.
ఒకసారి నారడుడు రామునితో, “ రామా నీ పాదాలయందు భక్తిని ప్రసాదించు” అన్నాడు. అలాగే ఇస్తాను ఇంకా ఏమైనా కావాలా? ”అని అడుగుతాడు. ఈ ప్రపంచం అoతా నీ మాయ. ఇదంతా నీ కల్పితం.ఈ ప్రపంచం అనేక  ఆకర్షణలు ఉన్నాయి. నీ మాయలోఎక్కడ పడిపోతానో అని భయంగా ఉంది. ప్రపంచంలో ఉన్న ఆకర్షణలలో, నీ మాయలో పడకుండా చూడు. ఇదే నా మొదటి కోరిక. నా చివరి కోరిక కూడా అదే.”  
అనన్య భక్తుడు గురుదేవునితో “ ఓ తండ్రి! నీవే సాకార దేవుడవు. నా తప్పులెంచకు, చేయి విడువకు,” అని ఆర్తితో ప్రార్ధిస్తాడు. ఇదే మహోత్కృష్టమైన ప్రార్ధన.
సద్గురువు కంటే మన క్షేమం కోరే వారు ఎవరూ ఉoడరు. ఆయన చెప్పిన వ్యాక్యాన్నిప్రమాణంగా తీసుకొని మనం జీవించాలి. సద్గురుని దయను సంపాదిస్తే అన్ని సాధ్యమే. మోక్షం కూడా దానంతట అదే వచ్చి వరిస్తుంది.
గురువు అంటే చీకటిని పోగొట్టే వాడు. సూర్యుడు బయట చీకటిని పోగొడతాడు. గురువు మన లోపల చీకటిని పోగొట్టి మన స్వరూపాన్ని మనకు తెలియచేస్తాడు. ఆయన వాక్కులే మనకు శ్రీ రామ రక్ష మరియు మేలుకొలుపు.

శిష్యుడు గురువుతో మానసిక అనుబంధం కలిగి ఉండాలి. జాలరి చేపల కోసం వల
వేసినప్పుడు వాడి పాదాల దగ్గర ఉన్న చేపలు వలలో పడవు. అలాగే భగవంతుని పాదాలను ఆశ్రయించిన వాడు  మాయ అనే వలను తప్పించుకోగలడు. 
ఈశ్వరానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. మీ హృదయాన్ని జ్ఞానంతో, ఆనందంతో, శాంతితో నిoపేది సద్గురు దయ. సద్గురు దయ ఉంటేనే మాయ దారి ఇస్తుంది.
గురువుంటే ఒక వ్యక్తి కాదు. సాక్షాత్తు బ్రహ్మమే! అందుకే గురు సాక్షాత్తు పరబ్రహ్మా అంటారు. గురువు అనుగ్రహ స్వరూపుడు. ఉపనిషత్తు సారాన్ని జీవించి చూపిస్తారు. జననమరణ ప్రవాహం నుండి మానను రక్షించే ఘన వైద్యుడు గురువు. అట్టి గురువు యొక్క కృప లేకుండా ఆత్మ జ్ఞానం కలుగదు, నిలువదు.
సద్గురువు పట్ల నిజమైన ప్రేమ దేహేoద్రియ, మనోబుద్ధులతో మనకు ఉన్న తాదాత్మ్య దోషాన్ని నిర్మూలిస్తుంది. సాధన చేయగా చేయగా భగవంతుడే సత్యమని, మిగిలినది అంతా అసత్యమని బోధపడుతుంది. సద్గురువును త్రికరణ శుద్దిగా సేవిస్తే ముక్తికి మార్గం సులభమవుతుంది.
స్వామి వివేకానందా తెలిపినట్లుగా ’ప్రతి రోజూ నా జీవితాన్ని మలచేది నేనే’. గురుప్రేమతో తేలిపోతూ ఉంటే కర్మగతి ఆతీ గతీ లేకుండా కొట్టుకు పోతుంది. ‘ఓ గురుదేవా ! నేను నీ చేతిలో ఉపకరణాన్ని మాత్రమే. నీవు నాతో ఏమి చేయిస్తే అది చేస్తాను ’ అని ప్రార్ధించాలి.
కర్మ యోగికి విశ్వాసముంటుoది, భక్తి యోగికి శరణాగతి ఉంటుంది, జ్ఞానయోగికి విచక్షణ ఉంటుంది, గురుమార్గంలో చరించే గురుశిష్యునికి పరబ్రహ్మ స్థితి ఉంటుంది.
జ్ఞాన మిశ్రమ భక్తి శ్రేష్టమైనది. భక్తి పూరిత జ్ఞానమే మనిషిని మనీషిగా మార్చగలదు.                                                                                         
                      సాంగత్యంలో నేను

సాంగత్యానికి వచ్చాను , కాని బయటే కాసేపు గడిపాను
ముందే వచ్చి కూర్చుంటే , నా ప్రచారం జరగదనుకున్నాను
అందుకే ఆలస్యం చేసాను  , కొంచం సమయం గడిచాక వచ్చాను
సెక్రటరీని చూసాను
సెక్రటరీని చూసాను
సెక్రటరి నన్ను చూసి నవ్వేవారు కానీ
అవకాశం వేరే వారికి ఇచ్చేవారు
అవకాశం వేరే వారికి ఇచ్చేవారు
సెక్రటరి ని చూస్తే వచ్చేది నవ్వు , కానీ
వేరే వారి పేరు పిలిస్తే గుండె మండేది జివ్వు
మాట రాని వారు పాడుతున్నారు పాట,
కానీ నేను ఆలోచిస్తున్నాను  నా పేరు ఎందుకు రాలేదట ?
సమయం గడిచింది మంగళాచరణం పాడారు
కానీ నాకు మాత్రం సెక్రటరీ కళ్ళ ముందే కదిలారు
కానీ నాకు మాత్రం సెక్రటరీ కళ్ళ ముందే కదిలారు
పీఠం మీద మహాత్ములు అద్భుతంగా చెపుతున్నారు
నేను మాత్రం సాంగత్యానికి ఎందుకు వచ్చానని అనుకున్నా
సాంగత్యం అవ్వగానే వెళ్లాను ఇంటికి,
కానీ సెక్రటరీ మాత్రం కనబడుతున్నారు   కంటికి
కొంచమే తిన్నాను – కలత నిదురలోకి జారుకున్నాను
కానీ నిద్రలో జరిగింది ఒక చమత్కారం,
కలలో జరిగింది కనిపించింది గురు అవతారం
(గురువు అంటున్నారు)
“ మహాత్మా నా  పేరు రాలేదని పడుతున్నావా బాధ ?
  అయితే నీవు నిరంకారీవి కావా ?
  అయితే నీవు నిరంకారీవి కావా ?
     ఇతరులకు వినిపి౦చటమే కాదు భక్తి,
     నేను లేకు౦డా నీకు లేదు  ఆ శక్తి .”
  గురువు నన్ను ‘మహాత్మా ’ అనేసరికి పులకరి౦చిపోయాను
   కానీ సిగ్గుతో తల ది౦చుకున్నాను.
 గురు మాట విన్నాను  , తప్పు తెలుసుకున్నాను
  ఎవరు చెప్పాలి , ఎవరు పాడాలి, ఎవరు మాట్లాడాలని
   నిర్ణయించేది లేదు మన చేతిలో
   అది జరిగేది కేవలం గురు కృపతో
   అది జరిగేది కేవలం గురు కృపతో
ఈ సంసారం ఒక మిధ్య
సాంగత్యం అనేది మన పరిస్థితిని కాదు
మన ‘మన స్థితిని ’ మార్చేదని తెలుసుకోవాలి అంతా!
                     --------------------------------     
  
                ఆంతరంగిక సౌందర్యం    
                
 సంస్కృతంలో నైతిక విలువలనే ధర్మం అంటారు. విలువలు పాటించకపోతే , నీకు దుఃఖం కలుగుతుంది. మనస్పూర్తిగా నమ్మగలిగితే , మరో ఆలోచనలేకుండా  మీరు దాన్ని పాటిస్తారు. విలువల యొక్క విలువను గుర్తించినప్పుడు మీ పట్ల మీకే గౌరవ భావం , విలువ కలుగుతాయి. బయట పది మంది మీకు గౌరవం ఇవ్వటం కన్నా ముందు మీ పట్ల మీకు విలువ ఉందా అని బేరీజు వేసుకోవటమే అతి ముఖ్యం. అలాకాకుండా మనకు అవకాశం దొరికింది కదాని మనలోని విలువలను మార్చుకుంటూ పోతే, మన వ్యక్తిత్వంలో అగాధం ఏర్పడుతుంది. తద్వారా సంఘర్షణ , ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురి కాక తప్పదు.

వెలుగునివ్వటం ఒక్కటే దీపం పరమార్ధం కాదు . మరిన్ని దీపాలను వెలిగి౦చటం కూడా.
మామిడిపండును ఇవ్వటం ఒక్కటే మామిడి చెట్టు కర్తవ్యం కాదు. మొలిచే టెంకలను , అంట్లను ఇవ్వడం కూడా.  అలాగే ధర్మాన్ని తన వరకే పరిమితం చేసుకొని , ఎవరు ఎలా పోయినా నేను మాత్రం ధార్మికంగా ఉన్నానా ? లేనా ? అని సరిపెట్టుకు౦టే పొరపాటే.  ఈ ధోరణి వలనే ధార్మికులు క్షీణిస్తున్నారు . ధర్మం క్షీణిస్తుంది . ధర్మం పట్ల కనీస అవగాహన కూడా క్షీణిస్తు౦ది.   

మనసులో ఉన్న గుణాలు మారాలంటే బాహ్యమైన వాటిని మార్చటం వలన ఏమి లాభం ఉండదు. లోపల అంతరంగికంగా మనసులో మార్పు సంభవించనంత వరకు బాహ్య ప్రపంచంలో ఏ మార్పులను చూడలేము. అందుచేత మహాపురుషులు గొప్ప గొప్ప వారంతా ముందు అంతరంగిక సౌందర్యం పెంచుకున్నారు తప్ప బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే అంతరంగికంగా నా గుణాలపై నేను విజయాన్ని సాధించగలుగుతానో బాహ్య ప్రపంచంలో నేను చేసే ప్రతి పని విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇది అవతార పురుషులు తమ జీవితం ద్వారా వ్యక్తపరచినటువంటి , జీవించినటువంటి జీవన విధానము. సద్గురువు అందుచేతనే మన లోపల గుణాలను ఏవైతే ఉన్నవో దానిని పరివర్తనం తెచ్చుకోమంటున్నారు. అ పరివర్తన కూడా మన బాహ్య ప్రపంచంలో కూడా మార్పులను చూడటానికి దోహదపడుతుంది. “ దృష్టిని బట్టి సృష్టి ” . ఈ మార్పు నా జీవితం అంతటిలోను వెలుగు నింపుతుంది. ఇతరులకు కూడా ఆ వెలుగును నింపటానికి , పంచటానికి కూడా ఒక గొప్ప సదవకాశం ఏర్పడుతుంది. నాకు పవిత్రమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే , పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

ఈ రోజు మనిషి సదా తనకు లేని దాని గురించి ఆలోచిస్తున్నాడు తప్ప తనకు భగవంతుడు ఇచ్చిన దానిని ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచన మాత్రం మానవునిలో లేకుండా పోయింది. ఈ రోజు మానవుడు  దుఃఖంలో ఉండటానికి కారణం సుఖాన్ని భవిష్యత్తులో వెదుకుకోవటం. నేను ఆనందాన్ని భవిష్యత్తులో వెదుకుతున్నాను తప్ప నేనే ఆనంద స్వరూపుడను . నేను ఉన్న చోట ఆనందం ఉన్నది అనే విషయాన్ని మరిచాడు. ఎందుకంటే అన్నిచోట్ల పరమాత్మ ఉన్నాడని విశ్వసించినప్పుడు భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంది అని నమ్ముచున్నప్పుడు నాకు దుఃఖమన్నది రావటానికి ఆస్కారం లేదు. వెలుగు ఉన్న చోట చీకటికి ఎలా ఆస్కారం ఉండదో ఆ రకంగా భగవంతుడు ఉన్న చోట దుఃఖానికి , కష్టానికి ఆస్కారం ఉండదు. ఎవరైతే ఆ విశ్వాసంతో ఉంటారో అటువంటి వారికి దుఃఖమే దగ్గరకి రాదు. ఎందుకంటే అంతా భగవంతుడే . ఏది చూసిన అంతా పరమాత్మ  స్వరూపమే . అంతా బ్రహ్మమే. పవిత్రమైన హృదయం లోనే పరమాత్మ నివాసం ఏర్పరచుకుంటాడు. ఎక్కడైతే పవిత్రత , స్వచ్చత ఉంటుందో అటువంటి హృదయంలో పరమాత్మ నివాసం ఏర్పరచుకుంటాడు. ఆయన నివాసం మనకు ఆనందం ఇవ్వటానికి గల కారణం.

అ పవిత్రతను పొందటానికే సాంగత్యం చేయాలి  . ఎందుచేతనంటే బాహ్యమైన ప్రపంచంలో మనం సంచరిస్తున్నాం . కాబట్టి నా మనసుకి తెలిసో , తెలియకో మలినాలు అంటుకోవటానికి ఆస్కారం ఉంది. కొన్ని తెలిసి తెచ్చుకుంటాము. కొన్ని తెలియక ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అవి నా మనసులో ప్రవేశించటానికి ఆస్కారం ఉంది. శుభ్రత , ప్రశాంత వాతావరణం ఉన్నచోటే సాంగత్యం జరుగుతుంది. మన మనస్సును  పరమాత్మపై  యోగం చేయగలుగుతాము. అలాగే నా హృదయంలో కూడా అంత పవిత్రత ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఉంది. బాబాజీ సాంగత్యానికి ఎందుకు రమ్మంటున్నారంటే మనకు తెలిసో తెలియకో వచ్చే మలినాలను సత్సంగమునకు వచ్చి సత్యమైనటువంటి వాక్కులను  శ్రవణం చేయుట వలన లోపల ఉన్న మలినాలు తుడిచి వేయవచ్చు. ఆ మలినాలు ఎప్పుడైతే నా నుండి దూరమగునో మళ్ళీ నేను ప్రశాంతతను సంతరించుకుంటాను. పవిత్రతను ఆపాదించుకోవటానికి ఆస్కారం ఉంటుంది.

‘ పవిత్రత పెరగటానికి దోహదపడేటటువంటిదే నిజమైన భక్తి . పవిత్రతతో జీవించేటటువంటి వాడే నిజమైన భక్తుడు’ అని మనకు మహాత్ములు చెబుతున్నారు. అలాంటి భక్తిని ఈ రోజు మనకు సద్గురువు చెబుతున్నారు. పవిత్రమైన ఆలోచనలలో ఉన్నప్పుడు ఏది వచ్చినా ఇది భగవంతుని ప్రసాదం అని అనుకుంటాము. తృప్తి, సంతోషం ఎప్పుడు కలుగుతాయంటే భగవంతుడు నాలోనే ఉన్నాడు నాకు ఇంకేమి తక్కువ లేదు అని భావించినప్పుడు . మనకు తక్కువ ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే నా మీద నేను ఆధారపడినప్పుడు . ‘నేను ’ అనుకుంటే తృప్తి ఉండదు. అదే భగవంతుడు ఇస్తున్నాడు. అర్హతను బట్టి ఇస్తున్నాడు అనుకుంటే కనుక తృప్తిని ఇస్తుంది. “భక్తుడి యొక్క లక్షణం నిత్య సంతుష్ణుడు ” అని శ్రీ కృష్ణ భగవానుడు చెబుతారు.  నిత్యమూ తృప్తిగా ఉన్నవాడు నా భక్తుడు. అటువంటి భక్తుడు నాకు ప్రీతి పాత్రుడు. ఈ రోజు కోరికలే అవసరాలుగా అయినవి . తృప్తి లేకుండాపోయింది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది లభిస్తుంది. భగవంతుడు తలచుకుంటే నాకు అవసరమైనది ఇస్తాడు. నాకు ఎప్పుడు ఎంత అవసరమో అది భగవంతుడికి తెలుసు. ఇంత గొప్ప సృష్టిని సృస్టించిన ఆయన అవసరాలను తీర్చే విషయంలో  ఆయన ఎంత ఆలోచించి ఉంటాడో అని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ‘నేను చాలా అల్పుడను. అంత శక్తివంతమైన వాడు పరమాత్మ ’ అనే భావన కలుగుతుంది. ఈ భావన మనసులోని  అహంకారాన్ని దూరం చేస్తుంది. ఆనందం పొందటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి తృప్తిని కలిగినప్పడు భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ జీవన ప్రయాణంలో సుఖాన్ని , సంతోషాన్ని  , శాంతిని పొందగలుగుతాము. లేకపోతే ఏదో వెలితితో జీవిస్తాము. లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఉన్నది ఆనందాన్ని ఇవ్వదు. సంత్ మహాపురుషులు  పవిత్ర హృదయాన్ని కలిగిఉన్నారు. కాబట్టి తృప్తిని కలిగి ఉంటారు. ఏది వచ్చినా భగవంతుడు నాకు ఉపయోగపడేదే ఇస్తాడు. ఈ భావన అనవసరమైన వాటి మీద దృష్టిని పెట్టనివ్వదు .తమ కర్మలు తాము చేస్తూ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఫలితాన్ని మాత్రం పరమాత్మపై వదిలేస్తారు.
ఇంద్రియ నిగ్రహం గురించి ఒక చిన్న ఉదాహరణ. తాబేలు మామూలుగా వెళుతూ ఉంటుంది. తనకు ఏదైనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు తన అంగాలు ఏవైతే ఉన్నవో వాటిని అన్నింటిని లోపలకు ముడుచుకుంటుంది. నిశ్చలంగా ఉండిపోతుంది. అందువలన బాహ్యంగా జరిగే ప్రతి కూల పరిస్థితులు తనకు ఏమీ చేయలేవు. తాను మాత్రం నిశ్చలంగా ఉంటుంది. సంత్ మహాపురుషులు కూడా తమ ఇంద్రియాలు అన్నింటిని లోపలకు తీసుకుని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు  అని నిరంకారి బాబా అవతార్ సింగ్ జీ మహారాజ్ వారు చెబుతూ ఉంటారు.

 ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇమడవో ఒక హృదయంలో నిరంకారం అహంకారం అనేది కలిసి ఉండదు. ‘నేను ’ ఉన్నంత వరకు కూడా ఈ జన్మలెత్తుతూనే ఉంటారము. అంతా ‘నీవే ’ అన్నప్పుడు మాత్రమే పరమాత్మ  దగ్గరకి చేరుకోవటానికి , జనన మరణ చక్రం నుండి తప్పుకుని ఆనందంగా పరమాత్మ యొక్క సన్నిధిలో నివాసం ఏర్పరచుకోవటానికి ఆస్కారం ఉంది. అది ఈ యొక్క ఆత్మ జ్ఞానం ద్వారానే మనకి లభిస్తుంది తప్ప అన్యధా లభించదు. శరణాగతి భావం వాస్తవంగా కలిగినప్పుడు మాత్రమే ‘నేను ’ అనే భావాన్ని వీడగలను. ఈ వస్తువులు అన్నీ నేను సంపాదించాను అనుకుంటే ఈ వస్తువులు నేను వదలలేను.  ఈ వస్తువులు ఆయన ఇస్తే నాకు లభించాయి. అనుకుంటే దీనిని త్యాగం చేయటానికి ఎప్పుడు కూడా నేను సిద్దం . ఆ త్యాగ బుద్ధి భక్తిలో చాలా ప్రాధాన్యత వహిస్తుంది. ఆ త్యాగం సత్యాన్ని తెలుసుకోవటం ద్వారానే లభిస్తుంది తప్ప వేరేవాటి ద్వారా లభించటానికి ఆస్కారం లేదు. అందుకే జ్ఞానులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఈ త్యాగాన్ని కవచంగా , జ్ఞానాన్ని ఖడ్గంగా తీసుకుని ఈ భూమి మీద జీవితాన్ని జీవించారు. త్యాగం చేయాలి అంటే నాకు ఇష్టమైనది వదులుకోగలిగితే త్యాగ బుద్ది వస్తుంది. ఈ రోజు దానం చేస్తే ఉపయోగం లేనివస్తువునే  దానం చేస్తున్నారు. ఉపయోగం లేనిది చేయుట వలన మనకి వచ్చేది ఏమీ లేదు. నాకు ఇష్టమైనది నేను వదులుకుంటాను. అప్పుడు దాని వలన ఫలితం పొందగలను.

నిరంకారి బాబాజీ హరదేవ్ సింగ్ జీ మహారాజ్ తెలిపినట్లు, “ Life gets a meaning if it is lived for others .(లైఫ్ గెట్స్ ఎ మీనింగ్ యిఫ్ ఇట్ ఇస్ లివ్డ్ ఫర్ అదర్స్) ” . సంత్ మహాపురుషులు జ్ఞానులు తాము ఎలా ఉన్నప్పటికీ కూడా ఇతరుల సంక్షేమం కోరి మానవ కోటి యొక్క సుఖాన్ని ఆనందాన్ని పె౦పొందించటానికి తమ జీవితాలను త్యాగం చేస్తారు. 
                          
                             స్వపరిచయం
సద్గురువు ఈ బ్రహ్మజ్ఞానం ఇచ్చి మన మీద మనకి ఆధిపత్యం సాధించటానికి కావలసిన శక్తిని ప్రసాదించారు. లోకంలో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మీద ఆధిపత్యం సాధించాలి , బాహ్యమైన వాటిని తమ వశం చేసుకోవాలని తమ శక్తిని వినియోగించుకుంటున్నారు తప్ప తమ మీద తాము ఆధిపత్యం సాధించి ఈ జీవన ప్రయాణాన్ని సుఖంగా ఆనందంగా సాగిస్తూ ఇతరులకు కూడా అదే ఆనందాన్ని పంచాలనే భావన మాత్రం ఈ రోజు మానవుడిలో లేదు.
ఈ బ్రహ్మ జ్ఞానం  మన మీద మనకి ఆదిపత్యం సంపాదించటానికి ఉపయోగపడుతుంది. అందుకే అంటుంటారు మహాత్ములు మనం సాగించే ఈ ప్రయాణంలో  గడిచిపోయే ప్రతి గడియ కూడా ఆనందంగా మన చేతి నుండి చేయజారాలి అంటే ఉదయం లేచిన దగ్గరనుండి మనం నిద్రించే వరకు  ఆనందపు గడియలు మన చేతి నుండి చేజారుతూ ఉండాలి. అదే నిజమైన జీవితం . అప్పుడు మాత్రమే మనం ఆధిపత్యం సాధిస్తున్నట్లు మహాత్ములు చెప్పుతున్నారు. ఎందుచేతనంటే మన దగ్గర మనదంటూ ఏది లేదు. శరీరం లభించాక ఎన్నో వస్తువులు సంపాదించాం. ఇవి అన్నీ కూడా మనవి కావు. మనది అనేది ఏది అయినా ఉన్నది అంటే ఈ శరీరం . అది కూడా మనకి అప్పుగా లభించినది. ఇది కూడా భగవంతుడు రుణంగా ఇచ్చాడు. ఈ శరీరాన్ని రుణంగా ఇవ్వటానికి గల ఉద్దేశ్యం ఒకటే . ఈ శరీరం (దేహం) అనేది లేకపోతే మనం ఏ ఆనందం పొందుతున్నాము అని చెప్పుకుంటున్నామో ఆ ఆనందం ఎలా కలుగుతుంది? ఆనందం అనుభవిస్తున్నాము అనే భావన మనలో కలగటానికి ఆస్కారం లేదు. అందుచేత ఈ శరీరం మనకి రుణంగా ఇచ్చాడు కాబట్టి ఈ జీవనాన్ని సాగిస్తూ ప్రతి క్షణం ప్రతి గడియను కూడా ఆనందంగా ఆశ్వాదిస్తూ ఈ ప్రయాణాన్ని సాగించాలి. ఈ రీతిగా సాగించినటువంటి వారు ఈ జీవితాన్ని సార్ధకత చేసుకున్నవారు అని బాబాజీ పదే పదే తెలుపుతున్నారు. సంత్  మహాపురుషులు  సమయం యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ జీవనాన్ని ఎలా జీవిస్తున్నాం అనేది మనలని గమనించమంటున్నారు.
జీవిత ధన్యత  కోసం మనకి ఉండవలసిన గుణాలు చెప్పుతున్నారు బాబాజీ .  శ్రద్ధ ఉండాలి . జిజ్ఞాస అనేది కలిగి ఉండాలి . కఠోర సాధన చేయాలి.  సత్సంగం అనే శిక్షణ శాలకు తరచుగా లేక నిత్యం వస్తూ  మనం సాధించవలసిన ఈ వస్తువుని పొందటానికి కావలసిన సాధనకు ఏమి ఉపయోగపడతాయో వాటిని గుర్తించి వాటిని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. దీనిని మధ్యలో వదలకుండా చివరి వరకు చేయాలి. ఎప్పుడైతే గనుక సాధకులు( శిష్యులు) వీటిని క్రమ పద్ధతిలో కనుక జీవితంలో ఆచరించి ముందుకు  వెళతారో అటువంటి వారు పొందిన జ్ఞానం యొక్క పరిపూర్ణమైన ఫలితాన్ని, సద్గురువు యొక్క భగవంతుని యొక్క కృపని పొందటానికి ఆస్కారం ఉంది. వాస్తవంగా బ్రహ్మ జ్ఞానం ఇచ్చాక ఎవరితోనో పరిచయం చేయలేదు  - మనతో మనకి పరిచయం చేశారు.
నిజంగా ఈ లోకంలో ఆనందంగా జీవించటానికి ఇతరుల శక్తుల మీద ఆధిపత్యం సంపాదిస్తే ఆనందం వస్తుంది అంటే కనుక మనకి ఇతరులతో పరిచయం చేసి శిక్షణ ఇచ్చేవారు .మనకు బాహ్యమైన వాటితోటి ఏదైనా మంచి కలుగుతుంది అంటే వాటిని మన వశం చేసుకోవటానికి కావలసిన శిక్షణ మనకి ఇచ్చేవారు. కాని ఈ రోజు తత్వ జ్ఞానాన్ని తెలిపి ‘అహం బ్రహ్మాస్మి ‘ –“నీవే బ్రహ్మవి”  నీవే శక్తి మంతుడివి అనే సత్యాని  మనకు తెలిపారు.  కనుక నాతోనే నేను పరిచయం చేసుకోవాలి. మనతో మనం పరిచయం చేసుకున్నప్పుడే మనం పరిపక్వత చెంది పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో అర్ధంచేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోగలుగుతాము. 
                                                                    .........

                                     సాధన
కొందరి మాట మధురం .
  కొందరి చూపు కోమల౦ .
    కొందరి నైజం కరుణాపూరితం
       కొందరి హృదయం ప్రేమమయం
          కొందరి ప్రేమ నిస్స్వార్ధం
            కొందరి నడవడిక నిరాడంబరం
               కొందరి పరిచయం అమూల్యం
                   కొందరి సాంగత్యం ఆహ్లాదకరం
ఈ లక్షణాలలో కొన్ని మాత్రమే కొందరిలో ఉండవచ్చు.  కానీ   అన్నీ రాశీభూతమై ఒక్కరిలో కనబడటం అసాధారణం . అటువంటి అసాధారణ దైవస్వరూపుడే మన సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్. మానవుని సత్యాన్వేషణలో మార్గదర్శకుడు , దిక్సూచి సద్గురువే. సద్గురుని మాటను శిరసావహించి సేవ  , సత్సంగ్ మరియు స్మరణలో ఉంటూ  , పంచ ప్రమాణాలను పాటీంచేవాడే గమ్యమైన పరమాత్ముణ్ణి పో౦దగలడు.
 నాకు మోక్షం కలుగు గాక ! అనే  కోరిక ముముక్షత్వం 
      మోక్షం కోరే వాడు ముముక్షువు . జ్ఞానం కోరే వాడు జిజ్ఞాసువు.
మోక్షం అంటే విడుదల అని అర్ధం . ఎందులో౦చి విడుదల ? అజ్ఞానం లోంచి , అవిద్య లో౦చి విడుదల.  నువ్వు కాని దాన్ని నువ్వనుకు౦టున్నావు కాబట్టి ఆ తలంపులో౦చి నువ్వు విడుదల పొందటమే మోక్షం.
మోక్షం అంత తేలిక కాదు ! ఎంతో పూర్వ పుణ్య  లేకపోతే ముముక్షత్వం కలగదు. 
  మనుష్యత్వం , ముముక్షత్వం , మహా పురుష సంశ్రయః  అనే మూడు దుర్లభమైనవి  , దైవానుగ్రహం చేతనే అవి కలుగును అని  శంకరాచార్యులవారు  వివేక చూడామణి  లో చెప్పారు.

 నీకు మానవ జన్మ  రావడం  , ఆ తరువాత మోక్షం సంపాదించాలనే బలీయమైన కోరిక రావడం – ఈ రెండూ సరిపోవు . మహాపురుష సంశ్రయః అంటే నీకు మోక్షం ప్రసాదించే మహాత్ముల తోటి , యోగులతోటి పరిచయం కలగడం పూర్వ పుణ్యం లేకుండా జరగదు.
నీకు మోక్షం పొందాలనే కోరిక ఉంటేనే సరిపోదు . నీవు గతంలో ఏమైనా సత్కర్మలు చేసి ఉంటే  , ఆ సత్కర్మలు కూడా నిష్కామంగా చేసి ఉంటే మనుష్యత్వం , ముముక్షత్వం , మహాపురుష సంశ్రయము – ఈ మూడూ లభిస్తాయి. పరమాత్మ అంశమైన  నీవు పరమాత్ముని సన్నిధిని చేరటానికి  సద్గురువు చరణాలను చేరాలి . గురు వాక్యమునందు , శాస్త్ర విషయమునందును సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉ౦టూ ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ  , నిజ ధామాన్ని పొందాలి.
ఈ విధంగా సాధన చతుష్టయం అంటే : 1) నిత్యానిత్య వస్తు వివేకం
                                             2) వైరాగ్యం
                                            3) శమాది షట్కసంపత్తి
    (మనో నిగ్రహం ; ఇంద్రియ నిగ్రహం ; ఉపరతి ; తితిక్ష ; శ్రద్ధ; ఏకాగ్రత   )
                                        4)ముముక్షత్వం కలిగినవాడు సద్గురువు అనుగ్రహంతో ఆత్మజ్ఞానం పొంది అజ్ఞాన బంధాల నుండి విముక్తుడు అవుతాడు.       
                              _____________________      
  సత్సంగము –   వినటం ఒక కళ
సాధువుతో సంబంధము కలుపు , ముఖమున తేజం ఉట్టిపడు
సాధువుతో సంబంధము కలుపు , మురికి తొలగి మనసు గట్టిపడు
-        సంపూర్ణ అవతార వాణి ( 56 )
పైన చెప్పిన విధంగా ఏ మానవుడు సాధుసా౦గత్యం చేస్తాడో అటువంటి మానవుని మనస్సు శుద్దిపడి ముఖమున తేజమును ప్రసరింప చేస్తుంది .
“ Face is the index of the mind
మనస్సులో కలిగేటటువంటి ఆలోచనలు ముఖం మీద ప్రతిబింబిస్తాయి.
ఇదే విషయాన్ని రామ చరిత మానస్ లో నవ విధ భక్తిని గురించి సంత్ తులసి దాస్ –
ద్వితీయ భక్తిగా మనస్సు పెట్టి సాంగత్యం చేయమని శ్రీ రామ చంద్రుల వారు శబరికి బోధి౦చినట్లు తెలియచేసారు.
కావున సత్సంగమునకు వెళ్ళటమంటే  భౌతిక శరీరముతో ఆ ప్రదేశములో కూర్చోవడమే గాక  మనస్సును కూడా అక్కడ ఉన్నమహాత్ముల యొక్క  అమూల్యమైనటువంటి  ప్రవచనాలపై కేంద్రీకరించాలి. అందుచేతనే  మహాపురుషులు సత్స౦గంలో శ్రవణం చేయటము కూడా  ఒక కళగానే వర్ణించారు.

సత్సంగమునకు మనకు తెలిసిన దానిని చెప్పడానికి గాక , మహాపురుషులు చెప్పే దానిని వినటానికి వెళ్ళాలి.
రండి! ఈ విషయం గురి౦చి ఆత్మ విశ్లేషణ చేసుకుందాం .
·       సత్సంగ౦ సమయములో  ప్రవచనం చెప్పటానికి అవకాశం లభిస్తే  , మనము కేవలము సత్సంగం మరియు సద్గురువు  పట్ల మన మనస్సులోని శుద్ధ భావాలను వ్యక్తపరుస్తున్నామా  లేక ఇతరులకు వినిపించటానికి  , మనలోని ప్రతిభను ప్రదర్శించే లక్ష్యముతో చెపుతున్నామా ?
·       సత్సంగములో  తమకు ఆనందం కలిగి౦చేటటువంటి మంచి మాటలు వక్త ద్వారా వినినప్పుడు వాటి మీద దృష్టి పెట్టక ఆ వక్త యొక్క వ్యక్తిగత జీవనాన్ని  చూస్తున్నామా , మరియు వారు జీవితంలో వీటిని ఆచరి౦చనప్పుడు  మనం ఎందుకు స్వీకరి౦చాలి ! అన్న భావన కలుగుతుందా ?
·        మన ధ్యాస వక్త చెప్పిటటువంటి విషయాలపై కేంద్రీకరిస్తున్నామా  లేక వారి హావ భావాలు లేక వారి రూపాన్ని చూసి వారి గుణ అవగుణాలను బేరిజి వేస్తున్నామా ?
·       గీతాలు మరియు భజనలు వి౦టునప్పుడు మన దృష్టి వాటి యొక్క భావము యందు నిలుపుతున్నామా లేక ఆ పాట యొక్క సంగీతము మరియు వరుస మీదే కే౦ద్రీకరిస్తున్నామా ! ఎలాగంటే పాడే వారు లయబద్ధంగా పాడారా , స్వరము బాగుందా మొదలగునవి ఆలోచిస్తున్నామా ?
·       మనకు చెప్పటానికి అవకాశము కలిగినప్పుడు మాత్రమే సద్గురువుకి కృతజ్ఞత తెలుపుతున్నామా లేక లభించకపోయినా అదే భావనను కలిగి ఉంటున్నామా ?
·       సత్సంగమునకు ఆలస్యంగా వచ్చినప్పుడు అందరికంటే ముందు వరసలో కూర్చోవటానికి ప్రయత్నిస్తున్నామా లేక ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే మౌనంగా కూర్చు౦టామా ! అనగా సత్సంగం వినేటటువంటి  తోటి  మహాత్ములకు అసౌకర్యం  కలిగిస్తున్నామా ?
·       సత్సంగంలో మన ప్రవచనం అయ్యాక ఇతర మహా పురుషుల ప్రవచనాలను వినటానికి ఆసక్తి చూపుతున్నామా లేక ఆ సమయ౦లో లేక కొద్ది సమయం తరువాత మన ఇతర పనులను చూసుకోవటానికి సత్సంగ ప్రదేశమును వదిలి అటూ ఇటూ తిరుగుతున్నామా ?
·       సత్సంగంలో విన్నటువంటి అమూల్యమైన వచనాలను ఇంటికి వెళ్ళాక కుటుంబ సభ్యులతో పంచుకొని , విచారణ చేస్తున్నామా మరియు వాటిని వ్యవహారిక జీవనానికి అన్వయి౦చుకోవటానికి ప్రయత్నిస్తున్నామా లేక విన్న మాటలను సత్సంగం లోనే వదిలేసి వస్తున్నామా?
·       నిర్ణీత సమయము దాటి సత్సంగం జరిగినప్పుడు మనము ప్రశాంత చిత్తంతో కూర్చొని సత్సంగం పై ధ్యాస ఉంచగలుగుతున్నామా లేక  అసహనానికి లోనవుతున్నామా ?
ఈ విధముగా మనలను మనమే ప్రశ్నించుకొని  మన నిజ  స్థితిని గుర్తించటానికి ప్రయత్నించాలి.
ఒక మంచి శ్రోతే ఒక మంచి వక్త  కాగలడు
మనము వినటమనే కళను పెంపొందించుకొని మన జీవనములో ఏ ఆనందాన్ని సద్గురువు తీసుకు రావాలని కోరుకుంటున్నారో ఆ శీతలత్వాన్ని  మనము పొందినప్పుడే  దానిని  ఇతరులకు కూడా అ౦దించటానికి  కారకులవ్వగలం.

  సత్సంగ్ ఏక్ గంగా హై  !   జిస్ మై జో   నహతే హై !
    పాపి సే  పాపి భీ పావన్ హో జాతే హై  !! 
సత్సంగం గంగా నది వంటిది.  దీనిలో ఎవరైతే స్నానమాచరిస్తారో పాపులలోకెల్లా పాపాత్ములైనప్పటికీ తరిస్తారు.
                                                                              -----